మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్‌.. హైద‌రాబాద్ సంచ‌ల‌న విజయం | Hyderabad-One-Wicket Thrilling Victory Vs Chhattisgarh SMAT 2026 | Sakshi
Sakshi News home page

మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్‌.. హైద‌రాబాద్ సంచ‌ల‌న విజయం

Nov 16 2026 9:24 PM | Updated on Nov 16 2026 9:39 PM

Hyderabad-One-Wicket Thrilling Victory Vs Chhattisgarh SMAT 2026

Photo Credit: Twitter

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైద‌రాబాద్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోరులో హైదరాబాద్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చ‌త్తీస్‌గ‌ఢ్ 19.2 ఓవ‌ర్ల‌లో 168 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

దేవ్ ఆదిత్య సింగ్ (29 బంతుల్లో 47) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా, ఆయుశ్ పాండే (37), ప్ర‌తీక్ యాద‌వ్ (21) ప‌ర్వాలేద‌నిపించారు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో అజ‌య్ దేవ్ గౌడ్ 4 వికెట్లు తీయ‌గా, సీవీ మిలింద్ మూడు, చింత‌ల ర‌క్ష‌ణ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం 169 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఆఖ‌రి బంతికి విజ‌యాన్ని అందుకుంది. 

హిమ‌తేజ (37), అభిర‌థ్ రెడ్డి (34), రాహుల్ బుద్ధి (28) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడ‌గా, ఆఖ‌ర్లో త‌న‌య్ త్యాగ‌రాజ‌న్ (11 బంతుల్లో 19) మెరుపు ఇన్నింగ్స్‌తో విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు. చ‌త్తీస్‌గ‌ఢ్ బౌల‌ర్ల‌లో జ‌యంత్ యాద‌వ్‌, విజ‌య్ యాద‌వ్‌, దేవ్ ఆదిత్య త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా సీజ‌న్‌లో హైదరాబాద్‌కు ఇది తొలి విజ‌యం. ముంబైతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో హైద‌రాబాద్ ఓట‌మి చ‌విచూసింది. మ‌రోవైపు చ‌త్తీస్‌గ‌ఢ్ రెండు మ్యాచ్‌లాడి ఒక గెలుపు, ఒక ఓట‌మితో మూడో స్థానంలో ఉంది.

ఇదీ చదవండి: సెంచ‌రీతో చెల‌రేగిన సౌతాఫ్రికా ఓపెన‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement