సాక్షి, హైదరాబాద్: గిగ్ వర్కర్ల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నాను.. వారికి సపోర్ట్‌గా ఉంటాం.. వారి సమస్యలు తీరుస్తాం’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో గిగ్ వర్కర్స్ పాలసీ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం.. గిగ్ వర్కర్ల కోసం 12 హామీలతో ప్రత్యేక సంక్షేమ విధానం రూపొందించింది. అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీలో రాహుల్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.
సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గిగ్ వర్కర్లతో నేను సమావేశమయ్యాను. వారిని కష్టనష్టాలను స్వయంగా తెలుసుకున్నాను. వారికి సపోర్ట్‌గా ఉంటాం.. వారి సమస్యలు తీరుస్తాం. ఆన్‌లైన్‌లో అన్ని ఫ్లాట్‌ఫామ్‌ల డేటా ఉంది కానీ.. గిగ్ వర్కర్ల డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదు. మీకెంత జీతం వస్తుంది మీరెంత సంపాదిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇకపై మీరు సంపాదించే ప్రతీ పైసా లెక్క మీకు తెలుస్తుంది. గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునేందుకు సరైన షెల్టర్ కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం వైఫైతో కూడిన షెల్టర్‌ను ఏర్పాటు చేస్తోంది.
..ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైన తీవ్రంగా నష్టపోతారు. గిగ్ వర్కర్ల కోసం రూ.10 లక్షల ఆరోగ్య బీమా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది. మీకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాడు మౌనం.. నేడు 100 కోట్లతో ప్రచారమా?:


