శ్రీలంకతో రెండో టెస్ట్‌.. పాక్‌కు భారీ ఆధిక్యం | PAK VS SL 2nd Test Day 2 Stumps: Sri Lanka trail by 153 runs | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో రెండో టెస్ట్‌.. పాక్‌కు భారీ ఆధిక్యం

Nov 19 2026 8:44 AM | Updated on Nov 19 2026 8:44 AM

PAK VS SL 2nd Test Day 2 Stumps: Sri Lanka trail by 153 runs

source: X

రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 98 పరుగులకే కుప్పకూలగా.. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆ జట్టుకు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు శ్రీలంక ఇంకా 153 పరుగులు వెనుకపడి ఉంది.

లంక ఇన్నింగ్స్‌ (రెండవ)లో లహీరు ఉదార (7), చండీమల్‌ (0), కమిందు మెండిస్‌ (16) ఔట్‌ కాగా.. పసిందు సూరియబండార (18), ధనంజయ డిసిల్వ (24) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో సాకిబ్‌ ఖాన్‌, రజావుల్లా, ఆమిల్‌ జమాల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

325 పరుగులకు ఆలౌట్‌
పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. ఘాజీ ఘోరీ (54) అర్ద సెంచరీతో రాణించగా.. అజాన్‌ అవైస్‌ (47), తయ్యబ్‌ ఆరిఫ్‌ (46), సాకిబ్‌ ఖాన్‌ (37), రజావుల్లా (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో లహీరు కుమార్‌ 5 వికెట్లు పడగొట్టగా.. అసిత ఫెర్నాండో 3, మిలన్‌ రత్నాయకే, ప్రభాత జయసూర్య తలో వికెట్‌ దక్కించుకున్నారు.

98 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
పాక్‌ బౌలర్లు తలో చేయి వేయడంతో లంక ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. మొహమ్మద్‌ అబ్బాస్‌, రజావుల్లా, ఆమిర్‌ జమాల్‌ తలో 3 వికెట్లు తీయగా.. సాకిబ్‌ ఖాన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్‌లో కుసాల్‌ మెండిస్‌ (32), సోనల్‌ దినుషా (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement