breaking news
Rohan Kunnummal
-
సంజూ శాంసన్ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీ
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 సీజన్లో కేరళ తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపింది. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా ఒడిషా (Kerala Vs Odisha)తో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఒడిషా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్వస్తిక్ సమాల్ (14 బంతుల్లో 20), గౌరవ్ చౌదరి (15 బంతుల్లో 29) మెరుగ్గా రాణించారు.176 పరుగులుమిగతా వారిలో వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాంషు నేనాపతి (15) నిరాశపరచగా.. కెప్టెన్ సమంత్రయ్ (41 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకంతో సత్తా చాటాడు. అతడికి తోడుగా సంబిత్ ఎస్ బరాల్ (32 బంతుల్లో 40) రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఒడిషా ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. కేరళ బౌలర్లలో నిధీశ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆసిఫ్ రెండు, అంకిత్ శర్మ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.బౌండరీల వర్షంఇక ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళకు ఓపెనర్లు కెప్టెన్ సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆది నుంచే ఒడిషా బౌలర్లపై ఎదురుదాడికి దిగి బౌండరీల వర్షం కురిపించారు. సంజూ 41 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 51 పరుగులు సాధించాడు.సంజూ ధనాధన్.. రోహన్ విధ్వంసకర సెంచరీమరోవైపు.. రోహన్ విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 121 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండటం విశేషం. సంజూ, రోహన్ అజేయంగా నిలవడంతో 16.3 ఓవర్లలోనే కేరళ వికెట్ నష్టపోకుండా 177 పరుగులు సాధించి జయభేరి మోగించింది.ఇదిలా ఉంటే.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో తొలి వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించిన ఓపెనింగ్ జంటగా సంజూ శాంసన్, రోహన్ కణ్ణుమ్మల్ రికార్డు సాధించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కావాల్సినంత ప్రాక్టీస్కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే జట్టులో మరోసారి సంజూకు చోటివ్వలేదు సెలక్టర్లు. ఇక దేశీ టీ20 టోర్నీలో ప్రదర్శన ఆధారంగానైనా టీ20 జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్-2026కు సన్నద్ధమయ్యే క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ దొరకనుంది.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్‌లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్‌లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్‌లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్‌ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్‌పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్‌లో వెస్ట్ జోన్‌పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్‌పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్‌పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
IPL 2023: యువ బ్యాటర్ కోసం సంజూ శాంసన్ ప్లాన్! భారీ ధర పలికే అవకాశం?
IPL 2023 Mini Auction- Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఒక్కసారి ఈ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకుంటే చాలు జాతీయ సెలక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చనే నమ్మకాన్ని ఇచ్చింది. దినేశ్ కార్తిక్ వంటి వెటరన్ ప్లేయర్ల పునరాగమనానికైనా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ వంటి యువ ఆటగాళ్ల ఎంట్రీకైనా మార్గం సుగమం చేసింది. అందుకే ఈ మెగా ఈవెంట్లో ఆడే అవకాశం రావాలని చాలా మంది ఆటగాళ్లు కోరుకుంటారు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ కేరళ యువ సంచలనం కేరళ బ్యాటర్ రోహన్ కన్నుమ్మల్ కూడా ఈ కోవకు చెందినవాడే. దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపుతున్న ఈ యువ ప్లేయర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో భాగం కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ విషయంలో అతడికి అండగా నిలబడ్డాడు టీమిండియా ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్. రోహన్ కన్నుమ్మల్ వరుస సెంచరీలు దేశవాళీ టోర్నీల్లో కేరళ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహన్.. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. అదే విధంగా సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చిన 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్ మరో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సంప్రదాయ క్రికెట్లో 414 పరుగులతో కేరళ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బంగ్లాదేశ్‌తో తలపడనున్న ఇండియా- ఏ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. డిసెంబరు 23న ఐపీఎల్ 2023 మినీ వేలం నేపథ్యంలో ఇప్పటికే పలు జట్లు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రోహన్ రాజస్తాన్ ట్రయల్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ విషయం గురించి అతడు ఓ స్పోర్ట్స్ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ.. సంజూ శాంసన్ తనకు సాయం చేశాడని పేర్కొన్నాడు. సంజూ శాంసన్ ‘‘కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నాకు రెండుమూడు సార్లు కాల్స్ వచ్చాయి. అయితే, రాష్ట్ర స్థాయి ఈవెంట్ల కారణంగా నేను ట్రయల్స్‌కు హాజరుకాలేకపోయాను. అయితే, సంజూ శాంసన్ పట్టుబట్టి మరీ నాతో పాటు మరికొంత మంది కేరళ ఆటగాళ్లను రాజస్తాన్ రాయల్స్ ట్రయల్స్‌కు తీసుకెళ్లాడు. రాజస్తాన్, ఢిల్లీ జట్ల ట్రయల్ ఈవెంట్లో సంతృప్తికర ప్రదర్శన ఇచ్చాను. ఇక వేలంలో నన్ను ఎవరైనా కొంటారా లేదా అన్న విషయం తెలియదు. మన చేతుల్లో లేని అంశాల గురించి నేను పెద్దగా ఆలోచించను’’ అని రోహన్ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ఏడాది తనకు సానుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా రాజస్తాన్ కెప్టెన్‌గా సంజూ ఉన్న నేపథ్యంలో యువ సంచలనం రోహన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ రాణించగల ఈ యంగ్ టాలెంట్‌ను దక్కించుకునేందుకు ఆర్ఆర్ భారీ మొత్తం వెచ్చించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: IPL 2023: 'వచ్చే ప్రపంచకప్ టోర్నీలోనైనా గెలవాలంటే ఐపీఎల్ ఆడడం మానేయండి'.. లేకుంటే Abu Dhabi T10: వరల్డ్ కప్‌లో తుస్సుమనిపించాడు.. అక్కడ మాత్రం విధ్వంసం! కేవలం 32 బంతుల్లోనే


