source: X
పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రౌఫ్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టాడు. ఖైద్-ఎ-ఆజం ట్రోఫీలో తన తొలి మ్యాచ్ ఆడిన అతడు.. మొదటి ఇన్నింగ్స్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌లో రౌఫ్‌కు ఇదే తొలి హ్యాట్రిక్. ఈ టోర్నీలో ఇస్లామాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రౌఫ్.. కరాచీ బ్లూస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు.
రౌఫ్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో కరాచీ బ్లూస్ పాక్షికంగా కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో ఒమైర్ బిన్ యూసుఫ్, రజా చాండియో సెంచరీలతో కదంతొక్కి కరాచీని ఆదుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కరాచీ బ్లూస్ 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది.
టెస్టు జట్టులోకి తిరిగి వచ్చేనా..?
రెడ్ బాల్ క్రికెట్‌లో హారిస్ రౌఫ్ నిలకడగా రాణిస్తుండటం పాక్ టెస్టు జట్టులో అతడి పునరాగమనంపై చర్చకు దారితీస్తోంది. 2022లో ఇంగ్లండ్ టెస్ట్ అరంగేట్రం చేసిన రౌఫ్‌కు అదే మొదటి చివరి మ్యాచ్. రౌఫ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణిస్తున్నా, ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లి ఒక్కడే..!


