source: X
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ వన్డేల్లో అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో కేవలం 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఆమె.. భారత తరఫున వన్డేల్లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రిచా ఘోష్‌తో కలిసి రెండో స్థానాన్ని పంచుకుంది. ఈ జాబితాలో స్మృతి మంధన (23 బంతుల్లో) అగ్రస్థానంలో ఉంది.
మహిళల వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీలు:
- 23 బంతులు: స్మృతి మంధన vs ఆస్ట్రేలియా, 2025
- 26 బంతులు: రిచా ఘోష్ vs న్యూజిలాండ్, 2022
- 26 బంతులు: షఫాలీ వర్మ vs జింబాబ్వే, 2026
- 29 బంతులు: షఫాలీ వర్మ vs జింబాబ్వే, వడోదర
భారత్ ఘన విజయం
వడోదర వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు స్వదేశంలోనే జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా భారత్ 3-0తో ఊడ్చేసింది.
మూడో వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి 131 పరుగులకే ఆలౌటైంది. వైష్ణవి శర్మ 5 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 17 ఓవర్లలోపే ఛేదించింది. షఫాలీ వర్మ (51 నాటౌట్)తో పాటు ప్రతీకా రావత్ (59 నాటౌట్) అర్ద సెంచరీ సాధించి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఇదీ చదవండి: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్


