శుబ్‌మన్‌ గిల్‌ కణతపై ‘టెంపుల్‌’.. టీ20 జట్టుతో ప్రాక్టీస్‌! | Shubman Gill Grabs Attention With Temple Brain Fitness Device In New Zealand, Here’s How It Tracks Focus And Stress, Read Story Inside | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌ కణతపై ‘టెంపుల్‌’.. టీ20 జట్టుతో ప్రాక్టీస్‌!

Oct 29 2026 11:57 AM | Updated on Oct 29 2026 12:49 PM

Shubman Gill Tests Temple Device Joins India T20 Team Auckland Nets

టీమిండియా వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ న్యూజిలాండ్‌లో అడుగుపెట్టాడు. ఆక్లాండ్‌లో టీ20 జట్టుతో చేరిన గిల్‌.. సహచర ఆటగాళ్లతో కలిసి గురువారం ప్రాక్టీస్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా ప్రిన్స్‌ తన కణతపై ధరించిన ‘పరికరం’ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ డివైస్‌ పేరు టెంపుల్‌ ('Temple' Device).

‘టెంపుల్‌’ వల్ల ఉపయోగం ఏమిటి?
జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ బృందం ఈ డివైస్‌ను రూపొందించింది. అయితే, ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. మార్కెట్లోకి దీనిని విడుదల చేయలేదు.

అయితే, భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌, పాడ్‌కాస్టర్‌ రాజ్‌ షమాని ఇప్పటికే దీనిని ధరించారు. తాజాగా శుబ్‌మన్‌ గిల్‌ సైతం ‘టెంపుల్‌’తో తన మెట్రిక్స్‌ కొలుచుకునేందుకు సిద్ధం కావడం విశేషం.

PC: X
ఈ డివైస్‌ మెదడులో రక్త ప్రవాహం, ఆక్సిజన్‌ స్థాయిలను రియల్‌ టైమ్‌లో కొలుస్తుందని తెలుస్తోంది. అంతేకాదు.. దీనిని ఓ వ్యక్తి ధరించినపుడు.. సదరు వ్యక్తి ఏమేరకు మానసిక ఒత్తిడికి గురువుతున్నారు?, వారి ఏకాగ్రత, మెదడు పనితీరును అంచనా వేయొచ్చని సమాచారం.

ఇంచు పొడవు
టెంపుల్‌ డివైస్‌.. నియర్‌ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోస్కోపి టెక్నాలజీతో మెదడులో ఆక్సిజన్‌ స్థాయిని కొలుస్తుందని జాతీయ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది కేవలం ఇంచు పొడవు మాత్రమే ఉంటుంది. కాబట్టి తేలికగానే దీనిని వాడుకోవచ్చు. సుమారు మూడు- నాలుగు గంటల పాటు దీనిని ధరించవచ్చు.

ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లా
మొత్తానికి ఇదొక బ్రెయిన్‌ ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందట. ప్లేయర్లు మ్యాచ్‌ ఆడే సమయంలో లేదా ప్రాక్టీస్‌ చేస్తున్నపుడు.. వారి ఏకాగ్రత ఏ స్థాయిలో ఉంది? మానసిక ఒత్తిడి, అలసట, రికవరీ తదితర అంశాలకు సంబంధించిన డేటాను టెంపుల్‌ విశ్లేషిస్తుందట.

టీ20 జట్టుతో గిల్‌, కేఎల్‌ రాహుల్‌  ప్రాక్టీస్‌
కాగా గిల్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా ఆక్లాండ్‌లో టీ20 జట్టుతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను రెవ్‌స్పోర్ట్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. గిల్‌ ‘టెంపుల్‌’ ధరించిన విషయం బయటకు వచ్చింది.

ఇక న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని భారత జట్టు 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య శుక్రవారం నాటి నాలుగో టీ20కి ఆక్లాండ్‌ వేదిక. మరోవైపు.. నవంబరు 1న టీ20 సిరీస్‌ ముగియనుండగా.. నవంబర్‌ 4 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభమవుతుంది.

ఇవీ చదవండి: మీ బాబాయి అందరికీ గొప్పగా చెప్పుకొంటాడు: సచిన్‌ టెండుల్కర్‌ భావోద్వేగం
IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌!.. వన్డే సిరీస్‌ నుంచి కీలక ఆటగాడు అవుట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement