సంజూ శాంసన్‌ మెరుపులు.. 16 బంతుల్లోనే.. | SMAT 2026: Kerala Captain Sanju Samson 16 Ball 47 Vs Maharashtra | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌ మెరుపులు.. 16 బంతుల్లోనే..

Nov 16 2026 6:33 PM | Updated on Nov 16 2026 6:38 PM

SMAT 2026: Kerala Captain Sanju Samson 16 Ball 47 Vs Maharashtra

PC: BCCI Domestic/KCA X

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌, కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ మెరుపులు మెరిపించాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026 సీజన్‌లో సంజూ కేరళ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

తొలి మ్యాచ్‌లో సంజూ విఫలం
ఈ క్రమంలో కేరళ తొలుత మధ్యప్రదేశ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో సంజూ (4)తో పాటు జట్టు కూడా విఫలమైంది. ఫలితంగా మధ్యప్రదేశ్‌ చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తాజాగా ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా సోమవారం మహారాష్ట్రతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కేరళ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

రోహన్‌ కణ్ణుమ్మల్‌ ధనాధన్‌
ఓపెనర్లలో మహ్మద్‌ అజారుద్దీన్‌ (1) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన అహ్మద్‌ ఇమ్రాన్‌ (13) కూడా నిరాశపరిచాడు. అయితే, మరో ఓపెనర్‌ రోహన్‌ కణ్ణుమ్మల్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన సంజూ శాంసన్‌తో కలిసి మూడో వికెట్‌కు 26 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

సంజూ కేవలం 16 బంతుల్లోనే
రోహన్‌ మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 75 పరుగులు సాధించాడు. మరోవైపు.. సంజూ కేవలం 16 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది ఏకంగా 47 పరుగులు రాబట్టాడు. అయితే, విక్కీ ఓస్త్వాల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠికి ‍క్యాచ్‌ ఇచ్చి సంజూ అవుటయ్యాడు.

మిగిలిన వారిలో విష్ణు వినోద్‌ 19 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. సల్మాన్‌ నిజార్‌ 13 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో కేరళ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి విఫలమైన సంజూ.. ఈసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగి రాణించడం విశేషం. 

ఇవీ చదవండి: ‘ఆర్సీబీ’ కెప్టెన్‌ పాటిదార్‌ ప్రపంచ రికార్డు
IND vs NZ Tests: షెడ్యూల్‌, మ్యాచ్‌ ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement