కివీస్‌తో తొలి వన్డే.. అతడి రాకతోనే సమస్యకు పరిష్కారం! | Shubman-Gill-Clarity-About-Batting-Order-Ahead-1st ODI Vs NZ-Auckland | Sakshi
Sakshi News home page

కివీస్‌తో తొలి వన్డే.. అతడి రాకతోనే సమస్యకు పరిష్కారం!

Nov 3 2026 12:32 PM | Updated on Nov 3 2026 1:08 PM

Shubman-Gill-Clarity-About-Batting-Order-Ahead-1st ODI Vs NZ-Auckland

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చాడు. తొలి వన్డేకు ముందు జరిగే సంప్రదాయ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న గిల్ జట్టు కూర్పుపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తొలి మూడు వన్డేలు మాత్రమే ఆడనున్న గిల్‌, ఆ తర్వాత టెస్టు సిరీస్‌కు సిద్ధమవ్వనున్నాడు. 

నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక తొలి వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌పై గిల్ మాట్లాడుతూ.. తొలి నాలుగు స్థానాల్లో నేను, రోహిత్‌, కోహ్లి, అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తాము. ఐదో, ఆరో స్థానాల విషయంలో మేము ఫ్లెక్సిబుల్ విధానాన్ని అనుసరించాలనుకుంటున్నాం. 

మా టాప్-4 బ్యాటర్లు కుడిచేతి వాటం ఆటగాళ్లే. కాబట్టి ఎడమచేతి వాటం బ్యాటర్ అవసరమైతే అక్షర్ భాయ్ ముందుకు వస్తాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి రాహుల్ భాయ్ కూడా ముందుగా బ్యాటింగ్‌కు రావచ్చు.’ అని గిల్ వివరించాడు.

తన మెడ నొప్పితో పాటు ఫిట్‌నెస్‌పై గిల్‌ స్ప‌ష్ట‌త ఇచ్చాడు. ‘ఎలాంటి సమస్య లేదు. నేను దాదాపు గంటన్నర పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఫీల్డింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాను.’ అని తెలిపాడు. పాండ్యా లేమితో లోయర్ ఆర్డర్ బలహీనంగా ఉందన్న విషయంపై మీ స్పందనేంటి అని గిల్‌కు ప్రశ్న ఎదురైంది. 

దీనిపై కెప్టెన్ మాట్లాడుతూ.. ‘నిజమే, గాయం కారణంగా ఆల్‌రౌండర్ పాండ్యా సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరంగా ఉండడం జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. పాండ్యా గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వస్తే మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌ పూర్తిగా కుదురుకుంటుంది. ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్ సమస్యలు కూడా తొలగిపోతాయి.’ అని చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: ఆ ఇద్దరికి దక్కని చోటు.. తొలి వన్డేకు భారత జట్టు అంచనా!

కంకషన్‌కు గురైన కివీస్ స్టార్‌.. భారత్‌తో తొలి వన్డేకు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement