పీజీ మెడికల్‌ కోర్సులకు వెబ్‌ ఆప్షన్లు షురూ! | Telangana PG Medical Admissions 2026-27 | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్‌ కోర్సులకు వెబ్‌ ఆప్షన్లు షురూ!

Nov 14 2026 9:53 AM | Updated on Nov 14 2026 9:53 AM

Telangana PG Medical Admissions 2026-27

తొలి విడతలో 15వ తేదీ మధ్యాహ్నం 2 వరకు అవకాశం

ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ

కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ నోటిఫికేషన్‌

గడువులోగా కాలేజీలో చేరకపోతే సీటు రద్దు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ మెడికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు కనీ్వనర్‌ కోటా తొలి విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్‌ నాన్‌మైనారిటీ, మైనారిటీ మెడికల్‌ కాలేజీలతో పాటు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో నాన్‌ సరీ్వస్, సరీ్వస్, దివ్యాంగుల కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. శుక్రవారం విడుదల చేసిన తుది మెరిట్‌ జాబితాలో పేర్లున్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆప్షన్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అదనంగా మంజూరయ్యే సీట్లను తదుపరి విడతల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

ఆప్షన్లు ఇవ్వకుంటే అనర్హులే: తొలి విడతలో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సెలింగ్‌ విడతల్లో పాల్గొనే అవకాశం ఉండదు. కోరుకున్న సీటు కేటాయించాక నిరీ్ణత గడువులో కాలేజీలో చేరకపోతే తదుపరి రౌండ్లకు అనర్హులవుతారు. ఆప్షన్లను సేవ్‌ చేసేటప్పుడు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆప్షన్ల ప్రింటవుట్‌ తీసుకోవాలి.

సీటు పొందిన అభ్యర్థులు రూ.35 వేల యూనివర్సిటీ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి అలాట్‌మెంట్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ట్యూషన్‌ ఫీజును సంబంధిత కాలేజీలో చెల్లించాలి. నిరీ్ణత గడువులో ఒరిజినల్‌ సరి్టఫికెట్లు, బాండ్లతో కాలేజీలో రిపోర్టు చేయాలి. గడువులోగా చేరకపోయినా, సరి్టఫికెట్లలో తేడాలున్నా సీటును రద్దు చేస్తారు. చెల్లించిన ఫీజులు కూడా తిరిగి ఇవ్వరు.

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఎల్‌పీ, తెలంగాణ హైకోర్టులోని రిట్‌ పిటిషన్లపై వెలువడే తీర్పులకు లోబడి ప్రవేశాలు ఉంటాయని వర్సిటీ రిజి్రస్టార్‌ జేవీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా మైనారిటీ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ముస్లిం అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు. అయితే వారు ఇతర కాలేజీల్లోని సీట్లకూ పోటీపడవచ్చు.

ఇదీ చదవండి: రూ. 5.61లక్షల కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement