Photo Credit: Twitter
రెండు దశాబ్దాల పాటు సాకర్‌పై చెరగని ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాలు (లియెనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో) ఒకే ఏడాదిలో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై ప్రకటించడం మింగుడు పడని అంశమే. కానీ టైం ఎవరి కోసం ఆగదు. సమయం వచ్చినప్పుడు అందరూ రిటైర్ అవ్వాల్సిందే.
ఆ సమయం మెస్సీకి కాస్త ముందుగా వస్తే, తర్వాత రొనాల్డోకు వచ్చింది. రెండు దశాబ్దాల పాటు అభిమానుల నోళ్లలో నానిన ఈ పేర్లు ఇక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వినిపించవు అని తెలియగానే గుండె ఏదో తెలియని బరువు ఎక్కేసింది. ఇద్దరు దిగ్గజాల వీడ్కోలుతో అటు పోర్చుగల్.. ఇటు అర్జెంటీనా జట్లు చిన్నబోయాయి.
ఇద్దరి కెరీర్ దాదాపు ఒకే సమయంలో మొదలైంది. మెస్సీ, రొనాల్డో ఆట పరంగా ఇద్దరు గొప్ప ఆటగాళ్లే. ఇద్దరిలో గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఎవరని తెర మీదకు వచ్చినప్పుడల్లా అభిమానుల మధ్య ఎడతెగని చర్చ ఉండేది. గోట్ అన్న విషయం పక్కనబెడితే, ఈ ఇద్దరు ఎవరికి వారే అభిమానుల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నారు. రాబోయే తరాల్లో ఫుట్‌బాల్ ఆటలో అభిమానులు ఒక ఆటగాడిపై ఇంత అభిమానం పెంచుకోవడం మళ్లీ చూస్తామా అన్నది సందేహమే.

PC: Twitter
అది ఒక్కటే లోటు..
2003లో పోర్చుగల్ సీనియర్ జట్టులోకి రంగప్రవేశం చేసిన రొనాల్డో 23 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 41 ఏళ్ల రొనాల్డో 234 మ్యాచ్‌ల్లో 146 గోల్స్ సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో నెంబర్‌వన్ స్థానంలో ఉన్నాడు.
కెరీర్‌లో ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకున్న రొనాల్డోకు ‘ఫిఫా’ వరల్డ్ కప్ గెలవకపోవడమే ఒక్కటే లోటుగా ఉండిపోయింది. ఇది మినహా 23 ఏళ్ల పాటు జాతీయ జట్టు ఆటగాడిగా అతని విలువ అమూల్యం. రెండు దశాబ్దాలకు పైగా అతను పోర్చుగల్ టీమ్‌కు కర్త, కర్మ, క్రియలా నిలిచాడు. యూరోప్‌లోని ఇతర జట్లతో పోలిస్తే అతనొక్కడి వల్లే పోర్చుగల్‌కు ప్రత్యేక ఆకర్షణ వచ్చిందనడంలో సందేహం లేదు.
రొనాల్డో రాకముందు వరకు ఒక్క మేజర్ ట్రోఫీ కూడా గెలవని టీమ్ 2016లో తొలిసారి ప్రతిష్టాత్మక ‘యూరో కప్’ను సొంతం చేసుకుంది. 2019, 2025లలో అతని ప్రదర్శన వల్లే ‘యూరో నేషన్స్ లీగ్’ టోర్నీని గెలుచుకుంది. రొనాల్డో రాకముందు వరకు కేవలం 3 సార్లు మాత్రమే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన పోర్చుగల్... అతను వచ్చిన తర్వాత 2006 నుంచి 2026 వరకు వరుసగా ఆరు వరల్డ్ కప్‌లకు అర్హత సాధించడం విశేషం.

PC: Twitter
ఆ విషయంలో మెస్సీ పైచేయి..
ఇక మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జెంటీనా ఆరాధ్య దైవంగా పేరు పొందిన మెస్సీ.. దిగ్గజం డీగో మారడోనా తర్వాత అర్జెంటీనాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. అర్జెంటీనా తరఫున రెండు దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగించిన మెస్సీ 208 మ్యాచ్‌ల్లో 126 గోల్స్, 69 అసిస్ట్‌లు సాధించాడు.
అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఫిఫా ప్రపంచకప్ సాధించిన మెస్సీ.. రొనాల్డో కంటే ఒక మెట్టు పైన ఉన్నాడు. 2022 ఫిఫా ప్రపంచకప్ టైటిల్‌తో పాటు, 2021, 2024 కోపా అమెరికా కప్ టైటిల్స్ కూడా గెలిచాడు. ఈ ఇద్దరు దిగ్గజాలు స్వల్ప వ్యవధిలో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, వాళ్లు నెలకొల్పిన రికార్డులు బద్దలవ్వడం అసాధ్యమే.
Portugal estará sempre em mim https://t.co/dnFj51rxmh
— Cristiano Ronaldo (@Cristiano) November 5, 2026
🚨🎙️| Messi: “I don’t want to leave. I will miss you all. I’m thankful to God for being Argentine and proud to be Argentine, and to have accomplished this dream with you all.” 🩵🩵 https://t.co/owyywWWSHA
— Kalshi FC (@KalshiFC) October 7, 2026
ఇదీ చదవండి: నిప్పులు చెరిగిన భారత బౌలర్.. నేపాల్ టాపార్డర్ కకావికలం


