యువతి బ్లాక్‌మెయిల్‌.. ఎస్‌ఐ ఆత్మహత్య | Blackmail Marriage Pressure Drove Up Cop To Shocking Decision | Sakshi
Sakshi News home page

యువతి బ్లాక్‌మెయిల్‌.. ఎస్‌ఐ ఆత్మహత్య

Nov 15 2026 1:12 PM | Updated on Nov 15 2026 1:17 PM

Blackmail Marriage Pressure Drove Up Cop To Shocking Decision

ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి.. మరోవైపు బ్లాక్‌మెయిల్‌.. ఈ పరిణామాలతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ యువ పోలీసు అధికారి చివరకు తనువు చాలించాడు. విధులు నిర్వహించాల్సిన చేతులే జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో 28 ఏళ్ల ఎస్సై సందీప్‌ కుమార్‌ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

బల్లియాలోని చిత్‌బర్హాగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ (28) శనివారం రాత్రి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సమీపంలో బుల్లెట్‌ మోటార్‌ సైకిల్‌ను గుర్తించారు. ఆయన స్వస్థలం సంత్‌ కబీర్‌ నగర్‌. గత 11 నెలలుగా చిత్‌బర్హాగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

సందీప్‌ కుమార్‌కు సికందర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన ఓ యువతితో సంబంధం ఉన్నట్లు జిల్లా ఎస్పీ ఇరాజ్‌ రాజా వెల్లడించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి సందీప్‌పై ఒత్తిడి చేయడంతో పాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. ఇదే యువతి రెండేళ్ల క్రితం మరో పోలీసు అధికారిపై అత్యాచారం కేసు పెట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని.. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: స్టేజ్‌పై నుంచి మైక్‌ విసిరికొట్టిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement