ఢిల్లీ: ఒకవైపు అంతర్జాతీయ వేదికపై చర్చలు.. మరోవైపు భారత్‌పై గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. పాకిస్థాన్‌కు చెందిన ఓ కీలక మంత్రి భారత్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన పాత వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌ను ఉద్దేశించి ‘మా నీళ్లను ముట్టుకుంటే చేతులు నరికేస్తాం’ అంటూ హెచ్చరించిన పాక్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ ఇప్పుడు ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశానికి హాజరుకానున్నారు.
జూన్‌లో జరిగిన ఓ సెమినార్‌లో మాలిక్ మాట్లాడుతూ.. తమ నీటిని ఎవరైనా ముట్టుకుంటే వారి చేతులు నరికేస్తామని వ్యాఖ్యానించారు. అంతకుముందు దుషాంబేలో జరిగిన జల సదస్సులోనూ భారత్ జల దురాక్రమణకు పాల్పడకూడదని హెచ్చరిస్తూ, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని గౌరవించాలని కోరారు. ఇదిలా ఉండగా.. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య జల వివాదం కూడా కొనసాగుతోంది.
Pakistan picks Climate Minister Musadik Malik over its Culture Minister for the SCO Dialogue in Delhi. The minister who threatened to “cut off hands” over the Indus waters is now heading to India. https://t.co/tr5QzKiMeX
— Shalinder Wangu (@Wangu_News18) November 15, 2026
మూడేళ్ల తర్వాత పాక్ మంత్రి భారత పర్యటన
ముసాదిక్ మాలిక్ పర్యటనకు మరో ప్రత్యేకత ఉంది. 2023లో గోవాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ ఫెడరల్ మంత్రి భారత్‌లో పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ నుంచి భారత్‌కు వస్తున్న తొలి కీలక నేత పర్యటన కూడా ఇదే. నవంబర్ 20 నుంచి 22 వరకు ఢిల్లీలోని చారిత్రక పురానా ఖిలాలో ఎస్‌సీఓ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరం జరగనుంది. తొలుత పాకిస్థాన్ సాంస్కృతిక, జాతీయ వారసత్వ శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి భారత్ ఆహ్వానం పంపింది. అయితే పాకిస్థాన్ ఆయన స్థానంలో ముసాదిక్ మాలిక్‌ను నామినేట్ చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ నవంబర్ 14న అధికారికంగా ప్రకటించింది.
నీటి వివాదంపై చర్చిస్తారా?
ఢిల్లీలో పర్యటన సందర్భంగా సింధు జలాల ఒప్పందం అంశాన్ని ప్రస్తావిస్తారా? అన్న ప్రశ్నకు మాలిక్ స్పందిస్తూ.. ఇది ద్వైపాక్షిక చర్చల వేదిక కాదని, నాగరికతల మధ్య సంభాషణ కోసం నిర్వహిస్తున్న కార్యక్రమమని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. చైనా, రష్యా, భారత్, పాకిస్థాన్ సహా మొత్తం 10 దేశాలు ఎస్‌సీఓలో సభ్యులుగా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా సభ్య దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన, ఉమ్మడి వారసత్వం, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాలిక్.. ఇప్పుడు అదే దేశంలో జరిగే అంతర్జాతీయ సమావేశానికి హాజరవుతుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చదవండి: తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. స్టాలిన్‌కు కొత్త దోస్తీ!


