‘మేకెదాటు’ ఇరు రాష్ట్రాలకు ఉపయుక్తం | - | Sakshi
Sakshi News home page

‘మేకెదాటు’ ఇరు రాష్ట్రాలకు ఉపయుక్తం

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

మేకెదాటు ప్రాంతంలో కావేరి ప్రవాహం

శివాజీనగర: కావేరి నదిపై నిర్మించే మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు రాజకీయం వదిలి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సీఎం డీ.కే.శివకుమార్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ అంశాలపై చర్చించడానికి అఖిల పక్ష నేతలతో వస్తామని తెలుపగా, ప్రధాని నరేంద్ర మోదీ అందుకు అనుమతించారని తెలిపారు. శనివారం విధానసౌధలో దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి వేడుకలో సీఎం పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాజకీయంలో పరస్పరం పోటీ పడతాం, అయితే అభివృద్ధిలో సహకరిస్తామని తమిళనాడుకు సూచించారు. మేకెదాటు ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు సానుకూలతను వ్యక్తం చేసింది, ప్రధానిని అఖిలపక్ష బృందంతో వచ్చి కలుస్తామంటే ఆమోదించారన్నారు. మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ద్వారా నిరభ్యంతర లేఖ కావాల్సి ఉందన్నారు. అందుకు అవసరమైన ఆధారాలను పంపుతామన్నారు. మేకెదాటు విషయంలో కర్ణాటక సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించడం లేదన్న తమిళనాడు సీఎం ప్రకటనపై స్పందిస్తూ, ఎవరైనా ఎలాంటి ఆరోపణలు చేయని, తాను రాష్ట్రానికి ఉపయోగకరమైనవాటినే చేస్తానని అన్నారు. తమిళనాడులోని కాంగ్రెస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆరోపణలు చేసినా, దేశంలో చట్టమనేది ఉంది, దాని ప్రకారంగా నడచుకొంటామని చెప్పారు.

మాకు ఆ స్వాతంత్య్రం ఉంది

తమిళనాడుకు 177 టీఎంసీల కావేరి నీటి వాటా పొందేందుకు సుప్రీంకోర్టు స్వేచ్ఛ ఇచ్చిందన్నారు, అదే విధంగా తమకు కూడా ఆనకట్ట నిర్మించే స్వాతంత్య్రం ఉందని సీఎం తెలిపారు. మేకెదాటు ప్రాజెక్టు లాభనష్టాలు ఏమిటనేది తమిళనాడుకు తెలుసు, అయినా కూడా రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని సీఎం డీకే మండిపడ్డారు. అవసరమైతే అక్కడి నుంచి ఓ బృందం ఇక్కడికి వచ్చినట్లయితే, తాను మేకెదాటు ప్రయోజనాలను వివరించి అవగాహన కల్పిస్తానని తెలిపారు.

తమిళనాడు కళ్లు తెరవాలి

సీఎం డీకే శివకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement