బెంగళూరు: బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించిన భార్య, 7 మంది ఆమె కుటుంబీకుల హత్యకేసులో నిందితుడు, క్యాబ్‌డ్రైవరు ఇందుశేఖర్ ప్రతీకారంతో పాటు ఆస్తికోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. శ్రీరామపురలో భార్య కుటుంబానికి ఉండే కోట్లాది రూపాయల ఆస్తిని కాజేయడానికి కిల్లర్ ఇందుశేఖర్ హత్యకు ముండే స్టాంప్ పేపర్లు సిద్ధం చేసుకున్నట్లు వెల్లడైంది. ఒక్కొక్కరిని హత్యచేసిన తరువాత వారి వేలిగుర్తులు వేయించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆస్తిపై ఆశకు తోడు భార్య హీనంగా చూస్తూ దూషించేదని రక్తపాతానికి దిగాడు.
ఇప్పుడు హాయిగా ఉంది
ఎలాంటి పశ్చాత్తాపంలేదని, ఇప్పుడు సమాధానకరంగా ఉందని ఆ కిరాతకుడు పోలీసుల విచారణలో చెప్పాడు. ఈ హత్యల్లో తండ్రికి సహాయం చేశానని కుమార్తె ఒప్పుకుంది. ఒక ఆస్తిని తనపేరుకు రాస్తానని తండ్రి నమ్మించాడని తెలిపింది. ఈ హత్యాకాండ బయటకు రాదని, ఆస్తిని దర్జాగా అనుభవించవచ్చునని ఇందుశేఖర్ అనుకున్నాడు. రాజాజినగర పోలీసుల విచారణలో అతడు రోజుకొక కొత్త విషయం చెబుతున్నాడు.


