న్యూఢిల్లీ: 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా గేమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన గ్రాండ్ తెఫ్ట్ ఆటో-6 (జీటీఏ-6) భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్థానిక సమయం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు గేమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గేమ్ కోసం బ్రిటన్‌లో పలువురు ఉద్యోగులు కార్యాలయాలకు సెలవు పెట్టడం విశేషం.
ప్రస్తుతం జీటీఏ-6 ప్లేస్టేషన్ 5 (పీఎస్‌ఎస్) ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/S కన్సోళ్లపై అందుబాటులో ఉంది. పీసీ వెర్షన్‌ను ఇంకా విడుదల చేయలేదు. దాని కోసం మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి సుమారు 212 జీబీ స్టోరేజ్ అవసరమవుతుందని సమాచారం. ఈసారి గేమర్లు వైస్ సిటీ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం స్ఫూర్తితో లియోనిడా అనే కల్పిత ప్రాంతాన్ని రూపొందించారు. ఇందులోని వైస్ సిటీ.. మియామీ నగరానికి కల్పిత రూపం. జేసన్ డువాల్, లూసియా కామినోస్ అనే ఇద్దరు కొత్త ప్రధాన పాత్రల చుట్టూ కథ సాగుతుంది. గేమ్ విడుదలకు ముందే విడుదలైన ట్రైలర్ సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లో విడుదలైన తొలి 24 గంటల్లోనే 9.3 కోట్ల వ్యూస్ సాధించింది.
ఇదీ చదవండి: ఇందిరకు ప్రధాని మోదీ నివాళులు


