Photo Credit: Twitter
ఫుట్‌బాల్ ఆటలో మరో శకం ముగిసింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం, 33 ఏళ్ల రొమెలు లుకాకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలే మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తమ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా లుకాకు కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.
ఒకే ఏడాదిలో స్వల్ప వ్యవధిలో ముగ్గురు ఫుట్‌బాల్ దిగ్గజాలు అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకడంతో ఫుట్‌బాల్ ఆట కల తప్పినట్లయింది. బెల్జియం తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్‌గా ప్రశంసలు అందుకున్న లుకాకు తన దేశం తరఫున 135 అంతర్జా తీయ మ్యాచ్‌లాడి 94 గోల్స్ చేశాడు.

PC: Twitter
ఫుట్‌బాల్‌లో అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో లుకాకు ఐదో స్థానంలో ఉన్నాడు. లుకాకు కంటే ముందు క్రిస్టియానో రొనాల్డో (146 గోల్స్), లియోనల్ మెస్సీ (126 గోల్స్), ఇరాన్‌కు చెందిన అలీ దాయి (108 గోల్స్), భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ (95 గోల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో లుకాకు బెల్జియం తరఫున నాలుగు ఫిఫా ప్రపంచకప్‌లతో పాటు మూడు యూరోపియన్ చాంపియన్‌షిప్ టోర్నీలు ఆడాడు. ఇక క్లబ్ లీగ్‌లో ప్రస్తుతం టర్కీకి చెందని ఫెనెర్‌బెస్‌కు ఆడుతన్న లుకాకు గత సమ్మర్‌లో నపోలి తరఫున ఆడాడు. ఇక లుకాకు తన రిటైర్మెంట్‌పై ఆసక్తిగా స్పందించాడు.

PC: Twitter
‘‘ఇక్కడితో నా అంతర్జాతీయ కెరీర్‌ను ముగించి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా 16 ఏళ్ల ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. ఇన్నేళ్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించినందుకు ఆనందంగా ఉంది. జట్టుకు ఎంతో కృతజ్ఞుడిని. థాంక్యూ సోమచ్ బెల్జియం’’ అని రాసుకొచ్చాడు. లుకాకు రిటైర్మెంట్‌పై బెల్జియం సాకర్ సమాఖ్య స్పందించింది.
‘‘అతడి వ్యక్తిత్వం, నాయకత్వం, అంకితభావం, జాతీయ జట్టుతో ఉన్న బలమైన అనుబంధం లుకాకును బెల్జియం రెడ్ డెవిల్స్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అల్విదా లుకాకు’’ అని ట్విటర్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో బెల్జియం తరఫున అరంగేట్రం చేసిన లుకాకు అంతర్జాతీయ వేదికలపై పోటీపడిన అతడి ప్రయాణం, ఎప్పటికైనా తాము కూడా బెల్జియం జెర్సీని ధరించాలని కలలు కనే లెక్కలేనంత మంది యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది.
Big Rom. Big moments. Big legacy. Thank you for lighting up the international stage, Romelu Lukaku. #FIFAWorldCup https://t.co/6YtLEmhPip
— FIFA World Cup (@FIFAWorldCup) November 16, 2026
🚨🚨💣 OFFICIEL ! ROMELU LUKAKU (33 ans) 🇧🇪 PREND SA RETRAITE INTERNATIONALE AVEC LA BELGIQUE !!! 😳👋 👕 135 sélections (3e joueur le plus capé) ⚽️ 94 buts 🎖️MEILLEUR BUTEUR DE L’HISTOIRE DE LA BELGIQUE 𝗟𝗘́𝗚𝗘𝗡𝗗𝗘 𝗗𝗨 𝗙𝗢𝗢𝗧 𝗕𝗘𝗟𝗚𝗘. https://t.co/Kdj0U7AE6K
— BeFootball (@_BeFootball) November 16, 2026
ఇదీ చదవండి: టాప్-2లో ఆ ఇద్దరే.. టీమిండియా యంగ్ గన్స్‌కు అన్యాయం!


