పాక్‌ అసలు రంగును బయటపెట్టిన భారత్‌ | India Exposes Pak Military Enriching From Mineral Resources | Sakshi
Sakshi News home page

పాక్‌ అసలు రంగును బయటపెట్టిన భారత్‌

Nov 19 2026 1:23 PM | Updated on Nov 19 2026 1:30 PM

India Exposes Pak Military Enriching From Mineral Resources

పాకిస్తాన్‌ సైన్యం ఆ దేశ సంపదను ప్రజల కోసం కాకుండా.. తన స్వప్రయోజనాల కోసం దోచుకుంటోందంటూ ఐక్యరాజ్యసమితి వేదిక(యూఎన్‌)గా భారత్‌ గట్టిగా నిలదీసింది. మునీర్‌ ఖనిజాల పెట్టె ప్రదర్శనను ప్రస్తావిస్తూ పాక్‌ అసలు రంగును బయటపెట్టింది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ గత సెప్టెంబర్‌లో విదేశీ నేతలకు ఖనిజ రాళ్లతో నిండిన పెట్టెను చూపించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ దేశంలో సహజ వనరుల దోపిడీ వెనుక సైన్యం పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ వ్యాఖ్యానించారు.

సహజ వనరులపై జరిగిన యూఎన్‌ సమావేశంలో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ ప్రజలకు మేలు జరగాలంటే ఆ దేశ అసలు పాలకులైన సైన్యం.. సహజ వనరులను ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాలని.. వ్యక్తిగత ప్రతిష్ట, స్వప్రయోజనాల కోసం కాదని ఆయన హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌, పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సమావేశానికి సంబంధించి గత ఏడాది వైట్‌హౌస్‌ విడుదల చేసిన ఫొటోను భారత ప్రతినిధి ప్రస్తావించారు.

ఆ ఫొటోలో ట్రంప్‌ ఆసక్తిగా చూస్తుండగా.. మునీర్‌ అరుదైన ఖనిజాలతో నిండిన చెక్క పెట్టెను ఆయనకు చూపిస్తున్నట్లు ఉంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పక్కన నిలబడి చూస్తున్నట్లు కనిపించారు. ఈ ఘటన పాకిస్తాన్‌లోనూ విమర్శలకు దారితీసింది. మునీర్‌ వ్యవహారశైలిని ఓ దుకాణదారుడు తన సరుకును కస్టమర్‌కు చూపిస్తున్నట్లుగా ఓ పాక్‌ సెనేటర్‌ పోల్చారు. ఆర్మీ చీఫ్‌ కాస్తా 'సేల్స్‌మన్‌ ఇన్‌ చీఫ్‌'గా మారిపోయారని సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇదీ చదవండి: Bangladesh: యూనుస్ ఇంటికి నిప్పు.. దేశమంతటా హింస!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement