Photo Credit: Twitter
రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగారు. పాక్ పేసర్ల ధాటికి లంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటయ్యింది. కెప్టెన్ కుసాల్ మెండిస్ (32) టాప్ స్కోరర్‌గా నిలవగా, సోనాల్ దినూష (21) పర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, రజాఉల్లా, అమెర్ జమల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా, సకీబ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
రావల్పిండి వేదికగా జరిగిన టెస్టుల్లో లంకదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. అజాన్ అవైస్ (11), తయాబ్ ఆరిఫ్ (5) క్రీజులో ఉన్నారు. కాగా పాకిస్తాన్‌తో టెస్టుల్లో వంద లోపే ఆలౌట్ కావడం లంకకు ఇది నాలుగోసారి.
గతంలో 1994లో కాండీ వేదికగా 71 పరుగులకు కుప్పకూలిన శ్రీలంక, 2006లో ఇదే కాండీ వేదికగా 73 పరుగులుకు ఆలౌటైంది. ఇక 2017లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంక 96 పరుగులకు కుప్పకూలగా, తాజాగా 98 పరుగులకు ఆలౌటైంది. రావల్పిండి వేదికగా జరిగిన టెస్టుల్లో మాత్రం శ్రీలంకదే అత్యల్ప స్కోరు. గతంలో ఇంగ్లండ్ (112 ఆలౌట్), పాకిస్తాన్ (138 ఆలౌట్), వెస్టిండీస్ (139 ఆలౌట్), పాకిస్తాన్ (145 ఆలౌట్) లోస్కోర్లు నమోదయ్యాయి.
Sri Lanka all out for 98 in their first innings against Pakistan in the 2nd Test in Rawalpindi. Kusal Mendis scored 32 and Sonal Dinusha 21. https://t.co/hI62PDt48U
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) November 17, 2026
ఇదీ చదవండి: గుజరాత్ టైటాన్స్‌లోకి సన్‌రైజర్స్ స్టార్ బౌలర్


