PC: X
సొంతగడ్డపై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం లహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలువ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో పాక్ సంచలన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
ఈ సమయంలో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(96 బంతుల్లో 113) వీరోచిత సెంచరీతో జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూప్‌తో కలిసి 10వ వికెట్‌కు కేవలం 80 బంతుల్లో 89 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. దీంతో షాదాబ్-రవూఫ్ జోడీ ఓ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.
55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య చేధనలో 10వ వికెట్‌కు నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం జోడీగా వారిద్దరూ నిలిచారు. ఇంతకముందు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ప్లేయర్ డెరిక్ ముర్రే, ఆండీ రాబర్ట్స్ పేరిట ఉండేది. 1975లో జరిగిన తొలి ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో వారిద్దరూ పదో వికెట్‌కు 64 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో వారి ఆల్‌టైమ్ రికార్డును షాదాబ్-రవూఫ్ జంట బ్రేక్ చేసింది.
అదేవిధంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన షాదాబ్ ఖాన్ సైతం ఓ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకున్నాడు. ఎనిమిది లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా షాదాబ్ ఖాన్ నిలిచాడు. గతంలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ (100 నాటౌట్ వర్సెస్ సౌతాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును షాదాబ్ తిరగరాశాడు.
చదవండి: మూడో టీ20కి ఇషాన్ దూరం.. బీసీసీఐ అధికారిక ప్రకటన


