పుతిన్‌కు జిన్‌పింగ్‌ షాక్‌ | China Sent Its Tallest Official To Tower Over Putin As He Arrived | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు జిన్‌పింగ్‌ షాక్‌

Nov 20 2026 11:16 AM | Updated on Nov 20 2026 12:44 PM

China Sent Its Tallest Official To Tower Over Putin As He Arrived

అమెరికాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు చైనా అడుగులు వేస్తోందా? చిరకాల మిత్రుడు పుతిన్‌ను పక్కనపెట్టి ట్రంప్‌కు పెద్దపీట వేస్తోందా? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తీరు ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఏపీఈసీ సదస్సులో ట్రంప్‌కు ఘన స్వాగతం, ఆలింగనం.. పుతిన్‌కు మాత్రం సాధారణ ఆహ్వానం.. ఫొటోల్లోనూ దూరం.. ఇలా చోటుచేసుకున్న పరిణామాలు బీజింగ్‌ దౌత్య వ్యూహంలో మార్పులపై అనేక సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

పుతిన్‌కు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్వయంగా వెళ్లలేదు. పుతిన్‌ కంటే చాలా ఎత్తుగా ఉండే తన సహాయకుడిని స్వాగతం పలికేందుకు పంపించారు. పుతిన్‌ను జిన్‌పింగ్ ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నవంబర్‌ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్‌లో జరిగిన ఏపీఈసీ సదస్సులో జిన్‌పింగ్‌.. ట్రంప్‌, పుతిన్‌లకు ఇచ్చిన ఆతిథ్యంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది.

చైనా-రష్యా దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. గతంలో పుతిన్‌ బీజింగ్‌ పర్యటనలకు వచ్చినప్పుడు జిన్‌పింగ్‌ స్వయంగా స్వాగతించిన సందర్భాలు ఉన్నాయి. అయితే నవంబర్‌ 18న ట్రంప్‌ రాక సందర్భంగా పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. అమెరికా అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు జిన్‌పింగ్‌ స్వయంగా షెన్‌జెన్‌ బావాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం వద్దకు వెళ్లి ట్రంప్‌కు స్వాగతం పలికారు. అంతేకాదు.. ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఆయనను ఆలింగనం చేసుకున్నారు. 

సైనిక గౌరవ వందనం, చిన్నారుల స్వాగతం, సైనిక విమానాల విన్యాసాలు, ఇరు దేశాల జాతీయ గీతాల ప్రదర్శనతో ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. మే నెలలో ట్రంప్‌ గతంలో చైనా పర్యటనకు వచ్చినప్పుడు జిన్‌పింగ్‌ స్వయంగా విమానాశ్రయంలో స్వాగతం పలకలేదు. ఈసారి మాత్రం అమెరికా-చైనా సంబంధాలకు తాము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చూపించేలా బీజింగ్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

స్వాగత కార్యక్రమంలోనూ ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది. ట్రంప్‌ రాక సందర్భంగా అమెరికా జాతీయ గీతాన్ని ఆర్కెస్ట్రా ప్రదర్శించగా.. పుతిన్‌ రాక సందర్భంగా రష్యన్‌ నృత్యం ‘ట్రెపాక్‌’ను వినిపించారు. ఆ తర్వాత ఫొటో సెషన్‌లోనూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నవంబర్‌ 18న విందుకు ముందు జరిగిన ఫొటో కార్యక్రమంలో జిన్‌పింగ్‌, ట్రంప్‌ పక్కపక్కనే నిలబడ్డారు. పుతిన్‌ అక్కడికి చేరుకోగానే ఆయనను మరో స్థానంలో నిలబడేలా చైనా అధ్యక్షుడు సూచించినట్లు వీడియోల్లో కనిపించింది.

ఇదీ చదవండి: వాయేజర్-1 నుంచి సందేశం.. అందులో ఏముందంటే?

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement