పాక్‌పై భారత్ విజయం.. చివర్లో ఉత్కంఠ | SAFF Cup: India Avoid Late Scare To Beat Pakistan In Opener | Sakshi
Sakshi News home page

పాక్‌పై భారత్ విజయం.. చివర్లో ఉత్కంఠ

Nov 5 2026 5:21 PM | Updated on Nov 5 2026 5:28 PM

SAFF Cup: India Avoid Late Scare To Beat Pakistan In Opener

source: X

2026 శాఫ్‌ (SAFF) ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై భారత్‌ 3-2 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ చివరి నిమిషాల్లో పాక్‌ రెండు గోల్స్ చేసి ఉత్కంఠ రేపినా.. భారత్ విజయాన్ని కాపాడుకుంది.

భారత్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్ 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన అతడు.. ఆరు నిమిషాల వ్యవధిలోనే (19వ నిమిషం) మరో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఆ తర్వాత 32 నిమిషంలో కిప్‌గెన్ మరో గోల్ సాధించడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.

తొలి అర్ద భాగం చివర్లో (35వ నిమిషం) పాక్‌కు పెనాల్టీ రూపంలో గోల్‌ చేసే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది.

అయితే మ్యాచ్ చివర్లో పాక్‌ అనూహ్యంగా పుంజుకుంది. 90వ నిమిషంలో నజీబుల్లా, 93వ నిమిషంలో ఘాజీ అద్భుతమైన గోల్స్‌ చేసి భారత శిబిరంలో ఉత్కంఠ రేపారు. ఈ దశలో భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా 3-2తో మ్యాచ్‌ను మిగించారు.

ఇదీ చదవండి: రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన క్రిస్టియానో ​​రొనాల్డో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement