PC: X/ICC
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో వకార్ యూనిస్ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 1989లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. పాక్ తరఫున 87 టెస్టులు, 262 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 373 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. వన్డేల్లో ఏకంగా 416 వికెట్లు పడగొట్టాడు.
ఇక 54 ఏళ్ల వకార్ యూనిస్ తాజాగా శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా భారత్- పాక్ క్రికెటర్లతో కూడిన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలని మిశ్రా.. వకార్ యూనిస్‌కు సూచించాడు. ఈ సందర్భంగా ఆప్షన్లు కూడా ఇచ్చాడు. ఈ క్రమంలో వకార్ యూనిస్ తన తుదిజట్టులో ఒకే ఒక్క పాక్ క్రికెటర్‌కు చోటు ఇవ్వడం విశేషం.
ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సాగిందిలా!
మిశ్రా: సచిన్ టెండుల్కర్ లేదా ఇంజమామ్ ఉల్ హక్?
వకార్ యూనిస్: సచిన్ టెండుల్కర్
విరాట్ కోహ్లి లేదా బాబర్ ఆజం?
విరాట్ కోహ్లి
షాహిన్ ఆఫ్రిది లేదా జస్‌ప్రీత్ బుమ్రా?
జస్‌ప్రీత్ బుమ్రా
రాహుల్ ద్రవిడ్ లేదా యూనిస్ ఖాన్?
రాహుల్ ద్రవిడ్
ఎంఎస్ ధోని లేదా జావేద్ మియాందాద్?
ఎంఎస్ ధోని
రోహిత్ శర్మ లేదా ఫఖర్ జమాన్?
రోహిత్ శర్మ
వీవీఎస్ లక్ష్మణ్ లేదా మిస్బా ఉల్ హక్?
వీవీఎస్ లక్ష్మణ్
మహ్మద్ షమీ లేదా మహ్మద్ ఆమిర్?
మహ్మద్ షమీ
వీరేందర్ సెహ్వాగ్ లేదా షాహిద్ అన్వర్?
షాహిద్ అన్వర్.
ఇక ఈ పాడ్‌కాస్ట్ సందర్భంగా వకార్ యూనిస్‌కు.. టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. పాక్ 20 ఏళ్ల సంచలనం సమీర్ మిన్హాస్, వైభవ్‌లలో ఒకరిని ఎంచుకోవాలని మిశ్రా కోరగా.. తాను వీరిద్దరిలో ఎవరి మ్యాచ్‌లను ఎక్కువగా చూడలేదని వకార్ యూనిస్ సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేనన్నాడు.
ఇవీ చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్!.. వన్డే సిరీస్ నుంచి కీలక ఆటగాడు అవుట్!


