కెవిన్‌ ఓబ్రైన్‌ అజేయ శతకం   | O Brien makes history with Ireland's first Test century | Sakshi
Sakshi News home page

కెవిన్‌ ఓబ్రైన్‌ అజేయ శతకం  

May 15 2018 2:02 AM | Updated on Jul 25 2018 1:51 PM

O Brien makes history with Ireland's first Test century - Sakshi

డబ్లిన్‌: అరంగేట్రం టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమై ఫాలో ఆన్‌ను ఎదుర్కొన్న ఐర్లాండ్‌... ఆల్‌రౌండర్‌ కెవిన్‌ ఓబ్రైన్‌ (118 బ్యాటింగ్‌) అజేయ శతకంతో రెండో ఇన్నింగ్స్‌లో పోరాడుతోంది. పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న టెస్టులో సోమవారం మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 139 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఫాలో ఆన్‌లో ఓపెనర్లు జాయ్స్‌ (43), కెప్టెన్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (32)లు 69 పరుగులు జోడించి చక్కని ఆరంభాన్నిచ్చారు.

కానీ, మిడిలార్డర్‌లో బాల్‌బిర్నీ (0), నీల్‌ ఓబ్రైన్‌ (18), స్టిర్లింగ్‌ (11) విఫలం కావడంతో 127/5తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెవిన్‌... థాంప్సన్‌ (53)తో ఏడో వికెట్‌కు 114 పరుగులు, టైరన్‌ (8 బ్యాటింగ్‌)తో 8వ వికెట్‌కు అభేద్యంగా 48 పరుగులు జోడించి గట్టెక్కించాడు. ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి.  

Advertisement
 
Advertisement
Advertisement