నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌! | Telangana Diabetes Emergency Cases 108 Report | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు.. డయాబెటిస్‌పై అలర్ట్‌!

Nov 14 2026 10:33 AM | Updated on Nov 14 2026 10:33 AM

Telangana Diabetes Emergency Cases 108 Report

షుగర్‌తో ‘అత్యవసర’ పరుగు

108 సర్వీసెస్‌ నివేదికలో షాకింగ్‌ విషయాలు

మూడేళ్లలో 18,054 మంది బాధితుల ఎమర్జెన్సీ కాల్స్‌.. లో షుగర్‌తో 13,219 మంది ఆస్పత్రులకు తరలింపు

హై షుగర్‌తో 4,835 మంది కాల్స్‌

డయాబెటిస్‌ ఎమర్జెన్సీలో మగాళ్లే అత్యధికం

మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయొద్దు..

నవంబర్‌ 14.. నేడు ప్రపంచ మధుమేహ దినోత్సవం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో చాపకింద నీరులా మధుమేహం విస్తరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అత్యవసర పరిస్థితులకు దారితీస్తోంది. నవంబర్‌ 14న ‘ప్రపంచ మధుమేహ దినోత్సవం’సందర్భంగా 108 ఎమర్జెన్సీ సరీ్వసెస్‌ వెల్లడించిన నివేదిక విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. 2024 జనవరి నుంచి 2026 సెపె్టంబర్‌ వరకు మొత్తం 18,054 మంది డయాబెటిస్‌ సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో 108ని ఆశ్రయించారు.

వీరిలో పురుషులు 53 శాతం, మహిళలు 47 శాతంగా ఉన్నారు. తక్కువ చక్కెర స్థాయిలు (హైపోగ్లైసీమియా) కారణంగా 13,219 మందిని, అధిక చక్కెర స్థాయిలు (హైపర్‌గ్లైసీమియా) కారణంగా 4,835 మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇలా డయాబెటిస్‌ ఎమర్జెన్సీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ‘మధుమేహంపై ముందస్తు చర్య’థీమ్‌తో వరల్డ్‌ డయాబెటిస్‌ డేను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమా రు 83 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా, భారత్‌లోనే దాదాపు 9 కోట్ల మంది ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నలుగురిలో ముగ్గురు పట్టణవాసులే.. 
మధుమేహం అత్యవసర కేసులను రాష్ట్రంలోని జిల్లాలవారీగా పరిశీలిస్తే ఆదిలాబాద్, హైదరాబాద్‌ జిల్లాల్లో అత్యధికంగా 2,252 చొప్పున కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్‌లో 346, మెదక్‌లో 442 కేసులు రికార్డయ్యాయి. జిల్లాకు సగటున 550 అత్యవసర కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు పట్టణ ప్రాంతాలకు చెందినవారే. వయసుల వారీగా 55–60 ఏళ్ల మధ్య 2,665 మంది(14.76%), 60–65 ఏళ్ల మధ్య 2,398 మంది(13.28%), 65–70 ఏళ్ల మధ్య 2,304 మంది(12.76%) ఉన్నారు.

లో షుగర్, హై షుగర్‌.. కారణాలు
రక్తంలో గ్లూకోజ్‌ (చక్కెర) స్థాయి సాధారణం కంటే 70 ఝజ/ ఛీఔ (డెసిలీటర్‌కు మిల్లీగ్రాము లు) కంటే తక్కువకు పడిపోవడాన్ని హైపోగ్లైసీమియా (లో షుగర్‌) అంటారు. ఇన్సులిన్‌ లేదా మధుమేహ మాత్రలను అధిక మోతాదులో తీసుకోవడం, భోజనం మానేయడం, వ్యాయామం అధికంగా చేయడం, ఖాళీ కడుపుతో మద్యం సేవించడం దీనికి కారణాలు.

వణుకు, విపరీతమైన చెమటలు, గుండె దడ, తలతిరగడం, నీరసం, గందరగోళం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు 180  ఝజ/ ఛీ∙కంటే ఎక్కువగా ఉండటాన్ని హైపర్‌గ్లైసీమియా(హై షుగర్‌) అంటారు. మందులు సరిగా వాడకపోవడం, అధిక కార్బోహైడ్రేట్ల ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ఇన్‌ఫెక్షన్లు, ఒత్తిడి, స్టెరాయిడ్‌ మందులు దీనికి కారణాలు. తరచూ మూత్రవిసర్జన, తీవ్రమైన దాహం వేయడం, అలసట, నోరు పొడిబారడం, చూపు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఈ రెండు పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే గుండె, మెదడు, మూత్రపిండాలు, పాదాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. రెగ్యులర్‌గా చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహాన్ని నిర్లక్షం చేయొద్దు.. అప్రమత్తంగా ఉండండి.

108 అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స 
మధుమేహ బాధితుల్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, తీవ్రమైన నీరసం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే 108కు కాల్‌ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అంబులెన్స్‌లోని అత్యవసర వైద్య సిబ్బంది గ్లూకోమీటర్‌తో చక్కెర స్థాయిలు, ఇతర ఆరోగ్య సూచికలను పరీక్షించి, డాక్టర్ల సూచనలతో అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తారని చెబుతోంది. తర్వాత ఆస్పత్రికి తరలించి వైద్య నిపుణులు సరైన వైద్యం అందిస్తారని పేర్కొంటోంది.

ఇదీ చదవండి: కూతుళ్లకై.. తండ్రుల షాకింగ్‌ ఘటన! ఒకరు కష్టార్జితం.. మరొకరి చోరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement