పటియాలా: పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాటియాలా–సంగ్రూర్ బైపాస్‌పై పాసియానా గ్రామం సమీపంలో భాక్రా కాలువపై ఉన్న వంతెన గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో రెండు ట్రక్కులు శిథిలాల మధ్య చిక్కుకుపోయాయి. వాటిలో ఒక ట్రక్కుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ట్రక్కుకు అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో వాహనాలు వంతెనపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అది కూలిపోయింది. దీంతో రెండు ట్రక్కులు కాలువలో పడిపోయాయి. ప్రమాద సమయంలో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం గురించి ట్రక్కు డ్రైవర్ రాజ్‌వీర్ మాట్లాడుతూ.. వంతెన కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందే తన వాహనం దానిని దాటిందని చెప్పాడు.
ఒక్కసారిగా పేలుడు లాంటి శబ్దం వినిపించిందని, ఏం జరిగిందో తెలుసుకునేలోపే వంతెన కూలిపోయిందన్నారు. రెండు ట్రక్కులు కూలిన వంతెన భాగంలో పడిపోగా, వాటిలో ఒకటి మంటల్లో పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. అయితే ఈ వంతెన గత కొంతకాలంగా కంపిస్తోందని రాజ్‌వీర్ ఆరోపించారు. వాహనాలు వెళ్లేటప్పుడు కుదుపులకు గురవుతోందని.. వంతెనపై ప్రకంపనలు వస్తున్నాయని చెప్పాడు. ముందుగానే వంతెనను మూసివేసి మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదన్నారు.
మరో ట్రక్కు డ్రైవర్ సుఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున చీకటిగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు. వాహనాలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తుండగా ముందున్న ట్రక్కు తొలుత కూలిన వంతెనలో పడిపోయిందని, ఆ తర్వాత తమ వాహనం కూడా కిందకు పడిపోయిందని వివరించాడు.
A bridge collapsed over #BhakraCanal on Patiala-Sangrur road near Patiala on the wee hours of today, no casualty reported but two trucks get stuck, villagers rescued the drivers https://t.co/NwzDGPagpd
— Neel Kamal (@NeelkamalPb) November 19, 2026
ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. అసలేం జరిగింది?


