అమెరికా, చైనా దేశాలు పరస్పరం గూఢచర్యం చేసుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా తమపై నిఘా పెట్టినట్లే తాము కూడా చైనాపై నిఘా పెడుతున్నామని, అయితే తామే వారికంటే మెరుగ్గా గూఢచర్యం చేస్తామని ఆయన అన్నారు. చైనా పర్యటనలో భాగంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీకి ముందు ట్రంప్ మాట్లాడుతూ.. చైనా గూఢచర్యాన్ని ఆపాలని తాను కోరితే, అమెరికా కూడా అదే పని ఆపాలని చైనా అడుగుతుందని చెప్పారు. అయితే తాము మాత్రం గూఢచర్యం ఆపుతామో లేదో చెప్పలేనన్నారు.
మరోవైపు ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వివాదంపైనా ట్రంప్ స్పందించారు. ఆయనతో సంబంధం ఉన్న మహిళ చైనా గూఢచారి అన్న ఆరోపణలపై తనకు సమాచారం లేదన్నారు. అయితే ఆమె మాత్రం అందమైన మహిళ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం చైనాకు అధునాతన కంప్యూటర్ చిప్స్ విక్రయించడంపై స్పందిస్తూ.. అమెరికాకు వ్యాపారం, ఆదాయం ముఖ్యమని అందుకే చిప్స్ విక్రయించేందుకు తాము అనుమతిస్తున్నామని ట్రంప్ తెలిపారు.
ఇదీ చదవండి: దావూద్ ఇబ్రహీం భవనం కూల్చివేతపై వివాదం


