కివీస్‌తో వన్డేలు.. టీమిండియాకు భారీ షాక్‌!.. కీలక ఆటగాడు అవుట్‌! | IND Vs NZ ODIs, India Suffer Major Blow Ahead Of New Zealand ODI Series As Prasidh Krishna Ruled Out For This Reason | Sakshi
Sakshi News home page

IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌!.. వన్డే సిరీస్‌ నుంచి కీలక ఆటగాడు అవుట్‌!

Oct 29 2026 8:47 AM | Updated on Oct 29 2026 10:48 AM

IND vs NZ ODIs: Big Blow Prasidh Krishna Ruled Out Nabi set to replace

PC: BCCI X

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పేస్‌ విభాగంలో కీలకమైన ప్రసిద్‌ కృష్ణ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఫలితంగా కివీస్‌తో వన్డే సిరీస్‌కు అతడు దూరమయ్యాడు.

టీ20 సిరీస్‌ సొంతం
కాగా న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా ప్రస్తుతం శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని భారత టీ20 జట్టు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హ్యాట్రిక్‌ విజయాలతో సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకున్న భారత్‌.. అక్టోబరు 30న నాలుగో టీ20, నవంబరు 1న ఐదో టీ20 ఆడుతుంది.

వన్డేలకు రెండు జట్లు
అనంతరం నవంబరు 4 నుంచి కివీస్‌- భారత్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో మూడు వన్డేలకు.. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలో రెండు వన్డేలకు వేర్వేరు జట్లను ప్రకటించింది.

స్టార్‌ పేసర్‌ అవుట్‌
ఇక స్వదేశంలో ఇటీవల వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా గాయపడిన ప్రసిధ్‌ కృష్ణను కూడా తొలి మూడు వన్డేలు ఆడే జట్టుకు ఎంపిక చేశారు. అయితే సిరీస్‌కు ముందు అతడు పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేకపోయాడు. 

దీంతో టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిని వన్డే సిరీస్‌ నుంచి తప్పించారు. దీంతో అతడి స్థానంలో జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీకి జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌లోనే ఉన్న ఆకిబ్‌... ఇటీవల న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు.  

న్యూజిలాండ్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ* (ఫిట్‌నెస్‌ ఆధారంగా), కుల్దీప్ యాదవ్.

నాలుగు, ఐదు వన్డేలకు భారత జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీశ్‌ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యశ్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్. 

ఇదీ చదవండి: అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement