గిగ్ వర్కర్ల సంక్షేమం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం | Telangana Govt Issues Final Regulations For Welfare Of Gig Workers | Sakshi
Sakshi News home page

గిగ్ వర్కర్ల సంక్షేమం.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Nov 14 2026 1:02 PM | Updated on Nov 14 2026 1:08 PM

Telangana Govt Issues Final Regulations For Welfare Of Gig Workers

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు తుది నిబంధనలు జారీ చేసిన తెలంగాణ సర్కార్‌.. తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ రూల్స్ – 2026 ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్, యాప్, సర్వీస్ సెంటర్ సదుపాయాలు కల్పించనుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన 15 పని దినాల్లో జీఐడీ జారీ చేయనుంది.

గిగ్ వర్కర్లకు జీవితకాలం చెల్లుబాటు అయ్యే జీఐడీ జారీ చేయనుంది. ప్రతి లావాదేవీపై గరిష్ఠంగా 2 శాతం వరకు వెల్ఫేర్ ఫండ్ ఫీజు విధించే అవకాశం ఉంది. కార్మికుల ఆదాయం నుంచి వెల్ఫేర్ ఫండ్ ఫీజు వసూలు చేయకూడదు. ఏడు రోజుల్లోగా కార్మికులకు చెల్లింపులు చేయాలి. కార్మికులను తొలగించే ముందు ఏడు రోజుల నోటీసు ఇవ్వాలి. పని నిరాకరించినందుకు రేటింగ్ తగ్గించడం, శిక్షించడం నిషేధం. కార్మికుల భద్రత కోసం పానిక్ బటన్, ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి ఇంటర్నల్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీని నియమించనుంది.

100 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గిగ్ వర్కర్లు ఉన్న ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. మహిళా ప్రతినిధులకు కమిటీలో కనీసం రెండు స్థానాలు కల్పించనుంది. సంక్షేమ నిధి నుంచి ప్రమాద, వైద్య, ప్రసూతి, జీవిత బీమా ప్రయోజనాల కల్పనకు అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు భారీ జరిమానాలు విధించనుంది. మొదటిసారి రూ.50,000.. రెండోసారి రూ.1 లక్ష, మూడోసారి రూ.1.50 లక్షలు, నాలుగోసారి నుంచి చెల్లించాల్సిన ఫీజుకు 5 రెట్లు విధించనుంది.

ఇదీ చదవండి: గిగ్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తాం: రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement