breaking news
Test century
-
అతడు సెహ్వాగ్‌లా కానేకాదు!.. సూపర్ ప్లేయర్: మాజీ క్రికెటర్
టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)పై భారత జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో జైసూ శతక్కొట్టిన తీరు అద్భుతమని కొనియాడాడు. చాలా మంది జైసూను.. విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)తో పోలుస్తారన్న ఆకాశ్ చోప్రా.. అది నిజం కాదన్నాడు.ఏడో సెంచరీసెంచరీతో తన టెస్టు అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆరు సెంచరీలు బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా శుక్రవారం ఏడో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపికగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించుకున్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి.. 253 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 173 పరుగులు చేశాడు.మొదటి బంతి నుంచే హిట్టింగ్ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘చాలా మంది జైస్వాల్‌ను తరచూ వీరేందర్ సెహ్వాగ్‌తో పోలుస్తూ ఉంటారు. కానీ అతడు సెహ్వాగ్ కంటే భిన్నమైన ప్లేయర్.వచ్చామా.. మొదటి బంతి నుంచే హిట్టింగ్ ఆడాలి అన్నట్లుగా సెహ్వాగ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలపై దూకుడు ప్రదర్శిస్తూ కుదిరితే లంచ్‌లోపే సెంచరీ కొట్టేయాలని వీరూ భావించేవాడు.జైస్వాల్ అలా కాదుకానీ జైస్వాల్ అలా కాదు. అతడి మైండ్‌సైట్ సెహ్వాగ్ కంటే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం టెస్టుల్లో మాత్రమే అతడికి అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవడంపైనే అతడి దృష్టి ఉంది.పిచ్ ఒకవేళ బాగుంటే.. బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగా ఉన్నా.. నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెడతాడు. ఓపికగా ఆడుతూ.. అవసరమైనపుడు మాత్రమే షాట్లు బాదుతూ అనుకున్న పనిని పూర్తి చేస్తాడు.ప్రతి బంతిని షాట్ బాదాలన్న ఇగో ఏమాత్రం లేదు. భోజనానికి ముందు ఓపికగా ఆడిన జైసూ.. ఆ తర్వాత అటాకింగ్ మొదలుపెట్టాడు. ప్రత్యర్థిని బెంబెలెత్తించి భారీ శతకం సాధించాడు’’ అని ఆకాశ్ చోప్రా జైస్వాల్‌ను ప్రశంసించాడు.రనౌట్‌కాగా తొలిరోజు అదరగొట్టిన జైస్వాల్.. శనివారం రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే రనౌట్ అయ్యాడు. 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన ఈ 23 ఏళ్ల బ్యాటర్.. డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక శనివారం లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో.. నాలుగు వికెట్ల నష్టానికి 427 పరుగుల మేర భారీ స్కోరు చేసింది.చదవండి: గిల్‌పై అసహనం!.. తలబాదుకున్న జైస్వాల్.. తప్పు నీదే! -
డబుల్ సెంచరీకి చేరువలో జైశ్వాల్.. తొలి రోజు భారత్‌దే
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్(West Indies)తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా దుమ్ములేపుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.యశస్వికి ఇది 7వ టెస్టు సెంచరీ. జైశ్వాల్ 173 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు ఉన్నాయి. క్రీజులో జైశ్వాల్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్(20) ఉన్నాడు. అంతకుముందు యువ ఆటగాడు సాయిసుదర్శన్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు.165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసిన సుదర్శన్.. తృటిలో తన తొలి టెస్టు సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు సుదర్శన్ దొరికిపోయాడు.వీరిద్దరితో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్(38) రాణిచాడు. అయితే రాహుల్ తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్-సాయిసుదర్శన్ రెండో వికెట్‌కు 193 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సుదర్శన్ ఔటయ్యాక జైశ్వాల్ గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక విండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా తేలిపోయారు. కాగా తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: ఇంకెంతకు దిగజారుతావు?.. నఖ్వీ ఓవరాక్షన్ మామూలుగా లేదు -
జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అద్బుత శతకంతో మెరిశాడు. ఓవల్ మైదానంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైసూ.. శనివారం దానిని శతకంగా మలచుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం 127 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.మొత్తంగా 164 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పద్నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 71కి పైగా స్ట్రైక్‌రేటుతో 118 పరుగులు సాధించాడు. నిజానికి రెండో రోజు భారత్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (11) రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.ఆరంభం నుంచే అదరగొట్టారుఈ క్రమంలో నైట్ వాచ్‌మన్‌గా ఆకాశ్ దీప్ (Akash Deep).. యశస్వికి జతయ్యాడు. అయితే, ఇద్దరూ కలిసి చక్కటి సమన్వయంతో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. మూడో రోజు ఆరంభం నుంచే అదరగొట్టారు. ఇక ఆకాశ్ దీప్ ఊహించని రీతిలో బౌండరీలు బాదుతూ.. జైస్వాల్‌పై ఒత్తిడి తగ్గించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీరికి కలిసివచ్చాయి. తొలి అర్ధ శతకంఈ క్రమంలో ఆకాశ్ దీప్ తన టెస్టు కెరీర్లో తొలి అర్ధ శతకం (66) సాధించగా.. జైసూ ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 23 ఏళ్ల యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు.జైస్వాల్ ప్రపంచ రికార్డుజైస్వాల్ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ పొజిషన్ నుంచి వచ్చినవే. ఇప్పటికి టెస్టు చరిత్రలో 1526 శతకాలు నమోదు కాగా.. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.నువ్వా- నేనాఇక మ్యాచ్ విషయానికొస్తే.. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో గురువారం మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించగా.. కరుణ్ నాయర్ (57) అర్ధ శతకంతో రాణించాడు.ఇక ఇందుకు బదులుగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు ఆరంభంలో అదరగొట్టినా.. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చి.. బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర.. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ పంత్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు.తన అద్బుత సెంచరీలతో ఇంగ్లండ్‌కు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.పంత్ సాధించిన రికార్డులు ఇవే..ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్టులో పంత్ 252 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ బుద్ధి కుందరన్ పేరిట ఉండేది. కుందరన్ 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా మ్యాచ్‌తో 61 ఏళ్ల కుందరన్ ఆల్‌టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్లు వీరే..👉రిషబ్ పంత్ 252👉బుద్ధి కుందరన్ 230👉ఎంఎస్ ధోని 224👉రిషబ్ పంత్ 203👉ఫరోఖ్ ఇంజనీర్ 187👉అదేవిధంగా 148 టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఒకే మ్యాచ్‌లో 2 సెంచరీలు బాదిన రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ అగ్రస్ధానంలో ఉన్నారు. సౌతాఫ్రికాతో 2001లో జరిగిన టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులతో ఫ్లవర్ ఆజేయంగా నిలిచాడు.👉ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేసిన ఏకైక ఆసియాన్ వికెట్ కీపర్ కూడా పంత్ కావడం విశేషం.👉ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో భారత ఆటగాడిగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్,దిలీప్ వెంగ్‌సర్కార్ రికార్డును రిషబ్ సమం చేశాడు. వారిద్దరూ ఇంగ్లండ్‌లో నాలుగు టెస్టు సెంచరీలు సాధించారు. పంత్‌కు కూడా ఇంగ్లండ్ గడ్డపై నాలుగో టెస్టు సెంచరీ. ఈ రేర్ ఫీట్సాధించిన జాబితాలో రాహుల్ ద్రవిడ్ 6 సెంచరీలతో రాహుల్ ద్రవిడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు.Cartwheeling into the record books literally! 🌀Rishabh Pant brings his love for gymnastics into every 100 celebration, and it’s just as fearless as his batting.Who needs quiet fist pumps when you can flip your way to history?#ENGvIND 1st Test Day 4 LIVE NOW Streaming on… pic.twitter.com/iOQ8fVgHJT— Star Sports (@StarSportsIndia) June 23, 2025 -
అప్పుడు స్టుపిడ్.. స్టుపిడ్! ఇప్పుడు సూపర్బ్.. సూపర్బ్
స్టుపిడ్..స్టుపిడ్.. స్టుపిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ కోల్పోవడంతో కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇప్పుడు అదే గవాస్కర్ రిషబ్ పంత్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.రెండో రోజు ఆటలో తన ఏడో టెస్టు సెంచరీ మార్క్‌ను రిషబ్ అందుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాటర్ 99 పరుగుల వద్ద సిక్సర్ బాది మరి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గవాస్కర్ సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ కొనియాడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమర్శించిన నోళ్లతోనే పొగిడించుకోవడం చాలా గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓవరాల్‌గా 178 బంతులు ఎదుర్కొన్న పంత్.. 12 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 134 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సెంచరీతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ.తొలి ఇన్నింగ్స్‌లో భారత స్కోరంతంటే?ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌటైంది. 359/3 ఓవర్ నైట్‌స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (101, 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు.ఇంగ్లండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయక్ బషీర్ చెరో వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. -
రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు..
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.ఈ క్రమంలో పంత్ 146 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పంత్‌కు ఇది ఏడో టెస్టు సెంచరీ కావడం విశేషం. రిషబ్ సెంచరీ సాధించగానే సంతోషంతో మరోసారి ఫ్లిప్ జంప్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.106 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్(113)తో పాటు కెప్టెన్ రవీంద్ర జడేజా(1) ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..👉టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. పంత్ ఇప్పటివరకు టెస్టుల్లో 7 సెంచరీలు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా లెజెండ్ ఎంఎస్ధోని పేరిట ఉండేది. ధోని తన కెరీర్లో 6 టెస్టు సెంచరీలు సాధించాడు. తాజా శతకంతో ధోనిని పంత్ అధిగమించాడు.👉సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక టెస్టు రన్స్ చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. పంత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 49 ఇన్నింగ్స్‌లలో 1746 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు కూడా ఎంఎస్ ధోని పేరిటే ఉండేది. ధోని తన కెరీర్లో సేనా దేశాల్లో 60 ఇన్నింగ్స్‌లు ఆడి 1731 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ధోని వరల్డ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు.👉విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన లెస్ అమెస్ రికార్డును పంత్ సమం చేశాడు. అమీస్ విదేశాల్లో ఐదు టెస్టు సెంచరీలు చేయగా.. పంత్ కూడా సరిగ్గా ఐదు సెంచరీలు చేశాడు. ఈ పర్యటనలో మరో సెంచరీ చేస్తే అమీస్‌ను అధిగమిస్తున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్(10) అగ్రస్ధానంలో ఉన్నాడు. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీ
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో జైశ్వాల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 144 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు.కేఎల్ రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పిన యశస్వి.. ఆ తర్వాత కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 131 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశాడు . జైశ్వాల్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. తన సెంచరీ మార్క్‌ను అందుకోగానే గాల్లోకి జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఐదో ఆటగాడిగా.కాగా జైశ్వాల్ తన కెరీర్లో ఇంగ్లండ్‌పై ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఈ ఫీట్ సాధించిన ఐదో భారత ఆటగాడిగా జైశ్వాల్ నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో భారత మాజీ ప్లేయర్ విజయ్ మంజ్రేకర్ ఉన్నారు. విజయ్ మంజ్రేకర్ 1952లో ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే133 విజయ్ మంజ్రేకర్- హెడింగ్లీ 1952131 సౌరవ్ గంగూలీ -లార్డ్స్ 1996129*సందీప్ పాటిల్ -ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982146 మురళీ విజయ్ -ట్రెంట్ బ్రిడ్జ్ 2014100*యశస్వి జైస్వాల్ హెడింగ్లీ 2025టీబ్రేక్‌కు భారత స్కోరంతంటే?ఇక తొలి రోజు టీ బ్రేక్ సమయానికి టీమిండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్(100), గిల్(58) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఇప్పటివరకు బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: దక్షిణాఫ్రికాకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?𝙔𝙚𝙝 𝙨𝙞𝙠𝙝𝙖𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣! 🔥A young star rises in England with a knock full of class. @ybj_19's first century on English soil shines bright. 🤩Watch now 👉 https://t.co/PXeXAKeYoj #ENGvIND | 1st Test | LIVE NOW on JioHotstar pic.twitter.com/SizxLx76AB— Star Sports (@StarSportsIndia) June 20, 2025 -
నిస్సాంక సూపర్ సెంచరీ.. బంగ్లాకు ధీటుగా బదులిస్తున్న శ్రీలంక
గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ధీటుగా బదులిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. క్రీజులో కమిండు మెండిస్(37), దనుంజయ డి సిల్వా(17) ఉన్నారు. లంక బ్యాటర్లలో ఓపెనర్ ఫాథుమ్ నిస్సాంక అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.256 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 187 పరుగులు చేసి ఔటయ్యాడు. నిస్సాంక చండీమాల్(54)తో కలిసి రెండో వికెట్‌కు 157 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇక తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఏంజెలో మాథ్యూస్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఔటయ్యి పెవిలియన్‌కు తిరిగి వెళ్తుండగా బంగ్లా ప్లేయర్లు గార్డ్ హాఫ్ హానర్ ఇచ్చారు. బంగ్లా బౌలర్లలో ఇప్పటివరకు హసన్ మహముద్, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, మోమినుల్ హక్ తలా వికెట్ సాధించారు.షాంటో, రహీం సెంచరీలు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 495 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 484/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా జట్టు కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిలన్ రత్ననాయకే, తరిందు రత్ననాయకే తలా 3 వికెట్లు సాధించారు.చదవండి: ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్ -
జో రూట్ సూపర్ సెంచరీ.. ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా విఫలమైన జో రూట్.. రెండో టెస్టులో మాత్రం తన మార్క్‌ను చూపించాడు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన సెకెండ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.130 బంతులు ఎదుర్కొన్న రూట్.. 11 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. రూట్‌కు ఇది 36వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డును ఈ ఇంగ్లండ్ లెజెండ్ సమం చేశాడు. ద్రవిడ్ తన అంతర్జాతీయ టెస్టు కెరీర్లో 36 సెంచరీలు చేశాడు. రూట్ మరో సెంచరీ సాధిస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. కాగా రూట్ 2021 నుంచి ఇప్పటి వరకు రూట్ అత్యధికంగా 19 టెస్టు సెంచరీలు చేయడం విశేషం.ఇక టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(51) అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. జాక్వెస్ కలిస్(45), రికీ పాంటింగ్(41), కుమార సంగక్కర(38), ద్రవిడ్(36), రూట్(36) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.కాగా రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై 323 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.చదవండి: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే? -
రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే
దక్షిణాఫ్రికా టాపార్డర్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ (101; 11 ఫోర్లు) సెంచరీతో దక్షిణాఫ్రికాను నిలబెట్టాడు. శ్రీలంకతో గురువారం మొదలైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.మిడిలార్డర్లో కెప్టెన్ తెంబా బవుమా (78; 8 ఫోర్లు, 1 సిక్స్), కైల్ వెరీన్ (48 బ్యాటింగ్; 6 ఫోర్లు) రాణించారు. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌కు దిగగానే అసిత ఫెర్నాండో... ఓపెనర్ టోని డి జోర్జి (0)ని డకౌట్ చేశాడు. కాసేపటికే లహిరు కుమార నిప్పులు చెరగడంతో మార్క్రమ్ (20; 4 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (4) పెవిలియన్ దారి పట్టారు.44 పరుగులకే 3 కీలకమైన వికెట్లు కోల్పోగా, బవుమాతో జతకట్టిన రికెల్టన్ సఫారీని ఆదుకున్నాడు. నాలుగో వికెట్‌కు 133 పరుగులు జోడించాక 177 స్కోరు వద్ద బవుమాను ఫెర్నాండో అవుట్ చేశాడు. కాసేపటికే బెడింగ్హామ్ (6) జయసూర్య బౌలింగ్‌లో 186 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయింది.ఈ దశలో రికెల్టన్, వెరీన్ నింపాదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. 250 పైచిలుకు స్కోరు నమోదయ్యాక సెంచరీ పూర్తయిన వెంటనే రికెల్టన్ వికెట్‌ను లహిరు పడగొట్టగా, ఓవర్ వ్యవధిలో యాన్సెన్ (4)ను విశ్వ ఫెర్నాండో అవుట్ చేయడంతో సఫారీ ఏడో వికెట్‌ను కోల్పోయింది. లహిరు కుమార 3, అసిత ఫెర్నాండో 2 వికెట్లు తీశారు.చదవండి: SMT 2024: అభిషేక్ శర్మ ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ -
శతక్కొట్టిన తెంబా బవుమా.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు
శ్రీలంకతో తొలి టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా అద్భుత శతకంతో మెరిశాడు. ట్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది.ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డర్బన్ వేదికగా బుధవారం తొలి టెస్టు మొదలైంది. కింగ్స్‌మెడ్ మైదానంలో టాస్ గెలిచిన పర్యాటక శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టాపార్డర్ కుదేలైన వేళ బవుమా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.తొలి ఇన్నింగ్స్‌లో బవుమానే ఆదుకున్నాడుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(9), టోనీ డి జోర్జి(4) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ 16 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతను భుజాన వేసుకున్న బవుమా 117 బంతులాడి 70 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో టెయిలండర్ కేశవ్ మహరాజ్(24) ఒక్కడే 20 పరుగుల మార్కు దాటాడు.లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, లాహిరు కుమార మూడేసి వికెట్లు పడగొట్టగా.. విశ్వ ఫెర్నాండో, ప్రభాత్ జయసూర్య రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, సౌతాఫ్రికాను 191 పరుగులకే ఆలౌట్ చేసిన ఆనందం శ్రీలంకకు ఎక్కువ సేపు ఉండలేదు.42 పరుగులకే లంక ఆలౌట్ఆతిథ్య జట్టు పేసర్ల దెబ్బకు లంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. కేవలం 42 పరుగులకే ధనంజయ డి సిల్వ బృందం కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ సాధించిన 13 పరుగులే టాప్ స్కోర్. ఐదుగురేమో డకౌట్.ఫలితంగా 149 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాకు మెరుగైన ఆరంభం లభించింది. ఓపెనర్ టోనీ 17 పరుగులకే నిష్క్రమించినా.. మరో ఓపెనర్ మార్క్రమ్ 47 రన్స్‌తో రాణించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ వియాన్ ముల్దర్ 15 పరుగులకే అవుట్ కాగా.. స్టబ్స్, బవుమా మాత్రం విశ్వరూపం ప్రదర్శించారు.స్టబ్స్, బవుమా శతకాలు.. లంకకు భారీ టార్గెట్స్టబ్స్ 221 బంతుల్లో 122 పరుగులు సాధించగా.. బవుమా 228 బంతుల్లో 113 పరుగులు చేశాడు. వీరిద్దరి శతకాల వల్ల సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సంపాదించింది. ఐదు వికెట్ల నష్టానికి 366 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా శ్రీలంక ముందు 516 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో తెంబా బవుమాకు ఇది మూడో సెంచరీ. అంతేకాదు ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం తద్వారా అతడు ఓ అరుదైన రికార్డు సాధించాడు. శ్రీలంకపై సెంచరీ చేసిన సౌతాఫ్రికా మూడో కెప్టెన్‌గా నిలిచాడు. బవుమా కంటే ముందు షాన్ పొలాక్, హషీం ఆమ్లా మాత్రమే సారథి హోదాలో లంకపై శతకం సాధించారు.శ్రీలంకతో మ్యాచ్‌లో శతక్కొట్టిన సౌతాఫ్రికా కెప్టెన్లు👉షాన్ పొలాక్- సెంచూరియన్- 2001- 111 పరుగులు👉హషీం ఆమ్లా- కొలంబో- 2014- 139 పరుగులు(నాటౌట్)👉తెంబా బవుమా- డర్బన్- 113 పరుగులు.చదవండి: ‘అతడిని లారా, సచిన్ అంటూ ఆకాశానికెత్తారు.. ఇలాంటి షాక్ తగిలితేనైనా.. కాస్త’ -
ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు.. విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను తిరిగిపొందాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లి సూపర్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన కింగ్ కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపాడు.ఆస్ట్రేలియా గడ్డపై తనే రాజునని అని మరోసారి చాటి చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 143 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను కోహ్లి అందుకున్నాడు. సరిగ్గా 100 పరుగులు చేసి కోహ్లి ఆజేయంగా నిలిచాడు.కాగా ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 30 టెస్టు సెంచరీ. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద భారత్ డిక్లేర్ చేసింది.దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి 534 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ముందు భారత్ ఉంచింది. భారత బ్యాటర్లలో కోహ్లితో పాటు యశస్వి జైశ్వాల్(161) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. -
Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ
ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్ చెప్పాడు. నేను వంద శాతం న్యూజిలాండ్వాడినేచిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్ పంపించారు. అందుకే ఈ సిరీస్ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనుఎజాజ్ చివరి వికెట్ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్ వివరించాడు. చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా -
'వెల్' డన్ సర్ఫరాజ్.. ఎంతో కష్టపడ్డావు: డేవిడ్ వార్నర్
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో మెరిశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సర్ఫరాజ్‌కు ఇది ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అతనికి తొలి సెంచరీ కావడం విశేషం. భారత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అద్బుతమైన ఆట తీరును కనబరిచి శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 110 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపరిచిన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తనదైన షాట్లతో అభిమానులను ఈ ముంబైకర్ అలరిస్తున్నాడు. ప్రస్తుతం 125 పరుగులతో సర్ఫరాజ్ ఆజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ చేరాడు. అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడావు అంటూ డేవిడ్ భాయ్ కొనియాడాడు. "వెల్ డన్ సర్ఫరాజ్. చాలా కష్టపడ్డావు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదంటూ" వార్నర్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో సర్ఫరాజ్, వార్నర్ కలిసి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.ఇక ఈ మ్యాచ్‌లో 71 ఓవర్లు ముగిసే సరికి ఇండియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. న్యూజిలాండ్ కంటే భారత్ 13 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ 125, రిషబ్ పంత్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. అయితే వర్షం కారణంగా ఆట ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి! -
పాక్ కెప్టెన్ సూపర్ సెంచరీ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర
ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇంగ్లీష్ బౌలర్లపై షాన్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహాలో దూకుడుగా ఆడుతున్న మసూద్ కేవలం 102 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 104 పరుగులతో మసూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మసూద్‌కు ఇది ఐదో టెస్టు సెంచరీ. అయితే అతడికి నాలుగేళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం. మసూద్ చివరగా 2020లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించాడు.అంతేకాకుండా 2022 ఏడాది తర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచరీ చేయడం ఇదే మొదటి సారి. 2022 డిసెంబర్లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజం.. కివీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ చేశాడు. ఇప్పుడు మళ్లీ రెండేళ్ల తర్వాత మసూద్ సెంచరీతో మెరిశాడు. ఇక 39 ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో మసూద్‌తో పాటు షఫీక్(72) పరుగులతో ఉన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
లార్డ్స్‌లో ఊచకోత.. 8వ స్ధానంలో వచ్చి విధ్వంసకర సెంచరీ
లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్, యువ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పటివరకు తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించిన అట్కిన్సన్.. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు.ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అట్కిన్సన్ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 103 బంతుల్లోనే అట్కిన్సన్ తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 115 బంతులు ఎదుర్కొన్న అట్కిన్సన్.. 14 ఫోర్లు, 6 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక ఈ సెంచరీతో అతడు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో చోటు సంపాదించుకున్నాడు. అదే విధంగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా అట్కిన్సన్ నిలిచాడు. లార్డ్స్‌లో 8వ స్ధానంలో వచ్చి సెంచరీలు చేసిన వారు వీరేస్టువర్ట్ బ్రాడ్(169, ఇంగ్లండ్)గుబ్బి అలెన్(122, ఇంగ్లండ్ )బెర్నార్డ్ జూలియన్( 121, వెస్టిండీస్)గస్ అట్కిన్సన్( 118, ఇంగ్లండ్)రే ఇల్లింగ్ వర్త్(113, ఇంగ్లండ్)అజిత్ అగార్కర్(109, భారత్)అదే విధంగా లార్డ్స్‌లో టెస్ట్ సెంచరీ, 10 వికెట్ల ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా కూడా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో అట్కిన్సన్‌తో పాటు గుబ్బి అలెన్, కీత్ మిల్లర్ , ఇయాన్ బోథమ్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ ఉన్నారు. He's done it! 💪Enjoy the moment Gus Atkinson reaches his first Test match century 👏 pic.twitter.com/lUZ8ECp7G2— Sky Sports Cricket (@SkyCricket) August 30, 2024 -
శుబ్‌మన్ గిల్ విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 101 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ. ఓవరాల్‌గా అయితే శుబ్‌మన్ 11వ అంతర్జాతీయ సెంచరీ. ఈ సిరీస్‌లో మాత్రం గిల్‌కు ఇది రెండో సెంచరీ. కాగా జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 160 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. హిట్‌మ్యాన్ కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 102 పరుగులతో గిల్ క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది. చదవండి: #RohitSharma: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్.. 48వ సెంచరీ Apni ballebaazi se jeete har dil, kamaal khele Shubman Gill 💯🫶#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/VBpIakUekG — JioCinema (@JioCinema) March 8, 2024 -
సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ దాటిగా ఆడుతోంది. వర్షం కారణంగా రెండో రోజు ఆటలో కొన్ని ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. దీంతో మూడోరోజు ఆటలో తొలి సెషన్ నుంచే పాక్ బ్యాటర్లు దూకుడు కనబరుస్తున్నారు. ఈ క్రమంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 87 పరుగులు నాటౌట్‌గా నిలిచిన షఫీక్ మూడోరోజు ఆటలో సెంచరీ అందుకున్నాడు. 149 బంతుల్లో శతకం అందుకున్న అబ్దుల్లా షఫీక్‌కు ఇది టెస్టుల్లో నాలుగో సెంచరీ.. శ్రీలంకపై రెండోది కావడం విశేషం. 210 బంతుల్లో 131 పరుగులతో ఆడుతున్న షఫీక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 265 పరుగులతో ఆడుతుంది. షఫీక్‌తో పాటు సాద్ షకీల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 99 పరుగుల ఆధిక్యంలో ఉన్న పాకిస్తాన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. Abdullah Shafique brings up his 4th century in Tests! Pakistan continue to build their lead.. #SLvPAK pic.twitter.com/KPxCpC3SDv — Cricbuzz (@cricbuzz) July 26, 2023 చదవండి: మెస్సీ అదరగొట్టినా.. తీవ్ర నిరాశలో అభిమానులు! చరిత్ర సృష్టించిన మలేసియా బౌలర్.. టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు, అన్ని క్లీన్‌బౌల్డ్‌లే..! -
జాక్ క్రాలీ సంచలనం.. యాషెస్ చరిత్రలో మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్‌బాల్ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్ ఎలాగైనా సిరీస్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మరోసారి బజ్‌బాల్ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్ తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్ 400 పరుగులు మార్క్‌ను కూడా క్రాస్ చేసేదే. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్ స్కోరు ఓవర్‌కు ఐదు పరుగుల రనరేట్కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ► ఈ క్రమంలో జాక్ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్‌గా జాక్ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్‌లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్ ఫోస్టర్(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్(1938లో లార్డ్స్ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్ బార్బర్(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ► ఇక యాషెస్ టెస్టులో ఒక్క సెషన్లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్ బ్యాటర్‌గా క్రాలీ రికార్డులకెక్కాడు. ► క్రాలీ స్ట్రైక్‌రేట్ 103 కాగా యాషెస్ చరిత్రలో ఇది రెండో బెస్ట్‌గా ఉంది. 103 స్ట్రైక్‌రేట్‌తో ఒక ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు. ► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రాలీ యాషెస్ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 చదవండి: 500వ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది'
''నాకిది ఆరంభం మాత్రమే.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో నేను టీమిండియాకు చాలా చేయాల్సి ఉంది.''.. ఇవీ విండీస్‌తో తొలి టెస్టులో శతకంతో మెరిసిన జైశ్వాల్ చేసిన వ్యాఖ్యలు. టీమిండియా తరపున అరంగేట్రం చేసిన టెస్టులోనే సెంచరీ చేసిన 17వ ఆటగాడిగా.. మూడో ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్ చరిత్రకెక్కాడు. వీటితో పాటు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టిన జైశ్వాల్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆడుతుంది వెస్టిండీస్ లాంటి బి-గ్రేడ్ జట్టుతో కావొచ్చు.. కానీ ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఒక ల్యాండ్ మార్క్ ఇన్నింగ్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టడం ఏ క్రికెటర్ కైనా గొప్పగానే కనిపిస్తోంది. అందుకే జైశ్వాల్ రెండోరోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. "నాకు, నా కుటుంబానికి, నాకు అన్ని విధాలుగా మద్దతిచ్చిన అందరికీ ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. దీనికి ఎంతగానో సహకరించిన మా అమ్మానాన్నలకు ఈ సెంచరీ అంకితమిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది" అని యశస్వి అన్నాడు. ఒకప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా మలచుకోవడానికి ముంబై వచ్చి పానీపూరీ అమ్మిన యశస్వి.. ఇప్పుడు ఇండియాతరఫున అరంగేట్రం చేయడమే కాదు తొలి టెస్టులోనే సెంచరీతో చెలరేగాడు. 91 ఏళ్ల రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ ద్వారా సెలక్టర్ల దృష్టిలో పడిన యశస్వి.. అంతర్జాతీయ క్రికెట్ ను ఘనంగా మొదలుపెట్టాడు. 2020లో తొలిసారి ఐపీఎల్ ఆడిన యశస్వి.. 2023 సీజన్ ను మరుపురానిదిగా మలచుకున్నాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచ్ లలో 625 రన్స్ చేసి రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. ఒక సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ ప్రదర్శన అతన్ని జాతీయ జట్టులోకి వచ్చేలా చేసింది. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని యశస్వి వమ్ము చేయలేదు. A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt — BCCI (@BCCI) July 14, 2023 చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో ICC-BCCI Revenue Share: పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం -
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. వన్డే తరహాలో రెచ్చిపోయి సెంచరీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన మార్ష్ కేవలం 102 బంతుల్లోనే శతకం సాధించడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించిన ఆసీస్.. మార్ష్ ఇన్నింగ్స్‌తో కోలుకున్నట్లగా కనిపిస్తోంది. మార్ష్‌కు.. ట్రెవిస్ హెడ్ (39 బ్యాటింగ్) అండగా నిలబడ్డాడు. చివరికి 118 బంతుల్లో 118 పరుగులు చేసిన మార్ష్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జాక్ క్రాలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో సూపర్ ఇన్నింగ్స్‌కు తెరపడినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఇక మిచెల్ మార్ష్ నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో ఆఖరిసారిగా ఆడాడు. మళ్లీ తాజాగా యాషెస్తోనే ఎంట్రీ ఇచ్చిన మార్ష్ పునరగమనాన్ని ఘనంగా చాటాడు. కామెరున్ గ్రీన్ గాయపడడంతో మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన మార్ష్ ఏకంగా సెంచరీతో మెరిశాడు. మార్ష్ కెరీర్లో ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం విశేషం. Mitchell Marsh playing brutally against England 100 completed #Ashes#MitchellMarsh#Ashes2023 pic.twitter.com/UDAE7xadUY — Ansh Gaba (@cricketansh12) July 6, 2023 #MitchellMarsh #Bisonball🦬 pic.twitter.com/xNKEXpHqJa — Mr.Mirja (@Mr_Mirja01) July 6, 2023 What an outstanding 100, great counter -attack from Mitchell Marsh. #Ashes pic.twitter.com/8gcITRxdxV — Virender Sehwag (@virendersehwag) July 6, 2023 Sensational, Mitchell Marsh ✨#ENGvAUS | #Ashes pic.twitter.com/F4ATR2Gknr — ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 చదవండి: #MarkWood: యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్ #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు -
ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్ కిందకు విసిరి! వీడియో వైరల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఖ్వాజా సెంచరీతో చెలరేగాడు. వార్నర్, లబుషేన్, స్మిత్ వంటి ఆటగాళ్లు విఫలమైన చోట... ఖ్వాజా ఇంగ్లీష్ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఖ్వాజా విరోచిత పోరాటం ఫలితంగా ఆసీస్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 279 బంతులు ఎదుర్కొన్న ఖావాజా 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో ఖ్వాజాతో పాటు అలెక్స్ క్యారీ(52) పరుగులతో ఉన్నారు. ఖ్వాజా స్పెషల్ సెల్బ్రెషన్ ఇక సెంచరీతో చెలరేగిన ఖ్వాజా స్పెషల్ సెల్‌బ్రెషన్స్ జరపుకున్నాడు. సెంచరీ మార్క్‌ను అందుకున్న వెంటనే గట్టిగా అరుస్తూ తన బ్యాట్‌ను కిందకు విసిరి, ఆసీస్ డ్రస్సెంగ్ రూమ్ వైపు చూస్తూ చేతులు పైకెత్తి సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. కాగా ఖ్వాజాకు ఇంగ్లండ్ గడ్డపై ఇదే తొలి సెంచరీ. అందుకే ఖ్వాజా అంతగా ఎమోషనల్ అయ్యాడు. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఖ్వాజాకు 15 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక ఓవరాల్‌గా ఇది ఖ్వాజాకు 15వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఖ్వాజా సెల్బ్రెషన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: అంపైర్ నితిన్ మీనన్ సంచలన వ్యాఖ్యలు A magnificent 💯 from Usman Khawaja 😍 The south-paw fights against all odds to get Australia back in the game 👊#SonySportsNetwork #RivalsForever #ENGvAUS #Ashes2023 pic.twitter.com/yaz1Y7gIt1 — Sony Sports Network (@SonySportsNetwk) June 17, 2023 -
WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా
ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం టీమిండియాతో ఆరంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో హెడ్ (106 బంతుల్లో 100 బ్యాటింగ్) వన్డే తరహాలో ఆడి సెంచరీ మార్క్ అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ ఫైనల్లో డెవాన్ కాన్వే చేసిన 54 పరుగులే అత్యధిక స్కోరుగా ఉంది. ఇప్పుడు హెడ్ ఆ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఏకంగా సెంచరీతో మెరిశాడు. ఇక ట్రెవిస్ హెడ్‌కు తన టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ కాగా.. టీమిండియాపై, విదేశాల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. History - Travis Head becomes first player to have scored Hundred in WTC Final. pic.twitter.com/PKsEQeFSsw — CricketMAN2 (@ImTanujSingh) June 7, 2023 -
రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. మళ్లీ విజృంభించేనా?
మరో వారం రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య లండన్‌లోని ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది కీలకంగా మారింది. టీమిండియా తరపున డబ్ల్యూటీసీస టైటిల్ సాధించిన తొలి కెప్టెన్‌గా రోహిత్ నిలుస్తాడా లేదా అనేది ఒక వారంలో తేలుతుంది. గతంలో కోహ్లికి ఆ అవకాశం వచ్చినప్పటికి 2021 డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా పరాజయం పాలైంది. రోహిత్‌కు కలిసొచ్చిన ఓవల్.. అయితే ఈసారి ఎలాగైనా ఫైనల్ గెలిచి గదను(డబ్ల్యూటీసీ టైటిల్) అందుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. టీమిండియా కూడా అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానం కెప్టెన్ రోహిత్‌కు అచ్చొచ్చింది. ఓవల్ వేదికగా 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో రోహిత్ శతకంతో మెరిశాడు. హిట్‌మ్యాన్‌కు విదేశాల్లో ఇదే తొలి శతకం కావడం విశేషం. మరి రోహిత్‌కు అచ్చొచ్చిన ఓవల్‌లో మరోసారి సెంచరీతో చెలరేగి టీమిండియాను గెలిపించి టైటిల్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక 2021లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 157 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 191 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కావడంతో వంద పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్(256 బంతుల్లో 127 పరుగులు) సెంచరీకి తోడుగా పుజారా 61, రిషబ్ పంత్ 50, శార్దూల్ ఠాకూర్ 60, కోహ్లి 44, రాహుల్ 46 పరుగులతో రాణించడంతో టీమిండియా 466 పరుగులకు ఆలౌట్ అయింది. 365 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. Oval was the ground that saw Rohit Sharma score his first-ever century outside India. Replicate it skipper! 🇮🇳 #WTCFinal2023 | @ImRo45 pic.twitter.com/Y3u5GH9L8Z — Vicky Singh (@VickyxCricket) June 1, 2023 చదవండి: #SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా! సెల్ఫీతో మొదలు.. అభిమానిని పెళ్లాడనున్న టెన్నిస్ స్టార్ -
'నేనేం గాలిలో తేలడం లేదు.. తగలాల్సిన చోట తగిలింది'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి టెస్టుల్లో తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. కోహ్లి కెరీర్లో ఇది 28వ శతకం. డబుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగిన కోహ్లి తన ఇన్నింగ్స్‌తో టీమిండియా 571 పరుగుల వద్ద ఆలౌట్ కావడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం వచ్చేలా చేశాడు. అయితే ఈ టెస్టు సెంచరీకి ముందు కోహ్లిపై మరోసారి విమర్శలు వచ్చాయి. వన్డేలు, టి20ల్లో మాత్రమే కోహ్లిని ఆడించండి.. టెస్టులకు పక్కనబెట్టండి.. అంటూ పేర్కొన్నారు. కానీ కోహ్లి ఎన్నడూ వారి మాటలను పట్టించుకోలేదు. కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో వరుసగా శతకాలతో రెచ్చిపోయాడు. కానీ ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం కోహ్లి ఆకట్టుకోలేదంటూ వార్తలు రాశారు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది కోహ్లి ఆటపై కాదు.. పిచ్ తీరు గురించి. ఎందుకంటే తొలి మూడు టెస్టుల్లో కోహ్లియే కాదు ఏ ఒక్క బ్యాటర్ కూడా రాణించలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంటూ బ్యాటర్లు ఎలా పరుగులు చేయగలరు. పైగా మూడు టెస్టులో ఒకేరీతిలో రెండున్నర రోజుల్లోనే ముగిశాయి. మరి ఇలా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగుస్తుంటే కోహ్లి మాత్రం ఎలా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సరైన బ్యాటింగ్ పిచ్ కోసం కోహ్లి ఎదురుచూశాడు. ఆ ఎదురుచూపులు మలి టెస్టులోనే ఫలించాయి. అహ్మదాబాద్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై కోహ్లి తన పవరేంటో చూపించాడు. ఒక్క సెంచరీతో చాలా మంది ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న కోహ్లినే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం అవార్డు తీసుకుంటూ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఈ ఒక్క సెంచరీతో నేనేం గాల్లో తేలడం లేదు. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు.. కొత్తగా నిరూపించుకోవాల్సిన పనిలేదు. విఫలమయ్యానన్న ప్రతీసారి నిలదొక్కుకుంటూ వస్తున్నా. ఎవరికి తగలాలో వాళ్లకి గట్టిగానే తగిలింది. నేను ఎందుకు ఫీల్డ్‌లో కొనసాగుతున్నానో చూపించాలనుకున్నా.. చూపించా. ఇక ఆట ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను. నా డిఫెన్స్‌పై నాకు నమ్మకం ఉంది. నాగ్‌పూర్ టెస్టు నుంచి బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టినప్పటికి పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన తొలి మూడు టెస్టుల్లో బ్యాటింగ్‌లో రాణించేందుకు గతంలోలాగే నా శాయాశక్తులా ప్రయత్నించా. కానీ బ్యాటింగ్ సరిగా చేయకపోవడంతో కొంత నిరాశకు గురయ్యా'' అంటూ చెప్పుకొచ్చాడు. -
'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది'
అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో మొదలైన నాలుగో టెస్టులో తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు మంచి బ్యాటింగ్ కనబరిచారు. టీమిండియా బౌలర్లు రోజంతా కష్టపడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఇక తొలిరోజు ఆటలో హైలైట్ అయింది మాత్రం నిస్సందేహంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా నుంచి ఈసారి తన ఆటతో ఎవరైనా భయపెడతారంటే ముందు వినిపించిన పేరు ఖవాజాదే. తాజాగా నాలుగో టెస్టులో ఖవాజా అద్భుత సెంచరీతో మెరిశాడు. 251 బంతుల్లో 104 పరుగులతో ఆడుతున్న ఖవాజా ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి. అతను ఆడిన ఒక్క షాట్లో కూడా చిన్న పొరపాటు లేదంటేనే ఎంత గొప్ప బ్యాటింగ్ కొనసాగించాడో అర్థం చేసుకోవచ్చు. ఖవాజా టెస్టు కెరీర్లో ఇది 14వ సెంచరీ కావొచ్చు.. కానీ టీమిండియాపై, భారత గడ్డపై ఇదే మొదటి శతకం కావడం విశేషం. అందునా భారత్ గడ్డపై సెంచరీ సాధించడం ఎంతో ఎమెషన్తో కూడుకున్నది. అందుకే తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఖవాజా మాట్లాడుతూ కాస్త ఎమెషన్ అయ్యాడు. ''గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. ఈసారి సెంచరీతో మెరిశాను.. అందుకే ఇది ఎంతో విలువైనది'' అని చెప్పుకొచ్చాడు. "ఈ సెంచరీలో చాలా ఎమోషన్ ఉంది. దీని కంటే ముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. మొత్తం 8 టెస్టుల్లోనూ డ్రింక్స్ మోశాను. ఈ వికెట్ చాలా బాగుంది. నా వికెట్ పారేసుకోకూడదని అనుకున్నాను. ఇది మానసిక యుద్ధం. మన అహాన్ని పక్కన పెట్టాలి. నాకు ఎలాంటి మూఢ నమ్మకాలు లేవు. కేవలం ఆడుతూ వెళ్లడమే" అని ఖవాజా చెప్పాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఖవాజా 104 పరుగులు, గ్రీన్ 49 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఐదో వికెట్ కు 85 పరుగులు జోడించారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే కచ్చితంగా గెవాల్సిన పరిస్థితుల్లో ఉన్న టీమిండియా తొలి రోజే ఒత్తిడిలో పడింది. First 💯 for Usman Khawaja against India and what a time to get it 🙌#INDvAUS #BGT2023 #UsmanKhawaja #SteveSmith #ViratKohli #Cricket pic.twitter.com/Xv4QAtP46z — Abdullah Liaquat (@im_abdullah115) March 9, 2023 చదవండి: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా.. విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా? -
రెండేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ
నాగ్‌పూర్ వేదికగా జరగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 171 బంతుల్లో రోహిత్ శతకం నమోదు చేశాడు. దీంతో తన రెండేళ్ల టెస్టు సెంచరీ నిరీక్షణకు రోహిత్ తెరదించాడు. కాగా రోహిత్ కెరీర్లో ఇది 9వ టెస్టు సెంచరీ కావడం గమానార్హం. రోహిత్ చివరసారిగా 2021లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. ఇక రోహిత్ 104 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓ వైపు వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్నప్పటికీ రోహిత్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 14 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. 69 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్‌తో పాటు జడేజా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(20), విరాట్ కోహ్లి(12), పుజారా(7), అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో యువ స్పిన్నర్ టాడ్ మార్ఫీ నాలుగు వికెట్లు, లియాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! Smiles, claps & appreciation all around! 😊 👏 This has been a fine knock! 👍 👍 Take a bow, captain @ImRo45 🙌🙌 Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/gW0NfRQvLY — BCCI (@BCCI) February 10, 2023 -
రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు
జింబాబ్వే క్రికెటర్ గ్యారీ బ్యాలెన్స్ అరంగేట్రం టెస్టులోనే శతకంతో అదరగొట్టాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో గ్యారీ బ్యాలెన్స్ ఈ ఫీట్ సాధించాడు. కష్టాల్లో ఉన్న జింబాబ్వే ఇన్నింగ్స్‌ను తన శతకంతో నిలబెట్టాడు. బ్రాండన్ మవుటా(52 బ్యాటింగ్)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 121 పరుగులు జోడించాడు. ఎంతో ఓపికతో ఆడిన బ్యాలెన్స్ 190 బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సర్లతో శతకాన్ని అందుకున్నాడు. టీ విరామ సమయానికి జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. గ్యారీ బ్యాలెన్స్ 107 పరుగులు, బ్రాండన్ మవుటా 52 పరుగులు క్రీజులో ఉన్నారు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌ను 447 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తన అరంగేట్రం టెస్టులోనే శతకంతో మెరిసిన గ్యారీ బ్యాలెన్స్ టెస్టు క్రికెట్లో సరికొత్త రికార్డులు తన పేరిట నమోదు చేసుకున్నాడు. వాస్తవానికి గ్యారీ బ్యాలెన్స్‌కు టెస్టుల్లో ఇది ఐదో సెంచరీ. అయితే ముందు వచ్చిన నాలుగు టెస్టు సెంచరీలు ఇంగ్లండ్ తరపున చేశాడు. తాజాగా మాత్రం జింబాబ్వే తరపున శతకం మార్క్‌ను అందుకున్నాడు. 2013 నుంచి 2017 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన గ్యారీ బ్యాలెన్స్ నాలుగు టెస్టు శతకాలు సాధించడం విశేషం. ఇలా రెండు దేశాల తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గ్యారీ బ్యాలెన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకముందు కెప్లర్ వెసెల్స్ ఈ ఫీట్ సాధించాడు. 1982-85 మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు.. ఆ తర్వాత 1991-94 మధ్య తన స్వంత దేశమైన సౌతాఫ్రికాకు ఆడాడు. ఈ సమయంలోనే రెండు దేశాల తరపున టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. తాజాగా గ్యారీ బ్యాలెన్స్ ఇంగ్లండ్, జింబాబ్వే తరపున టెస్టుల్లో శతకాలు చేసిన క్రికెటర్‌గా కెప్లర్ వెసెల్స్ సరసన చేరాడు. ఇక గ్యారీ బ్యాలెన్స్ మరో అరుదైన ఫీట్‌ను కూడా అందుకున్నాడు. అరంగేట్రం టెస్టులోనే శతకం బాదిన 24వ క్రికెటర్‌గా నిలిచాడు. గ్యారీ బ్యాలెన్స్ పుట్టి, పెరిగి, విద్యనభ్యసించింది జింబాబ్వేలోనే. అయితే బ్యాలెన్స్ 2006లో తన తాతముత్తాతల దేశమైన బ్రిటన్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు. ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్న బ్యాలెన్స్.. ఆ క్రమంలో కౌంటీల్లో సత్తా చాటి 2013లో ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి నాలుగేళ్లపాటు (2017 వరకు) ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్యాలెన్స్.. ఆతర్వాత ఫామ్ కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత యువ ఆటగాళ్లు జట్టులో స్థానాలను సుస్థిరం చేసుకోవడంతో బ్యాలెన్స్‌కు అవకాశాలు రాలేదు. దీంతో అతను తిరిగి సొంతగూటికి (జింబాబ్వే) చేరాడు. 33 ఏళ్ల బ్యాలెన్స్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్ట్‌లు, 18 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో బ్యాలెన్స్‌ను మంచి రికార్డు ఉంది. బ్యాలెన్స్ 37.5 సగటున 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీల సాయంతో 1498 పరుగులు చేశాడు. Century on Zimbabwe Test debut for Gary Ballance 💪 Watch #ZIMvWI live and FREE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 📝 Scorecard: https://t.co/kWH1ac3IPs | 📸: @ZimCricketv pic.twitter.com/7CCIADlD2Z — ICC (@ICC) February 7, 2023 Fifth Test 💯 for Gary Ballance on debut for Zimbabwe. He also becomes the second batter after Kepler Wessels to have Test tons for two countries👏#ZIMvWI #Cricket #TestCricket — Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) February 7, 2023 Gary Ballance has scored a hundred in his first Test for Zimbabwe - and he brought up with a good ol' slog over mid-wicket - and 24th Test overall. He has four Test centuries for England. This one will likely save the Test for Zimbabwe. #cricket #ZIMvWI — Firdose Moonda (@FirdoseM) February 7, 2023 చదవండి: ఐపీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రేసులో గిల్, సిరాజ్ -
ఎనిమిదేళ్ల తర్వాత తొలి సెంచరీ.. పాక్ ఆటగాడి సెలబ్రేషన్స్ మాములుగా లేవుగా!
నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అదరగొడుతున్నాడు. కివీస్‌తో స్వదేశంలో జరిగిన మొదటి టెస్టులో 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ అహ్మద్.. తాజాగా రెండో టెస్టులో కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ 118 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా ఇది సర్ఫరాజ్‌కు ఎనిమిదేళ్ల తర్వాత తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. ఇక సెంచరీ సాధించిన వెంటనే సర్ఫరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. గాల్లోకి ఎగురుతూ, గ్రౌండ్‌కు పంచ్ చేస్తూ తన సెంచరీ సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ కూడా డ్రాగా ముగిసింది. 319 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ విజయానికి 15 పరుగులు అవరసమవ్వగా.. వెలుతురులేమి కారణంగా ఆఖరి రోజు ఆటను అంపైర్లు నిలిపివేశారు. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 9 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కూడా తమ విజయానికి కేవలం ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. This moment 💚 Sarfaraz delivers on his home ground 👏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/LoIPI9HrcG — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 చదవండి: Rishabh Pant: బ్రదర్ అంటూ వార్నర్ భావోద్వేగం.. ఫొటో వైరల్ -
Pak Vs NZ: ఇదో సంప్రదాయంగా పెట్టుకున్నాడే! కాన్వే అరుదైన ఫీట్
Pakistan vs New Zealand, 2nd Test- Devon Conway: పాకిస్తాన్‌తో రెండో టెస్టులో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే శతకం సాధించాడు. 191 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 122 పరుగులు చేశాడు. కాగా కరాచీ వేదికగా సోమవారం(జనవరి 2) ఆరంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచిన కివీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదటి రోజు ఆటలో భాగంగా 51.1 ఓవర్లో మీర్ హంజా బౌలింగ్‌లో పరుగులు తీసిన కాన్వే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికి నాలుగో శతకం కావడం గమనార్హం. అంతేకాకుండా.. ఈ ఇన్నింగ్స్‌లో మరో అరుదైన ఫీట్ కూడా నమోదు చేశాడు కాన్వే. గతేడాది బంగ్లాదేశ్‌తో టెస్టులో భాగంగా జనవరి 1న సెంచరీ చేసిన కాన్వే.. ఈ ఏడాది కూడా అదే తరహాలో శతకంతో కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ వికెట్ కీపర్ బ్యాటపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. గత మ్యాచ్‌లో సెంచరీకి 8 పరుగుల దూరంలో నిలిచిపోయిన అతడు.. ఈసారి 100 పరుగుల మార్కు అందుకోవడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కాన్వేను గట్టిగా ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉంటే.. వరుసగా జనవరి 1, 2022- జనవరి 2, 2023లో సెంచరీ బాదడాన్ని ప్రస్తావిస్తూ అన్నీ కుదిరితే.. వచ్చే ఏడాది మూడో తారీఖున శతకం బాదుతాడేమో అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్లో కాన్వేచెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘‘కొత్త ఏడాది.. న్యూజిలాండ్‌కు కొత్త 100.. గతేడాది నుంచి కాన్వే ఇదో సంప్రదాయంలా పాటిస్తున్నాడు’’ అని కొనియాడింది. చదవండి: BBL: సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా? Devon Conway reaches his fourth Test 💯#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/Yic6mXYsGQ — Pakistan Cricket (@TheRealPCB) January 2, 2023 New Year. New 💯 for New Zealand! Conway has made it a ritual since 2022! #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/7XmJ02wxUG — Chennai Super Kings (@ChennaiIPL) January 2, 2023 -
మాట నిలబెట్టుకున్న కేన్ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కేన్ మామ 206 బంతుల్లో శతకం మార్కును అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి. దీంతో 722 రోజుల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది. విలియమ్సన్ బ్యాట్ నుంచి ఆఖరిసారి 2021 జనవరిలో సెంచరీ వచ్చింది. అప్పటినుంచి శతకం అనేది అందని ద్రాక్షలా మారింది. ఈలోగా కెప్టెన్సీ బాధ్యతలతో సతమతమవడం అతని బ్యాటింగ్ లయను దెబ్బతీసింది. దీంతో కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో కచ్చితంగా సెంచరీ చేస్తానని పేర్కొన్నాడు. తాజా శతకంతో ఇచ్చిన మాటను కేన్ మామ సగర్వంగా నిలబెట్టుకున్నాడు. ఇక కేన్ విలియమ్సన్ టెస్టు కెరీర్లో ఇది 25వ శతకం కావడం విశేషం. ఇక తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిక్యంలోకి వచ్చింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 440 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్(105 బ్యాటింగ్), ఇష్ సోదీ(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్ రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజం, అగా సల్మాన్‌లు సెంచరీలతో కథం తొక్కారు. Kane Williamson brings up his 25th Test hundred 🏏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/wwRMYLvt7u — Pakistan Cricket (@TheRealPCB) December 28, 2022 💯 for Kane Williamson! His 25th in Test cricket. 206 balls, 322 minutes, 11 fours. Follow play LIVE in NZ with @skysportnz and @SENZ_Radio. LIVE scoring | https://t.co/zq07kr4Kwt #PAKvNZ pic.twitter.com/YrPr9UUiwE — BLACKCAPS (@BLACKCAPS) December 28, 2022 చదవండి: క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసిన మహ్మద్ రిజ్వాన్.. సిరీస్ ఓటమిపై ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా -
డెబ్యూ సెంచరీతోనే అరుదైన రికార్డు కొట్టిన గిల్
టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన గిల్.. ఈ ఏడాది టీమిండియా తరపున సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా నిలిచాడు. ఈ ఏడాది టీమిండియా ఓపెనర్లలో ఎవరు శతకాలు చేయలేదు. రెండుసార్లు అర్థసెంచరీలు మాత్రమే చేయగలిగారు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో పుజారా 66 పరుగులు చేయగా.. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో కేఎల్ రాహుల్ 50 పరుగులు చేశాడు. అయితే తాజాగా మాత్రం బంగ్లాతో టెస్టులో సెంచరీ చేసిన గిల్.. డెబ్యూ టెస్టు సెంచరీ సాధించడంతో పాటు ఈ ఏడాది సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇక తొలి టెస్టులో టీమిండియా పట్టు భిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్లర్లు సత్తా చాటడంటో బంగ్లా ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. అంతకముందు శుబ్‌మన్ గిల్, పుజారాలు సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు కుప్పకూలగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ అయింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలిఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశముంది. చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? Love you @ShubmanGill 😘 pic.twitter.com/XjfBSnmAEZ — depressed gill fan (@ShubmanGillFan) December 16, 2022 -
కరువు తీరింది.. 52 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్న పుజారా ఈసారి మాత్రం ఆ అవకాశాన్ని వదల్లేదు. అంతేకాదు టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన పుజారా తన శైలికి భిన్నంగా ఆడుతూ ఫాస్టెస్ట్ సెంచరీ అందుకోవడం విశేషం. 130 బంతుల్లో వంద పరుగుల మార్క్‌ను అందుకున్న పుజారాకు ఇది టెస్టుల్లో 19వ సెంచరీ. పుజారా ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి. ఇక పుజారా 52 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ మార్క్ అందుకొని సెంచరీల కరువును తీర్చుకున్నాడు. మధ్యలో చాలాసార్లు మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన పుజారా శతకం మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఓపెనర్ శుబ్‌మన్ గిల్ కూడా డెబ్యూ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేసి ఔటైనప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 152 బంతుల్లో 110 పరుగులు చేసి ఔటయ్యాడు. పుజారా శతకం బాదగానే టీమిండియా 258 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచింది. ఆటకు రెండురోజుల సమయం ఉండడంతో టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. cheteshwar pujara Test fastest century#INDvBAN #pujara #TestCricket pic.twitter.com/U6PhVACKxO — sportsliveresults (@Ashishs92230255) December 16, 2022 చదవండి: టీమిండియాతో తొలి టెస్టు.. బంగ్లాదేశ్ టార్గెట్ 512 -
పాపం శ్రేయస్ అయ్యర్.. తృటిలో సెంచరీ మిస్!
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. రెండో రోజు ఆట ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్(86) ఔటయ్యాడు. ఎబాడోట్ హోస్సేన్ అద్భుతమైన బంతితో అయ్యర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే మ్యాచ్ తొలిరోజే శ్రేయస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాల్సింది. అదృష్టవశాత్తూ ఎబాడోట్ వేసిన బంతి స్టంప్స్ తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడంతో అయ్యర్ బతికిపోయాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను కూడా బంగ్లా ఫీల్డర్లు జారవిడిచారు. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవడంలో అయ్యర్ విఫలమయ్యాడు. అంతకుముందు భారత వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 90 పరుగులు వద్ద పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. ఇక రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 348 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్(40), కుల్దీప్ యాదవ్(21) ఉన్నారు. చదవండి: సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ -
స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు!
పాకిస్తాన్ గడ్డపై ఆస్ట్రేలియా రికార్డుల హోరు సృష్టిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాకపోవడంతో మూడో టెస్టులోనైనా గెలవాలనే పట్టుదలతో ఆసీస్ ఆడుతోంది. అందుకు తగ్గట్టుగానే పాక్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు విజృంభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్స్ పండగ చేసుకుంటున్నారు. లాహోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మరో సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో 160 పరుగులతో రాణించిన ఖవాజా .. తాజాగా టెస్టు కెరీర్లో 12వ సెంచరీ సాధించాడు. నుమాన్ అలీ బౌలింగ్‌లో రెండు పరుగులు తీయడం ద్వారా ఖవాజా శతకం మార్కును అందుకున్నాడు. యాషెస్ సిరీస్ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఖవాజాకు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఇక ఆస్ట్రేలియా సీనియర్ సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వార్నర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్‌ను సాధించాడు. కాగా 8వేల పరుగులు చేరడానికి స్మిత్ 85 టెస్టుల్లో 151 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా టెస్టుల్లో 8వేల పరుగుల మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆటగాడిగా స్టీవ్‌స్మిత్ ప్రపంచరికార్డు సాధించాడు. ఇంతకముందు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 152 ఇన్నింగ్స్‌ల్లో ఎనిమిది వేల పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. 12 ఏళ్ల క్రితం టీమిండియాతో మ్యాచ్‌లో సంగా ఈ ఫీట్‌ను సాధించాడు. సంగక్కర తర్వాతి స్థానంలో భారత్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(154 ఇన్నింగ్స్‌లు), విండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్(157 ఇన్నింగ్స్‌లు), టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(158 ఇన్నింగ్స్‌లతో) వరుసగా ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 227 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఖవాజా 104 నాటౌట్, డేవిడ్ వార్నర్ 51 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్ పాకిస్తాన్ ముందు 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇప్పటికైతే పాకిస్తాన్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ , ఇమాముల్ హక్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆటకు మరోరోజు మిగిలి ఉండడంతో ఫలితం వచ్చే అవకాశముంది. చదవండి: PAK vs AUS: నిన్న కత్తులు దూశారు.. ఇవాళ చేతులు కలిపారు; శుభం కార్డు పడినట్లే! Manchester United: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. ఎవరా ఆటగాడు? A new world record for Steve Smith! The fastest player ever to 8,000 Test runs #PAKvAUS pic.twitter.com/xmC7iSM7uN — cricket.com.au (@cricketcomau) March 24, 2022 -
46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్
టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్ సెంచరీ సాధించడం గొప్పగా భావిస్తారు. వన్డేలు, టి20లు రాకముందు టెస్టు మ్యాచ్‌లే అసలైన క్రికెట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలుత ఆరు రోజుల పాటు నిర్వహించిన టెస్టు మ్యాచ్‌లను క్రమంగా ఐదు రోజులకు కుదించారు. ఐదు రోజులపాటు జరగాల్సిన మ్యాచ్‌లు ఇటీవలే మూడు, నాలుగు రోజుల్లోనే ఎక్కువగా ముగుస్తున్నాయి. ఇక టెస్టు మ్యాచ్‌ల్లో సెంచరీ సాధిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. కానీ ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. తాజాగా పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ బాది ఆ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు. మరి లేటు వయసులో టెస్టు సెంచరీ అందుకొని.. ఒక నటి చేత ముద్దుల వర్షం అందుకున్న క్రికెటర్ కూడా ఒకరు ఉన్నారు. ఆ క్రికెటర్ ఎవరో తెలుసా.. ఇంగ్లండ్‌కు చెందిన ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మన్ జాక్ హాబ్స్. ఈ తరానికి జాక్ హాబ్స్ పేరు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 19వ దశకంలో క్రికెట్ ఇష్టపడిన వారికి జాకబ్ హాబ్స్ పేరు సుపరిచితం. ఇంగ్లండ్ తరపున 1908-1930 మధ్య 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 61 టెస్టుల్లో 5410 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యంత లేటు వయసులో(46 ఏళ్ల 82 రోజులు) టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా జాక్ హాబ్స్ ఇప్పటికి తొలి స్థానంలో ఉన్నాడు. 1929లో యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన చివరి టెస్టులో జాక్ హాబ్స్ ఒక ఇన్నింగ్స్‌లో 142 పరుగులు సాధించాడు. 46 ఏళ్ల వయసులో సెంచరీ అందుకున్న తొలి క్రికెటర్‌గా స్థానం జాక్ హాబ్స్ నిలిచాడు. కాగా 1963లో కన్నుమూసిన జాక్ హాబ్స్ 1935లో మై లైఫ్ స్టోరీ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. ఆ పుస్తకంలో తాను లేటు వయసులో సెంచరీ సాధించిన రోజు ఒక ఇంగ్లీష్ ఫేమస్ నటి ముద్దుల్లో ముంచిందని పేర్కొన్నాడు. ''మెల్బోర్న్ టెస్టులో 142 పరుగులు చేసిన నేను.. ఆరోజు సాయంత్రం చిన్న పార్టీ ఇచ్చారు. హోటల్ డైనింగ్ రూమ్‌కు అడుగుపెట్టిన నాకు అందరు అభినందనలు చెప్పారు. కానీ ఒకావిడ మాత్రం నా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టింది. ఈ పరిణామం ఆశ్చర్యపరిచినప్పటికి.. ఇదో రకమైన కృతజ్థత అనుకున్నా. కానీ ఆ నటి ఎవరో నేను ఇప్పడు చెప్పలేను'' అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు న్యూ సౌత్‌వేల్స్ అనే వార్తా పత్రిక జాక్ హాబ్స్‌ను ముద్దుపెట్టిన నటి పేరును బయటకు వెల్లడించింది. కెనడాకు చెందిన మార్గరెట్ బానర్మన్ అనే ఫేమస్ ఆర్టిస్ట్.. హాబ్స్‌కు ముద్దు పెట్టిందంటూ హెడ్‌లైన్స్ రాసుకొచ్చింది. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ దెబ్బకు మార్గరెట్ పేరు మార్మోగిపోయింది. 1896లో టొరంటోలో జన్మించిన బానర్మన్ కొన్నేళ్ల పాటు ఇంగ్లీష్ సినిమాల్లో నటించింది. మంచి నటిగా పేరున్న మార్గరెట్ బానర్మన్ 1976లో 79 ఏళ్ల వయసులో మరణించింది. ఇక లేటు వయసులో టెస్టుల్లో సెంచరీ సాధించిన జాబితాలో జాక్ హాబ్స్ తొలి స్థానంలో ఉండగా.. పాస్టీ ఎండ్రెన్( ఇంగ్లండ్, 45 ఏళ్ల 151 రోజులు), వారెన్ బార్డ్స్లే(ఆస్ట్రేలియా, 43 ఏళ్ల 202 రోజులు), డేవ్ నోర్సీ(సౌతాఫ్రికా, 42 ఏళ్ల 291 రోజులు), ఫ్రాంక్ వూలీ( ఇంగ్లండ్, 42 ఏళ్ల 61 రోజులు), మిస్బా ఉల్ హక్( పాకిస్తాన్, 42 ఏళ్ల 47 రోజులు) వరుసగా ఉన్నారు. చదవండి: Ruturaj Gaikwad - IPL 2022: సీఎస్కేకు బిగ్‌షాక్.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం! Anirban Lahiri: భారత క్రీడల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ కొట్టేశాడు.. -
పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు
పదేళ్ల క్రితం జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. రెండు, మూడేళ్లలో సదరు క్రికెటర్‌కు గుర్తింపైనా వచ్చుండాలి.. లేదంటే జట్టులోకి వస్తూ.. పోవడం జరిగి ఉండాలి. మ్యాచ్‌లు ఎక్కువ ఆడితే సూపర్ స్టార్ అవడం.. లేదంటే కనుమరుగవడం జరుగుతుంది. కానీ పదేళ్ల క్రితమే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి.. మళ్లీ మధ్యలో ఒక్క మ్యాచ్ ఆడకుండా.. తాజా రీఎంట్రీలో సెంచరీతో మెరిసిన క్రికెటర్లు అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందినవాడే వెస్టిండీస్ క్రికెటర్ న్క్రుమా బోనర్. బోనర్ వెస్టిండీస్ తరపున 2011లోనే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌కు బోనర్‌ను బోర్డు ఎంపిక చేసింది. ఆ సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడిన బోనర్ మూడు పరుగులు మాత్రమే చేసి.. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఆ తర్వాత ఆరు నెలలకు గాని మళ్లీ తలుపు తట్టలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో 30 బంతుల్లో 27 పరుగులు చేశాడు. అంతే మళ్లీ అప్పటినుంచి పదేళ్ల పాటు విండీస్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పదేళ్ల గ్యాప్‌లో అతనికి బోర్డు నుంచి ఒక్కసారి పిలుపు రాలేదు. ఇక కెరీర్ ముగిసినట్లే అని భావిస్తున్న దశలో 2019లో జమైకా జట్టుకు ఎంపికయ్యాడు. బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కరోనా గ్యాప్ వల్ల రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు డిసెంబర్ 2020లో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు బోనర్‌ను ఎంపిక చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన బోనర్.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో చారిత్రక విజయంలో భాగమయ్యాడు. 395 పరుగులు లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్‌ను కైల్ మేయర్స్(245 నాటౌట్) సూపర్ డబుల్‌సెంచరీతో గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో బోనర్ 85 పరుగులతో మేయర్స్‌కు అండగా నిలబడ్డాడు. ఒక రకంగా బోనర్ కెరీర్‌కు ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఆగస్టులో పాకిస్తాన్‌తో జరిగిన ఒక టెస్టులో వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ బోనర్ కీలకపాత్ర పోషించాడు. తాజగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బోనర్ 123 పరుగులతో కెరీర్లో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. దాదాపు తొమ్మిది గంటలపాటు ఓపికగా ఆడిన బోనర్ 355 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 123 పరుగులు సాధించాడు. అతని కళాత్మక ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. అలా పదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చి తాజాగా సెంచరీతో వెలుగులోకి వచ్చిన అరుదైన క్రికెటర్ల జాబితాలో బోనర్ చేరిపోయాడు.ఇక తొలి టెస్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 157 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌట్ అయింది. చదవండి: Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్‌లు తయారు చేయకండి' -
జడేజా సరికొత్త రికార్డు.. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా
టీమిండియా, శ్రీలంక మధ్య జరుగతున్న తొలి టెస్టు రవీంద్ర టెస్టుగా మారిపోయింది. బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లతో మెరిసి ఆల్‌రౌండర్ అనే పదానికి మరోసారి అర్థం చెప్పాడు. స్వదేశీ పిచ్‌లపై తన బౌలింగ్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. లంకతో తొలి టెస్టులో ముందు బ్యాటింగ్‌లో 228 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 175 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా జడేజా టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అవేంటో పరిశీలిద్దాం. ►ఒకే టెస్టు మ్యాచ్‌లో 150కి పైగా పరుగులు.. ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా .. టీమిండియా తరపున మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ►ఇంతకముందు టీమిండియా తరపున వినూ మాన్కడ్ 1952లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో బ్యాటింగ్‌లో 184 పరుగులు.. బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ►1962లో వెస్టిండీస్‌తో టెస్టులో మరో భారత క్రికెటర్ పాలి ఉమ్రిగర్ 172 పరుగులు నాటౌట్.. ఐదు వికెట్లు తీశాడు ►ఇక ఓవరాల్‌గా జడేజా ఆరో స్థానంలో ఉండగా.. వినూ మాన్కడ్, డెనిస్ అట్కిన్సన్, పాలి ఉమ్రిగర్, గ్యారీ సోబర్స్, ముస్తాక్ మహ్మద్ ఉన్నారు. ►జడేజా ఆఖరుసారి టెస్టుల్లో 2017లో ఐదు వికెట్లు తీశాడు. అప్పుడు ప్రత్యర్థి శ్రీలంకనే కావడం విశేషం. కొలంబో వేదికగా జరిగిన ఆ టెస్టులో జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తాజాగా మరోసారి శ్రీలంకపై ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. ►జడేజాకు టెస్టుల్లో ఐదు వికెట్లు తీయడం ఇది పదోసారి. ►ఇక టెస్టులో టీమిండియా శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం పదోసారి కావడం విశేషం. A 5⃣-wicket haul for @imjadeja as #TeamIndia wrap Sri Lanka innings for 174 🔥🔥 Follow the match ▶️ https://t.co/XaUgOQVg3O#INDvSL | @Paytm pic.twitter.com/iJoGxRr6cY — BCCI (@BCCI) March 6, 2022 -
అరె జడేజా ఎన్నాళ్లకెన్నాళ్లకు..
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ సెంచరీతో మెరిశాడు. టాపార్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చేయలేని సెంచరీని జడేజా సాధించాడు. 160 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో జడేజా టెస్టుల్లో రెండో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. లంబుల్డేనియా బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 111వ ఓవర్ తొలి బంతిని జడేజా కవర్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. అంతే జడేజా తన స్టైల్ కత్తిసాము సెలబ్రేషన్‌తో మెరిశాడు. జడేజా ఎప్పుడు అర్థసెంచరీ లేదా సెంచరీ చేసిన ప్రతీసారి తన బ్యాట్‌నే కత్తిలా తిప్పడం చేస్తుంటాడు. ఈ సెలబ్రేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా గాయం తర్వాత తిరిగొచ్చిన జడేజాకు రీఎంట్రీలో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అందుకే సెంచరీ బాదగానే బ్యాట్‌ను కత్తిలా తిప్పిన జడేజా.. ఆ తర్వాత ఒక చేతిలో హెల్మెట్.. ఇంకో చేతిలో బ్యాట్‌ను పట్టుకొని చిరునవ్వుతో డ్రెస్సింగ్ రూప్ వైపు చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సెంచరీ చేసి జడేజా అలా బ్యాట్ తిప్పగానే అభిమానులు కామెంట్స్ చేశారు. అరె జడేజా మళ్లీ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సూపర్ సెంచరీతో మెరిశావు.. బ్యాట్‌ను తిప్పావు.... జడ్డూ భయ్యా.. నీ స్లైలే వేరెప్పా అంటూ పేర్కొన్నారు. ఇక సెంచరీ తర్వాత తన ఆటలో జోరు పెంచిన జడేజా 150 పరుగుల మార్క్‌ను 51 బంతుల్లోనే సాధించి డబుల్ సెంచరీ వైపు పరిగెడుతున్నాడు. అంతకముందు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 'Rockstar' @imjadeja 👏👏@Paytm #INDvSL pic.twitter.com/JG25othE56 — BCCI (@BCCI) March 5, 2022 -
గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు
న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డెవన్ కాన్వే కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో తొలిరోజే కాన్వే సెంచరీ బాదాడు. కాగా 2022 క్రికెట్లో డెవన్ కాన్వేది తొలి సెంచరీ కావడం విశేషం. అయితే టి20 ప్రపంచకప్ సందర్భంగా ఒక మ్యాచ్‌లో తాను ఔటయ్యాననే కోపంతో తన కుడిచేతిని బ్యాట్‌కు బలంగా కొట్టుకున్నాడు. దీంతో చేతికి గాయం కావడంతో దాదాపు ఏడు వారాలు జట్టుకు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న కాన్వే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జనవరి 1న ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో తొలిరోజే సెంచరీ సాధించి సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చదవండి: Team India Schedule 2022: బిజీ బిజీగా టీమిండియా.. 2022లో ఆడనున్న మ్యాచ్‌లు ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టును ఘనంగా ఆరంభించింది. ఓపెనర్ టామ్ లాథమ్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరినప్పటికి.. విల్ యంగ్(52) ఆకట్టుకోగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కాన్వే 122 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం న్యూజిలాండ్ 80 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ 17, టామ్ బ్లండెల్ 1 పరుగుతో ఆడుతున్నారు. చదవండి: Kieron Pollard: కెప్టెన్‌గా పొలార్డ్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్ Two hundreds and two fifties in his first seven Test innings! Devon Conway returns from injury with a 💯 🙌 #NZvBAN — ESPNcricinfo (@ESPNcricinfo) January 1, 2022 -
కేఎల్ రాహుల్ శతకం.. టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డులు బద్దలు
KL Rahul Century In Test: సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. ప్రొటీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 219 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న రాహుల్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండడం విశేషం. బాక్సింగ్ డే రోజున(డిసెంబర్ 26) సెంచరీ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్‌కు టెస్టుల్లో ఇది ఏడో శతకం. విదేశీ గడ్డపై ఐదో శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ టెస్టు ఓపెనర్‌గా పలు రికార్డుల బద్దలుకొట్టాడు. ►టీమిండియా టెస్టు ఓపెనర్‌గా విదేశాల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్(81 ఇన్నింగ్స్‌లో 12 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్( 34 ఇన్నింగ్స్‌లో 5 శతకాలు) ఉండడం విశేషం. ఇక మూడో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్(59 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు) ఉన్నాడు. ఇక వినూ మాన్కడ్(19 ఇన్నింగ్స్‌లు), రవిశాస్త్రి(19 ఇన్నింగ్స్‌లు) మూడేసి సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు. ►ఇక సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన రెండో టెస్టు ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంతకముందు వసీం జాఫర్ 2006-07లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టులో 116 పరుగులు సాధించాడు. ►ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై పర్యాటక జట్టు ఓపెనర్‌గా సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇంతకముందు సయీద్ అన్వర్(పాకిస్తాన్), క్రిస్ గేల్(వెస్టిండీస్) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
రోహిత్ సెంచరీ.. భార్య రితికా ముద్దుల వర్షం
లండన్: ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీతో విదేశాల్లో తొలి సెంచరీ సాధించడంతో పాటు పలు రికార్డులు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సెంచరీతో మురిసిపోయిన భార్య రితికా శర్మ భర్తపై ముద్దుల వర్షం (ప్లైయింగ్ కిస్) కురిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కెమెరాలు క్లిక్‌మనిపించాయి. కాగా రోహిత్ సిక్స్ కొట్టి సెంచరీ చేసిన వెంటనే తన భార్య కూర్చొని ఉన్న గ్యాలరీవైపు బ్యాట్‌ను ఎత్తి చూపాడు. వెంటనే రితికా లేచి నిలబడి సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ.. విదేశీ గడ్డపై తొలిసారి ఆ తర్వాత రోహిత్ తన బ్యాట్‌ను డ్రెస్సింగ్‌రూమ్ వైపు తిప్పగా.. రవిశాస్త్రి , ఇతర ఆటగాళ్లు చప్పట్లతో అభినందించగా.. కోహ్లి మరికాస్త ముందుకెళ్లి తన చేతితో కుమ్మేయ్ అన్న రీతిలో సైగ చేశాడు. ఇక మూడోరోజు అన్ని సెషన్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన టీమిండియా నాలుగో రోజు ఆటను ఆరంభించింది. ప్రస్తుతం 96 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కోహ్లి 27, జడేజా 12 పరుగులతో ఆడుతున్నారు. ఓవరాల్‌గా టీమిండియా 179 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: ENG Vs IND: 'పుజారాతో పెట్టుకోకు ఓవర్టన్'.. వీడియో వైరల్ Talented batter: Scores a century 👏 Brilliant batter: Scores an away Test century 🙌 Hitman: Scores an away Test century with a SIX 💙💙💙#OneFamily #MumbaiIndians #ENGvIND @ImRo45 pic.twitter.com/4wvKWvnQC1 — Mumbai Indians (@mipaltan) September 4, 2021 Flying kiss from wife😍 pic.twitter.com/lcwrgwRFn7 — Shubham Rai (@Shubhamrai_) September 4, 2021 -
Rohit Sharma: రోహిత్ శర్మ సెంచరీ.. విదేశీ గడ్డపై తొలిసారి
లండన్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో మెరిశాడు. 205 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌ర్ సాయంతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్ సిక్స్‌తో సెంచరీ సాధించడం విశేషం. రోహిత్ శర్మ సెంచరీల విషయంలో ఒక రికార్డును సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టెస్టుల్లో 8 సెంచరీలు నమోదు చేయగా.. అందులో 7 సెంచరీలు స్వదేశంలోనే వచ్చాయి. తాజా సెంచరీ మాత్రం విదేశీ గడ్డపై వచ్చింది. అలా రోహిత్ శర్మ విదేశీ గడ్డపై టెస్టుల్లో తొలి సెంచరీ సాధించాడు. చదవండి: ENG Vs IND: 'పుజారాతో పెట్టుకోకు ఓవర్టన్'.. వీడియో వైరల్ ఇక టీమిండియా నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. సెంచరీతో అదరగొట్టిన రోహిత్ 127 పరుగులు వద్ద ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారా, రోహిత్‌ల 153 పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. ఆ వెంటనే పుజారా(61) రాబిన్సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 81 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. కోహ్లి 1 పరుగుతో క్రీజులో ఉన్నాడు. చదవండి: Pujara Vs Rohit: 'సింగిల్ చాలు అన్నానుగా'.. పుజారాపై రోహిత్ అసహనం Century with a six For Hitman 💥💙 @ImRo45 #RohitSharma pic.twitter.com/4L6JTdR5O8 — Mumbai Indians TN (@MumbaiIndiansTN) September 4, 2021 -
జో రూట్ అరుదైన ఘనత
చెన్నై: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శతకం సాధించిన రూట్ .. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు 100వ టెస్టులో సెంచరీ సాధించిన వారిలో రికీ పాంటింగ్, హషీమ్ ఆమ్లా, గ్రేమీ స్మిత్, ఇంజమామ్ ఉల్ హక్ తదితరులు ఉన్నారు. అంతేగాక వరుసగా 98,99,100వ టెస్టులో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో వరుస సెంచరీలు(228, 186 పరుగులు)తో ఊపుమీద కనిపించిన రూట్ అదే ఫామ్‌ను టీమిండియాపై కొనసాగించాడు. 164 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రూట్ తన శైలికి కాస్త భిన్నంగా ఆడడం విశేషం.తొలి ఆఫ్ సెంచరీ సాధించడానికి 114 బంతులు తీసుకున్న రూట్ .. ఆ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 50 బంతుల్లోనే చేయడం విశేషం. వన్‌డౌన్‌లో వచ్చిన డానియెల్ లారెన్స్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన రూట్ మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లితో కలిసి క్రీజులో పాతుకుపోయాడు. ఓపెనర్ సిబ్లితో కలిసి ఇప్పటికే 160 పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదు చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా పరిగెడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 81 ఓవర్లలో 241 పరుగులు చేసింది. జో రూట్ 109, సిబ్లి 85 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: India Vs England 2021: జో రూట్ సెంచరీ టీమిండియాకు జో రూట్ వార్నింగ్ -
'విచారకరం.. నా ఇన్నింగ్స్ వారికే అంకితం'
ముంబై మారణహోమం(26/11) తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తాను ఆడిన 103 పరుగుల ఇన్నింగ్స్ కెరీర్లో ఎంతో ప్రత్యేకమైనదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు చెప్పపుకొచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ను ముంబై మారణహోమ బాధితులకు అంకితం చేసినట్లు మ్యాచ్ అనంతరం ప్రకటించడం అప్పటి క్రికెట్ అభిమానుల్లో ఎంతో సంతోషం నింపింది. ఆరోజు సచిన్ చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. సచిన్ వ్యాఖ్యలకు నేటితో(డిసెంబర్ 15) సరిగ్గా 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మరోసారి ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. (చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా) ఇంగ్లండ్‌పై విజయం అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడాడు. 'ముంబై మారణహోమం (26/11 దాడులు) నన్ను చాలా కలచివేసింది.. ఆ దృశ్యం తలచుకుంటేనే నా హృదయం కన్నీళ్లతో బరువెక్కుతుంది.. ఎంతో మంది అమాయకప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను చూస్తే నా రక్తం మరిగిపోయేది. వారిని అంతమొందించిన ఎన్ఎస్జీ కమాండోలకు నా శతకోటి వందనాలు.. ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీని ఆ మారణహోమంలో అమరులైన వారికి అంకితం చేస్తున్నా... అసలు ఆరోజు ముంబైలో ఏం జరుగుతుందో నాకు మొదట అర్థం కాలేదు. అర్థమయ్యే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందుకే ఈరోజు ఇంగ్లండ్‌పై చేసిన 100 పరుగులు.. ఆ మారణహోమం నుంచి అభిమానులు బయటపడేందుకు సహాయపడుతుందనే అనుకుంటున్నా.మారణహోమం తర్వాత ఉగ్రవాదులతో పోరాడిన కమాండోలకు, అక్కడి ప్రజలకు, పోలీసులకు సెల్యూట్ తప్ప ఇంకేం చేయలేను. ఆ దహనకాండ తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ సెంచరీ చేయడం.. అమరులకు అంకింతం చేయడం జీవితంలో మరిచిపోలేనిదంటూ' ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ముంబై మారణహోమానికి ముందే ఇంగ్లండ్ జట్టు భారత్‌లో 5 వన్డేలు, రెండు టెస్టులు ఆడడానికి వచ్చింది. మూడో వన్డే సమయంలోనే 26/11 దాడులు జరగడంతో తదుపరి రెండు వన్డేలను రద్దు చేశారు. అనంతరం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను నిర్వహించారు. సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మొదటి టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆండ్రూ స్ట్రాస్ సెంచరీతో 316 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు 75 పరుగుల ఆధిక్యం వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో స్ట్రాస్ మరోసారి సెంచరీతో మెరవడంతో భారత్‌కు 387 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. సచిన్ 103 పరుగుల వీరోచిత సెంచరీతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. స్మిత్ అనుమానమే!) -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
సిడ్నీ: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. ఫోర్‌తో శతకం పూర్తి చేశాడు. 137 బంతుల్లో 8 ఫోర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికి రెండో సెంచరీ. పంత్ చేసిన రెండు శతకాలు కూడా ఆయా సిరీస్‌ల్లో చివరి టెస్టులే కావడం విశేషం. 2018, సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ తొలి సెంచరీ(114) చేశాడు. కంగారూ గడ్డమీద శతకం బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. తాజా శతకంతో ఆసియా బయట రెండు సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ కూడా అతడు ఖ్యాతి దక్కించుకున్నాడు. -
కెవిన్ ఓబ్రైన్ అజేయ శతకం
డబ్లిన్: అరంగేట్రం టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమై ఫాలో ఆన్‌ను ఎదుర్కొన్న ఐర్లాండ్... ఆల్‌రౌండర్ కెవిన్ ఓబ్రైన్ (118 బ్యాటింగ్) అజేయ శతకంతో రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న టెస్టులో సోమవారం మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 139 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫాలో ఆన్‌లో ఓపెనర్లు జాయ్స్ (43), కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్ (32)లు 69 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్నిచ్చారు. కానీ, మిడిలార్డర్లో బాల్బిర్నీ (0), నీల్ ఓబ్రైన్ (18), స్టిర్లింగ్ (11) విఫలం కావడంతో 127/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెవిన్... థాంప్సన్ (53)తో ఏడో వికెట్‌కు 114 పరుగులు, టైరన్ (8 బ్యాటింగ్)తో 8వ వికెట్‌కు అభేద్యంగా 48 పరుగులు జోడించి గట్టెక్కించాడు. ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి. -
విలియమ్సన్ రికార్డు
ఆక్లాండ్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన కివీస్ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న డే–నైట్ టెస్టులో అతడు ఈ రికార్డు లిఖించాడు. టెస్టు కెరీర్లో 18వ శతకం నమోదు చేశాడు. 220 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు చేసి అవుటయ్యాడు. తాజా శతకంతో మార్టిన్ క్రోవ్, రాస్ టేలర్‌ను విలియమ్సన్ అధిగమించాడు. వీరిద్దరూ 17 టెస్టు సెంచరీలు చేశారు. క్రోవ్, టేలర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లోనే అతడు ఈ ఘనత సాధించడం విశేషం. 114 ఇన్నింగ్స్‌లోనే 18వ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. క్రోవ్ 120 ఇన్నింగ్స్‌లో 17 సెంచరీలు చేయగా, టేలర్ 149 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 64వ టెస్ట్ ఆడుతున్న విలియమ్సన్ ఇప్పటివరకు 114 ఇన్నింగ్స్ ఆడి 5316 పరుగులు సాధించాడు. ఇందులో 18 సెంచరీలు, 26 అర్ధసెంచరీలు ఉన్నాయి. 28 ఏళ్ల విలియమ్సన్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
ఆ అరుదైన రికార్డుకు ఏడేళ్లు..!
సాక్షి, స్పోర్ట్స్: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు రికార్డుల రారాజు, క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. సెంచరీలకు మారు పేరైన సచిన్.. ఎవరికి సాధ్యంకాని తన 50వ టెస్టు సెంచరీని 2010 డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాపై సాధించాడు. దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సచిన్ (111) శతకం బాది టెస్టుల్లో 50 సెంచరీలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఈ ఘనత నమోదై ఏడేళ్లైనప్పటికి.. ఎవరు ఈ రికార్డును అధిగమించలేకపోవడం విశేషం. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌ను భారత్ ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక రెండో టెస్టులో 87 పరుగులతో భారత్ గెలవడంతో సిరీస్ సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్ అయిన మూడో టెస్టులో సచిన్ మరో సెంచరీ (146) రాణించడంతో మ్యాచ్ డ్రా అయి భారత్ సిరీస్‌ను కాపాడుకోగలిగింది. అన్ని ఫార్మట్లలో కలిపి సచిన్ 34,357 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 200 టెస్టుల్లో 15,921 పరుగులు.. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేసిన సచిన్..ఏకైక టీ20 ఆడి 10 పరుగులు చేశాడు. వన్డే చరిత్రలో తొలి డబుల్ సెంచరీ, అన్నిఫార్మట్లలో 100 శతకాల వంటి చెరగని రికార్డులు మాస్టర్ పేరిట ఉన్నాయి. సచిన్ తన చివరి మ్యాచ్‌ను 2013లో వెస్టిండీస్‌పై ఆడాడు. -
డివిలియర్స్ ‘వంద’నం
సెంచరీ టెస్టు ఆడనున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ బెంగళూరు: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ అబ్రహాం డివిలియర్స్ కెరీర్లో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. శనివారంనుంచి భారత్‌తో జరిగే రెండో టెస్టు మ్యాచ్ అతనికి 100వది కానుంది. దక్షిణాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించనున్న ఏడో ఆటగాడు అతను. ప్రధానంగా పరిమిత ఓవర్లలో విధ్వంసక ఆటగాడిగా గుర్తింపు ఉన్నా... టెస్టు క్రికెట్లోనూ డివిలియర్స్ ఖాతాలో అనేక గొప్ప ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. కెరీర్ తొలి టెస్టునుంచి వరుసగా 98 మ్యాచ్‌లు ఆడిన ఏబీ, విరామం లేకుండా వంద మ్యాచ్‌లు ఆడిన రికార్డు సృష్టించేవాడు. అయితే ఇటీవల వ్యక్తిగత కారణాలతో బంగ్లాదేశ్ సిరీస్‌కు దూరం కావడంతో అతనికి ఈ ఘనత దక్కలేదు. టెస్టుల్లో నంబర్‌వన్ బ్యాట్స్‌మన్‌గా వందవ మ్యాచ్ ఆడుతున్న ఏడో ఆటగాడు డివిలియర్స్ కావడం విశేషం. డివిలియర్స్ 99 టెస్టుల్లో 51.92 సగటుతో 7685 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. 278నాటౌట్ (పాకిస్తాన్) డివిలియర్స్ అత్యధిక స్కోరు. ఏ పిచ్‌కైనా సిద్ధం: ఏబీ సొంతగడ్డపై భారత్ ఎలాంటి పిచ్‌లు తయారు చేసుకున్నా అది తప్పు కాదని, తమ జట్టు అన్నింటికీ సిద్ధమై వచ్చిందని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. ‘చిన్నస్వామి పిచ్ టర్న్ అవుతుందని మాకు బాగా తెలుసు. వాండరర్స్ వికెట్లా ఎలాగూ ఉండదు. సొంత జట్టు ఎలా తయారు చేసుకున్నా ఎదురుదాడి చేయగల బ్యాట్స్‌మెన్ మా వద్ద ఉన్నారు. తొలి టెస్టులో కూడా మేం బాగానే ఆడినా ఎక్కువ సేపు దానిని కొనసాగించలేకపోయాం. ఈ మ్యాచ్‌లో పరిస్థితి మారుతుందని నమ్ముతున్నా. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌గా ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాల్సిన బాధ్యత నాపై కూడా ఉంది’ అని డివిలియర్స్ అన్నాడు. ఫిలాండర్ అవుట్ తొలి టెస్టుకు ముందే మోర్కెల్‌కు గాయం...టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టెయిన్ బౌలింగ్‌కు దూరం...ఈ దెబ్బలతో ఇప్పటికే బలహీనపడిన దక్షిణాఫ్రికా పేస్ బలగానికి కొత్త సమస్య ఎదురైంది. మూడో ప్రధాన పేసర్ వెర్నాన్ ఫిలాండర్ సరదాగా ఆడిన ఫుట్‌బాల్ అతడిని టెస్టు సిరీస్‌కు దూరం చేసింది. ఎడమ కాలి మడమకు గాయమైన ఫిలాండర్ స్వదేశం తిరిగి పయనమవుతున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా సఫారీ ఆటగాళ్లంతా ఫుట్‌బాల్ ఆడారు. సహచరుడు ఎల్గర్‌ను ఢీకొనడంతో ఫిలాండర్ పడిపోయాడు. అతడిని సహాయక సిబ్బంది మోసుకుపోవాల్సి వచ్చింది. ఎంఆర్ఐ స్కాన్‌లో గాయం నిర్ధారణ కావడంతో అతడికి కనీసం ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తేల్చారు. అతని స్థానంలో దక్షిణాఫ్రికా కైల్ అబాట్‌ను ఎంపిక చేసింది. అబాట్ చివరిసారిగా గత ఏడాది డిసెంబర్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. స్టెయిన్ కోలుకుంటాడా! పిచ్ ఏదైనా తమ పేస్‌ను నమ్ముకొన్న దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పుడు రబడ ఒక్కడే పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. తొలి మ్యాచ్ ఆడని మోర్కెల్ కోలుకుం టున్నాడు. అయితే మొహాలీ టెస్టులో గాయపడిన స్టెయిన్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు శుక్రవారం ఫిట్నెస్ టెస్ట్ తర్వాతే అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు కోల్పోయిన దక్షిణాఫ్రికాకు మరో ప్రధాన ఆటగాడు డుమిని కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. -
స్టీవెన్ స్మిత్ సెంచరీ
జమైకా: వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్ సెంచరీ సాధించాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్ స్మిత్ అజేయ సెంచరీతో కోలుకుంది. క్లార్క్ తో కలిసి మూడో వికెట్ కు 118 జోడించాడు. స్మిత్ 278 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. మైఖేల్ క్లార్క్ 47, వోగ్స్ 37, మార్ష్ 11 పరుగులు చేశారు. ఓపెనర్ వార్నర్ డకౌట్ అయ్యాడు. స్మిత్(135), వాట్సన్(20) క్రీజ్ లో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లు పడగొట్టాడు. హోల్డర్ ఒక వికెట్ పడగొట్టాడు.


