● విష్ణువర్ధన్‌కు బాధ్యతలు
● డ్రగ్స్ దాడులు, దసరా వివాదాల
నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు!
మైసూరు: ఈ మధ్యకాలంలో తరచుగా వివాదాలతో వార్తల్లోకెక్కుతున్న మైసూరు నగర పోలీసు వ్యవస్థలో భారీ మార్పు జరిగింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పోలీస్ కమిషనర్ సీమా లాట్కర్ను సర్కారు ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆమె స్థానంలో ఎన్.విష్ణువర్ధన్‌ను నియమించింది. ఆయన 2012 బ్యాచ్ ఐపీఎస్. ఇప్పటివరకు మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. విష్ణువర్ధన్ గతంలో విరాజ్‌పేట డీఎస్పీ, ఉడుపి, ఉత్తర కన్నడ, మైసూరు జిల్లా ఎస్పీగా వ్యవహరించారు.
పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ బదిలీ


