సమావేశంలో సీఎస్ సంజయ్, మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తదితరులు
బట్టీ కాకుండా సృజనాత్మకతను వెలికితీయాలి
నిలేకని కమిటీతో విద్యాశాఖ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పరీక్షల విధానంలో విప్లవాత్మక మార్పులు అవసరమని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు నిలేకని కమిటీకి స్పష్టం చేశారు. పరీక్షలు విద్యారి్థలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభను వెలికితీసేలా ఉండాలని అన్నారు. బట్టీ విధానం కాకుండా, సృజనాత్మకతను వెలికితీసేలా ఉండాలని సూచించారు.
టెక్నాలజీ యుగంలో అనువైన సంస్కరణలు అవసరమని తెలిపారు.దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షల సంస్కరణలపై అభిప్రాయాలు సేకరిస్తున్న కమిటీ శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో పరీక్షల కోసం తీసుకొచి్చన సంస్కరణలను మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కమిటీ ప్రతినిధులకు వివరించారు.
అక్రమాలకు, లీకేజీలకు నోచాన్స్
పరీక్షల్లో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్టు చైర్మన్ చెప్పారు. 8 ప్రవేశ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహిస్తున్నామని, అభ్యర్థుల హాల్‌టికెట్లకు క్యూఆర్ కోడ్ జోడించడంతో పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించే అవకాశం కల్పించామని చెప్పారు.
గూగుల్ మ్యాప్స్ ద్వారా పరీక్షా కేంద్రానికి వెళ్లే మార్గం, దూరం, ట్రాఫిక్ పరిస్థితులు, ప్రయాణ సమయాన్ని తెలుసుకునే సదుపాయం అందిస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పూర్తయిన వెంటనే మార్కులను వెల్లడిస్తున్నామని, ప్రశ్నపత్రాల సరఫరాకు ఎన్‌క్రిప్షన్ విధానం, బ్యాకప్ సర్వర్లు్ల మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఎప్‌సెట్ ప్రవేశాల ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా మాక్ కౌన్సెలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం మరో కీలక సంస్కరణగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పీజీ మెడికల్ కోర్సులకు వెబ్ ఆప్షన్లు షురూ!


