వన్డే ట్రై-సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. 242 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. టాపార్డర్, మిడిలార్డర్ విఫలం కావడంతో 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
ఈ సమయంలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ అద్భుత సెంచరీతో జట్టును గెలిపించాడు. అతడికి పదకొండో నంబర్ ఆటగాడు హారీస్ రవూఫ్ తన వికెట్‌ను కాపాడుకుంటూ సపోర్ట్‌గా నిలిచాడు. వీరిద్దరూ పదో వికెట్‌కు అజేయంగా 89 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
రవూఫ్ ఓవరాక్షన్.. ఏమి జరిగిందంటే?
అయితే మ్యాచ్ ఆఖరిలో ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్, హారీస్ రవూఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 46వ ఓవర్ చివరి బంతిని షాదాబ్ ఖాన్‌కు సామ్ కుర్రాన్ బౌన్సర్‌గా సంధించాడు. బంతి అతడి తలపై నుంచి వెళ్లింది. దీంతో షాదాబ్ వైడ్ కోసం స్క్వేర్-లెగ్ అంపైర్‌కు అప్పీల్ చేశాడు.
కానీ అతడు వైడ్ ప్రకటించలేదు. జాక్స్ కూడా నాట్ వైడ్ అంటూ అన్నాడు. ఈ క్రమంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హారిస్, అతడికి సమీపంలో జాక్స్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఈ పాక్ పేసర్ తన బ్యాట్‌ను జాక్స్ వైపు చూపిస్తూ, దూకుడుగా అతడి వైపు వెళ్లాడు. వెంటనే అంపైర్‌లు, జో రూట్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: NZ vs IND: గంభీర్ కీలక నిర్ణయం.. సంజూకు డిమోషన్! వైభవ్‌కు ప్రమోషన్?
Sam Curran bowls a BOUNCER! Shadab Khan wants a WIDE as Umpire says NO! @TheRealPCB Haris Rauf has a verbal FIGHT with @englandcricket Will Jacks as Joe Root is the peacemaker😂 Drama in #PakistanCricket #PAKvENG https://t.co/lajM8FGfdf
— Chacha Abdul Shakoor (@ChachaAbdulSh10) October 25, 2026


