PC: BCCI/X
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో ఆరు బంతులు ఎదుర్కొన్న రోహిత్ తన ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. భారత ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ర్ వేసిన కైల్ జేమీసన్ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఔటయ్యాడు.
తొలి ఐదు బంతులను జాగ్రత్తగా ఆడిన రోహిత్.. ఆఖరి బంతికి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. జేమీసన్ చివరి బంతిని ఆఫ్‌స్టంప్ వెలుపల ఫుల్లర్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని రోహిత్ శర్మ మిడ్-ఆఫ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే షాట్‌లో అంత పవర్ లేకపోవడంతో మిడ్-ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బంతిని సరిగ్గా టైమ్ చేయలేకపోయిన రోహిత్ శర్మ నిరాశగా తల కిందకు దించుకుంటూ క్రీజును వదిలి వెళ్లాడు.
రోహిత్ చెత్త రికార్డు
👉ఈ డకౌట్‌తో రోహిత్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో భారత్ తరపున ఓపెనర్‌గా అత్యధికసార్లు డకౌటైన నాలుగో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్‌గా 9 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రస్తుత భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గంభీర్‌ను రోహిత్ దాటేశాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్(13) అగ్రస్ధానంలో ఉన్నాడు.
👉కాగా వన్డేల్లో న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ డకౌట్ అవ్వడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా 2023 ప్రపంచ కప్‌లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తర్వాత, వన్డేల్లో అతను డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఓపెనర్లుగా అత్యధికసార్లు డకౌటైన భారత ఆటగాళ్లు
13 - సౌరవ్ గంగూలీ, వీరేందర్ సెహ్వాగ్
12 - సచిన్ టెండూల్కర్
11 - కె. శ్రీకాంత్
9 - రోహిత్ శర్మ*
8 - గౌతమ్ గంభీర్
కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లు, అన్షుల్ కాంబోజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


