Photo Credit: BCCI Twitter
జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 121 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సెంచరీలతో చెలరేగారు. బౌలింగ్‌లో వైష్ణవి శర్మ (4 వికెట్లు), దీప్తి శర్మ (3 వికెట్లు) రాణించి జింబాబ్వే పతనాన్ని శాసించారు.
ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేయడంతో బౌలింగ్‌లో 150 ప్లస్ వికెట్లు తీసిన మూడో క్రికెటర్‌గా, తొలి భారత మహిళా క్రికెటర్‌గా దీప్తి శర్మ రికార్డులకెక్కింది.
👉దీప్తి శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 168 వికెట్లు తీయడంతో పాటు రెండు సెంచరీలు సాధించింది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (49 సెంచరీలు, 154 వికెట్లు) అందనంత ఎత్తులో కొనసాగుతుండగా, మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ (రెండు సెంచరీలు, 157 వికెట్లు) రెండో స్థానంలో ఉండగా, దీప్తి శర్మ మూడో స్థానంలో కొనసాగుతుంది.
👉ఇక వన్డేల్లో దీప్తి శర్మకు ఇది రెండో వన్డే సెంచరీ. కాగా 2017, మే 15న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో దీప్తి శర్మ 160 బంతుల్లో 188 పరుగులు చేసి వన్డేల్లో తొలి సెంచరీ సాధించింది. తాజాగా తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దీప్తి వన్డేల్లో రెండో శతకాన్ని అందుకుంది.
👉మహిళల వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఆరు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. 86 బంతుల్లో 106 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మెరిసిన దీప్తి శర్మ.. రిచా ఘోష్ (94 పరుగులు వర్సెస్ సౌతాఫ్రికా) రికార్డును బద్దలుకొట్టింది.
👉83 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న దీప్తి శర్మ భారత మహిళా క్రికెటర్లలో వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. స్మృతి మంధాన (50 బంతుల్లో వర్సెస్ ఆస్ట్రేలియా 2025; 70 బంతుల్లో వర్సెస్ ఐర్లాండ్, 2025; 77 బంతుల్లో వర్సెస్ ఆస్ట్రేలియా, 2025) మూడుసార్లు ఈ ఫీట్ సాధించగా, హర్మన్‌ప్రీత్ కౌర్ (82 బంతుల్లో వర్సెస్ ఇంగ్లండ్, 2025) రెండో స్థానంలో ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు), దీప్తీ శర్మ(86 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు) అద్భుత సెంచరీలతో చెలరేగారు. జింబాబ్వే బౌలర్లలో నోమ్వెలో సిబాన్డా 2 వికెట్లు తీసింది.
అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి జట్టును దెబ్బతీసింది.జింబాబ్వే బ్యాటర్లలో మోడెస్టర్ ముపాచిక్వా(49),చిపో ముగేరి-తిరిపానో(46) టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.
Worth every bit of the 9-year wait ⏳💯 📸 Frames from @Deepti_Sharma06's spectacular 2️⃣nd ODI HUNDRED 👏 Relive her knock ▶️ https://t.co/qBYI8VitCB #TeamIndia | #INDvZIM | @mflone_ https://t.co/KEu9f1WICq
— BCCI Women (@BCCIWomen) October 25, 2026
Scenes to savour ✨ 🎥 The moment Deepti Sharma brought up a truly magnificent HUNDRED 👏 Scorecard ▶️ https://t.co/ECnfLgdfi7 #TeamIndia | #INDvZIM | @mflone_ | @Deepti_Sharma06 https://t.co/AX48zKjWXe
— BCCI Women (@BCCIWomen) October 25, 2026
ఇదీ చదవండి:


