చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా | Virat Kohli Creates ODI History, Becomes The First Batter To Score 13,000 Runs While Batting At No. 3 Position, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Nov 4 2026 12:10 PM | Updated on Nov 4 2026 12:33 PM

 Virat Kohli Becomes First Batter in History to Score 13,000 ODI Runs at No. 3

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మ‌రో ప్ర‌పంచ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌లో మూడో స్దానంలో బ్యాటింగ్ చేస్తూ 13,000 పరుగులు పూర్తి చేసిన మొద‌టి బ్యాట‌ర్‌గా కోహ్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో 12 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద విరాట్ ఈ ఫీట్ సాధించాడు. 

కోహ్లి కంటే ముందు ఏ బ్యాటర్ కూడా మూడో స్దానంలో బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డు సాధించలేకపోయారు. ఈ జాబితాలో కోహ్లి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌(12,662) ఉన్నాడు.

మూడో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు

విరాట్ కోహ్లి(భారత్‌)-13,000*

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 12,6623

కుమార సంగక్కర(శ్రీలంక‌)-9,7474

జాక్వెస్ క‌ల్లిస్‌(సౌతాఫ్రికా)- 7,7745

కేన్ విలియ‌మ్స్‌(న్యూజిలాండ్‌)-6,504

కాగా నంబ‌ర్ 3 స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఎన్నో చారిత్ర‌త్మ‌క రికార్డుల‌ను అందుకున్నాడు. ఏకంగా 48 వన్డే సెంచరీలు సాధించి ఆ స్థానానికి తిరుగులేని రాజుగా నిలిచాడు. వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జాబితాలో విరాట్ (15,109) రెండో స్ధానంలో కొన‌సాగుతున్నాడు.
చదవండి: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. వన్డే కెరీర్‌లో ఇదే తొలిసారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement