ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. అసలేం జరిగింది? | Five Of Family Found Dead In Well In Karur Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. అసలేం జరిగింది?

Nov 19 2026 8:40 AM | Updated on Nov 19 2026 8:45 AM

Five Of Family Found Dead In Well In Karur Tamil Nadu

తమిళనాడులోని కరూర్‌లో విషాదం చోటుచేసుకుంది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బావిలోపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను వంగల్‌ సమీపంలోని చిన్నకాళిపాళయం గ్రామానికి చెందిన రామసామి (62), ఆయన భార్య జానకి (60), కుమార్తె సుగుణ, సుగుణ పిల్లలు శివాని (10), ఆథిరన్‌ (4)గా గుర్తించారు. రామసామి టైల్స్‌ వేసే పనులు చేస్తూ జీవనం సాగించేవారు.

కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిలోని బావిలో మృతదేహాలు తేలుతూ కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కరూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కుటుంబంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా? అప్పుల ఒత్తిడి ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తతో విభేదాల కారణంగా సుగుణ కొన్ని రోజుల క్రితం పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చినట్లు తెలిసింది. ఐదుగురూ చీరతో ఒకరికొకరు కట్టుకుని బావిలో దూకినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: తమిళనాట పొలిటికల్‌ ట్విస్ట్‌.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement