సినిమా అవకాశాల పేరుతో నగ్న చిత్రాలు తీసి | Hyderabad Woman Incident | Sakshi
Sakshi News home page

సినిమా అవకాశాల పేరుతో నగ్న చిత్రాలు తీసి

Nov 15 2026 7:53 AM | Updated on Nov 15 2026 7:53 AM

Hyderabad Woman Incident

హైదరాబాద్: టీవీ సీరియళ్లలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను మోసం చేసి ఆమె ప్రైవేటు ఫోటోలతో బెదిరిస్తున్న సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. శంషాబాద్‌కు చెందిన మహిళకు బొరగడ్డ కాళిదాస్‌ అనే వ్యక్తి సీరియళ్లలో నటించే అవకాశాలు కల్పిస్తానని నమ్మించాడు. యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని నగ్న చిత్రాలు తీశాడు. వాటిని బంధువులకు పంపిస్తానని, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసా..  చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement