టీమిండియాకు శుభ‌వార్త‌.. అత‌డు వ‌చ్చేస్తున్నాడు! | Reports-Prasidh-Krishna-Gets-Fitness-Clearance-Available-NZ Test Series | Sakshi
Sakshi News home page

టీమిండియాకు శుభ‌వార్త‌.. అత‌డు వ‌చ్చేస్తున్నాడు!

Nov 4 2026 7:41 AM | Updated on Nov 4 2026 7:45 AM

Reports-Prasidh-Krishna-Gets-Fitness-Clearance-Available-NZ Test Series

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఒక శుభ‌వార్త అందింది. భార‌త స్టార్ పేస‌ర్ ప్ర‌సిధ్ క్రిష్ణ కివీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడేందుకు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు అత‌డు ఫిట్‌నెస్ నిరూపించుకున్న‌ట్లు బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ) ప్ర‌క‌టించింది. బెంగ‌ళూరులోని సీవోఈ కేంద్రంలోనే ప్ర‌సిధ్ క్రిష్ణకు రెండురోజుల పాటు సిమ్యులేష‌న్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 

ఈ రెండు ప‌రీక్ష‌ల్లోనూ ప్ర‌సిధ్ క్రిష్ణ పాస‌వ్వ‌డంతో సీవోఈ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ ల‌భించిన‌ట్లు స‌మాచారం. దీంతో న్యూజిలాండ్‌తో జ‌ర‌గ‌బోయే రెడ్‌బాల్ (టెస్టు) సిరీస్‌కు ప్ర‌సిధ్ క్రిష్ణ అందుబాటులోకి రానున్నాడు. మ‌రో రెండు రోజుల్లో న్యూజిలాండ్‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నాడు. 

న‌వంబ‌ర్ 7 నుంచి 10 మ‌ధ్య లింక‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌-ఏ జ‌ట్టుతో జ‌రగ‌నున్న మూడో అన‌ధికారిక టెస్టులో ప్ర‌సిధ్ క్రిష్ణ ఆడే అవ‌కాశ‌ముంది. వ‌న్డే సిరీస్‌కు అత‌డిని ప‌క్క‌న‌బెట్టిన‌ప్ప‌టికీ, టెస్టుల్లో బుమ్రాతో క‌లిసి ప్ర‌సిధ్ క్రిష్ణ బంతిని పంచుకోనున్న నేప‌థ్యంలో అత‌డి ఎంపిక ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని బీసీసీఐ గ‌తంలోనే తెలిపింది. 

తాజాగా ప్ర‌సిధ్ క్రిష్ణ ఫిట్‌నెస్ క్లియ‌రెన్స్ సాధించ‌డంతో కివీస్‌తో టెస్టు సిరీస్ ఆడేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాడు. ఈ ఫాస్ట్ బౌల‌ర్ చివ‌రిసారిగా ఆగ‌స్టులో లంక‌తో జ‌రిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడాడు. ఆ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు క‌లిపి ఏడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

అంత‌క‌ముందు ఏడాది ఇంగ్లండ్‌లో జ‌రిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లు క‌లిపి 14 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ సిరీస్‌ను డ్రా చేసుకోవ‌డంలో ప్ర‌సిధ్ క్రిష్ణ కీల‌క‌పాత్ర పోషించాడు. కొత్త బంతితో బౌన్స్ రాబ‌ట్ట‌డం, సీమ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే కివీస్ పిచ్‌లు ఉండ‌డం ప్ర‌సిధ్‌కు క‌లిసిరానుంది. టీమిండియాకు అత‌డు ఒక ఆయుధంగా మారినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఇదీ చ‌ద‌వండి: IND Vs NZ: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement