Photo Credit: Twitter
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లో జైస్వాల్ భారత రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడ కొనసాగించాడు. 119 బంతుల్లో శతకం సాధించిన జైస్వాల్‌కు ఇది 18వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ.
టీ విరామ సమయానికి భారత జట్టు 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. జైస్వాల్ (159 బంతుల్లో 153 బ్యాటింగ్; 15 ఫోర్లు, 5 సిక్సర్లు), యశ్ రాథోడ్ (115 బంతుల్లో 89 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 191 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ జట్టు ఓవర్‌కు 5.27 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం.
మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా, తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పడిక్కల్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. కివీస్ బౌలర్లలో బ్రెట్ రాండెల్, జర్రోడ్ మెక్‌కే చెరో వికెట్ తీశారు. అంతకముందు న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులకు ఆలౌటైంది.
మాథ్యూ బొలె (110) సెంచరీ చేయగా, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (93) శతకం మిస్ చేసుకున్నాడు. ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు తీయగా, సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
A huge relief for Indian cricket fans Despite the challenging batting conditions under cloudy skies Yashasvi Jaiswal has sent a strong message with a magnificent century even if it came in the second innings A brilliant hundred from a terrific player https://t.co/OFZd6gkSCi
— Tide Bhai (@Public_Voice0) November 3, 2026
ఇదీ చదవండి: సెలెక్టర్లపై టీమిండియా క్రికెటర్ ఆక్రోశం
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ స్టార్ క్రికెటర్


