సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో ఉత్తరప్రదేశ్ జట్టు బోణీ కొట్టింది. సోమవారం గ్రూపు-ఎలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో యూపీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
యూపీ బ్యాటర్లలో దివ్యాన్ష్ జోషి (65 పరుగులు, 34 బంతులు), సమీర్ రిజ్వీ (46* పరుగులు, 23 బంతులు), ఆర్యన్ జుయల్ (31 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. కర్ణాటక బౌలర్లలో శిఖర్ శెట్టి, మన్వంత్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు.
స్మరణ్ మెరుపులు వృథా
అనంతరం లక్ష్య ఛేదనలో కర్ణాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమైంది. కర్ణాటక కెప్టెన్, సన్‌రైజర్స్ ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ వీరోచితంగా (68 పరుగులు, 39 బంతులు) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. అతడితో పాటు లవ్నిత్ సిసోడియా (42), మన్వంత్ కుమార్ (42) కూడా రాణించారు. యూపీ బౌలర్లలో మోహ్షిన్ ఖాన్ మూడు, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.
చదవండి: Suryakumar Yadav: సూర్యకుమార్ విధ్వంసం.. కేవలం 29 బంతుల్లోనే


