PC: X
వెల్టింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. తొలి రెండో టీ20ల్లో అద్భుత విజయాలను అందుకున్న భారత్.. ఇప్పుడు మూడో టీ20లోనే అదే జోరును కనబరిచి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు కూడా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా దూరమయ్యాడు. తొలి టీ20లో గజ్జల్లో గాయానికి గురైన కిషన్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలోనే మూడో టీ20కి అతడు అందుబాటులో లేడు. కిషన్ స్ధానంలో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో వైభవ్ విఫలమైనప్పటికి మరో అవకాశమివ్వాలని హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు సమాచారం.
మళ్లీ ఓపెనర్‌గా వైభవ్!
అయితే రెండో టీ20లో వైభవ్ ఆడినప్పటికి ఓపెనర్‌గా ఛాన్స్ లభించలేదు. మూడో స్ధానంలో అతడిని బ్యాటింగ్‌కు పంపారు. అయితే నంబర్-3లో వచ్చిన వైభవ్ (8 బంతుల్లో 4 పరుగులు) తక్కువ స్కోరుకే వెనుదిరగాడు. ఈ క్రమంలో మురళీ కార్తీక్ వంటి మాజీ క్రికెటర్లు గంభీర్ వ్యూహాన్ని విమర్శించారు.
వైభవ్‌ను అతని ఓపెనర్ స్థానంలోనే ఆడించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీంతో గంభీర్ తన మనసును మార్చుకున్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్ టీ20లో వైభవ్‌ను మళ్లీ ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే జరిగితే సంజూ నంబర్-3 స్ధానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. కాగా రెండో టీ20లో ఆడిన జట్టునే భారత్ కొనసాగించే అవకాశముంది.
మూడో టీ20కు భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్
చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ ప్లేయర్ల ప్రపంచ రికార్డు


