రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్ | Two arrested in railway track explosion case 2 With Pakistan Links | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్ పేలుడు కేసులో ఇద్దరి అరెస్ట్

Nov 15 2026 2:55 PM | Updated on Nov 15 2026 3:06 PM

Two arrested in railway track explosion case 2 With Pakistan Links

చండీగఢ్‌: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ పేలుడు కేసులో పంజాబ్‌కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను 21 ఏళ్ల మహక్‌దీప్‌ కౌర్‌, 22 ఏళ్ల దవీందర్‌ సింగ్‌గా గుర్తించారు. రాజస్థాన్‌ ఏటీఎస్‌, శ్రీగంగానగర్‌ పోలీసులు, పంజాబ్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసుల విచారణలో మహక్‌దీప్‌ కౌర్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది. 'చాచా', 'షా' అనే పేర్లతో పరిచయమైన ఆ ఇద్దరూ ప్రేమ పేరుతో దగ్గరై, మహక్‌దీప్‌కు డబ్బు ఆశ చూపి ఆమెను తమ ఉచ్చులోకి లాగినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు రైల్వే ట్రాక్‌పై పేలుడు జరిపేందుకు ఆమెకు డబ్బులు చెల్లించినట్లు కూడా విచారణలో తేలింది.

కాగా.. నిందితుల నుంచి రెండు తుపాకులు, 46 తూటాలు, రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులకు వసతి, బైక్‌, రవాణా సదుపాయాలు కల్పించినట్లు ఆ ముగ్గురిపై అనుమానాలున్నాయి.

నవంబర్‌ 3న రాత్రి 9.45 గంటల సమయంలో రామ్‌సింగ్‌పూర్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రెండు రైల్వే స్లీపర్లు ధ్వంసమవగా, పట్టాలు దెబ్బతిన్నాయి. సుమారు 2.5 అడుగుల లోతులో గుంత ఏర్పడింది. పేలుడుకు 75 నిమిషాల ముందే అదే మార్గంలో అనూప్‌గఢ్‌-సూరత్‌గఢ్‌ ప్యాసింజర్‌ రైలు వెళ్లడం గమనార్హం.

ఇదీ చదవండి: ట్రంప్‌–ఎన్విడియా మాజీ సీఈఓ బంధంపై కాంగ్రెస్‌ ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement