ఫుట్‌బాల్ ఆటలో తన్నులాట సాధారణమే. కానీ ఈ ఆట చరిత్రలో మునుపెన్నడూ జరగని ఒక సంఘటనకు బ్రెజిల్‌లో జరిగిన అండర్-20 ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికగా మారింది. ఏకంగా 51 మందికి రెడ్‌కార్డు జారీ చేయడంతో ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. గతంలో 2011లో అర్జెంటీనాలో క్లేపోల్, విక్టోరియా అరేనాస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 36 రెడ్‌కార్డులు జారీ చేయడమే ఇప్పటివరకు రికార్డుగా ఉంది. తాజాగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అసలేం జరిగిందంటే?
మినాస్ గెరైస్‌లోని ఎస్టాడియో పార్క్ డో సాబియా స్టేడియంలో ఆతిథ్య ఉబెర్లాండియా, మమోర్ మధ్య అండర్-20 కాంపియోనాటో మైనిరో (సెకండ్ డివిజన్) సెమీ-ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలి అర్థభాగం ముగిసేసరికి మమోర్ జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగం మొదలైన 54వ నిమిషంలో మరో గోల్‌కొట్టిన మమోర్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో మైదానంలో ఉద్రిక్తతలు చెలరేగాయి.
మమోర్ మూడో గోల్ చేసిన వెంటనే, ఆ జట్టు ఫార్వార్డ్ ఆటగాడు డేవి.. ఉబెర్లాండియా రిజర్వ్ ఆటగాళ్లను, సిబ్బందిని రెచ్చగొట్టే ప్రయత్నంలో ప్రత్యర్థి బెంచ్‌వైపు దూసుకురావడంతో గొడవ మొదలైంది. దీంతో ఆగ్రహించిన ఉబెర్లాండియా గోల్ కీపర్, కోచ్ సెర్గియో.. డేవిని ఇలా ఎందుకు చేస్తున్నావంటూ నిలదీయడంతో, గొడవ ముదిరింది.
ఇరుజట్ల ఆటగాళ్లు, సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, బోర్డు సభ్యులు ఇలా దాదాపు 60 మంది మైదానంలోకి దూసుకురావడంతో క్షణాల్లో వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. చివరకు కొట్టుకునేందుకు తయారవ్వడంతో వారిని విడదీసేందుకు 40 నిమిషాలకు పైగా పట్టింది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులను స్టేడియానికి పిలిపించారు.
నివేదిక ప్రకారం ఘర్షణలో పాల్గొన్న ఆరుగురు బాల్ బాయ్స్ మమోర్ సిబ్బందిని వస్తువులు, కుర్చీలు, స్ట్రెచర్‌లతో దాడికి చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు, సైనిక బలగాలు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చాకా, రిఫరీ ఇరుజట్లపై చర్యలు తీసుకున్నాడు. మైదానంలో హింస చెలరేగడానికి కారణమైన వారితో సహా మొత్తం 51 మందికి రెడ్‌కార్డ్ చూపించడం జరిగింది.
ఇందులో 43 మంది ఆటగాళ్లు, 8 మంది సహాయక సిబ్బంది, ఇద్దరు బోర్డు సభ్యులు రెడ్‌కార్డుకు గురయ్యారు. ఈ క్రమంలో, ఒకే ఫుట్‌బాల్ గేమ్‌లో అత్యధిక మందిని రెడ్‌కార్డు చూపించి మైదానం నుంచి పంపించివేయడంతో గతంలో ఉన్న (36 మందికి రెడ్‌కార్డు) గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలయ్యింది.
GUINNESS WORLD RECORD HAS BEEN BROKEN IN BRAZIL IN A FOOTBALL GAME. A Guinness World Record was broken for the number of red cards in a single game, the Minas Gerais Under-20 Championship clash between Uberlândia and Mamoré saw 51 sendings off, including 43 players and eight members of coaching staff 🤯🟥 A mass brawl that began in the 54th minute saw the referee break a record that had stood since 2011 for the most expulsions in a single fixture, according to reports from O Tempo 😭 The referee's report indicated that the chaos wasn't limited to the players. Six ball boys reportedly participated in the aggression, throwing punches, kicks, and objects at players and members of the Mamoré coaching staff. Stretchers and chairs were also used in the fighting that took close to 40 minutes to subside, while local military police were forced to attend to assess the vandalism inside the stadium after the air had cooled 🇧🇷
— Peter O.U (@Parisdreams_emp) November 4, 2026
ఇదీ చదవండి: 'మాటల్లేవ్.. అతడి భవిష్యత్తు తొలి మ్యాచ్‌లోనే చెప్పేశా'


