Photo Credit: Twitter
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి వినూత్న రీతిలో దర్శనమిచ్చారు. టాస్ అనంతరం జాతీయ గీతాలాపన సమయంలో కెప్టెన్ గిల్ నుదుటన టెంపుల్ డివైస్‌తో కనిపించగా, కోహ్లి డాష్‌కామ్ కెమెరాతో క్లిక్‌మనిపించాడు. ఈ ఇద్దరు మినహా మిగతా క్రికెటర్లు మాత్రం మాములుగానే జాతీయ గీతాలాపన ఆలపించారు. దీంతో కోహ్లి, గిల్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏమిటీ టెంపుల్?
కాగా ప్రాక్టీస్ సెషన్‌లోను గిల్ నుదుటి పక్క భాగంలో టెంపుల్ పరికరాన్ని ధరించే బ్యాటింగ్ ఆడాడు. తాజాగా తొలి వన్డేకు కూడా టెంపుల్ పరికరాన్ని ధరించి బరిలోకి దిగాడు. ఇక ఈ టెంపుల్ డివైజ్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపి (Near-Infrared Spectroscopy) టెక్నాలజీతో పనిచేస్తుంది.
మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్ స్థాయిలు, నాడీ వ్యవస్థ స్పందన, మానసిక ఒత్తిడిని ఇది రియల్ టైమ్‌లో అంచనా వేస్తుంది. గతంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టెంపుల్ డివైజ్‌ను పెట్టుకోవడం ద్వారా తొలిసారి వార్తల్లో నిలిచింది.
ఇక డాష్‌కామ్ కెమెరాతో కోహ్లి కనిపించడంలో వింతేమీ లేదు. గిల్‌ను ఆటపట్టించాలనే ఉద్దేశంతోనే కోహ్లి ఇలా డాష్‌కామ్‌ను ఎదుట పెట్టుకొని జాతీయగీతం పాడినట్లుగా తెలుస్తోంది. గిల్‌తో ఉన్న చనువు కారణంగానే కోహ్లి ఇలా డాష్‌కామ్ పెట్టుకొని జాతీయ గీతం పాడడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


