breaking news
World Diabetes Day
-
యోగాతో డయాబెటిస్‌కు చెక్ చెప్పవచ్చా?
World Diabetes Day డయాబెటిస్ నియంత్రణకు యోగా పనికొస్తుందా అంటే కచ్చితంగా పనికొస్తుంది. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, జీవన శైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచు కోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు, అధిక బరువు సమస్యనుంచి కూడా బయట పడవచ్చు. అధిక బరువు, అధిక స్థాయిలో ఉన్న షుగర్ శరీర అవయవాల పని తీరును దెబ్బతీస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని రకాల యోగాసనాల గురించి తెలుసుకుందాం.కొన్ని రకాలు యోగాసనాలు ఒత్తిడిని నిర్వహించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, విశ్రాంతికి, రక్త ప్రసరణను మెరుగు పర్చడానికి దోహదపడతాయి. ఎవరైనా చేయొచ్చా? ఎలా ప్రారంభించాలి?యోగా వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.వారానికి 2-3 సెషన్లతో ప్రారంభించవచ్చు. అవాటైన కొద్దీ క్రమంగా, సౌలభ్యతను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.యోగా సాధనకు కావలసిందల్లా యోగా మ్యాట్ ,సౌకర్యవంతమైన దుస్తులు. అదనపు సపోర్ట్ కోసం బ్లాక్స్, పట్టీలు , బోల్స్టర్ వంటివి ఉంచుకోవచ్చు. ఇవి ఆప్షనల్.యోగా జీవక్రియను పెంచడం, కండరాల స్థాయిని మెరుగుపరచడం ,ఒత్తిడికి సంబంధించిన ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. షుగర్ - ముఖ్య యోగాసనాలు కాళ్ళు పైకి వంగి భంగిమ (విపరిత కరణి): హఠ యోగాలో ఒక భంగిమ విశ్రాంతినిస్తుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ (పశ్చిమోత్తనాసన): ఈ భంగిమ ఆందోళనను, అలసటను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ధనురాసన: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది. కోబ్రా భంగిమ (భుజంగాసన): కండరాలను బలపరుస్తుంది. ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.సుపైన్ స్పైనల్ ట్విస్ట్ (సుప్త మత్స్యేంద్రసన): ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది. (రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)ఒంటె భంగిమ (ఉస్ట్రాసనం): పక్కటెముకలకు చక్కటి బలాన్నిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండెకు, శరీరానికి శక్తినిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.పర్వత భంగిమ (తడాసనం): భంగిమను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ యోగాసనాలన్నీ బరువు నియంత్రణలోనూ, మంచి నిద్రకు కూడా బాగా ఉపయోగపడతాయి. నోట్ : వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అనేక యోగాసనాలను యోగా నిపుణుల ద్వారా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ భంగిమలు మందులు, ఆహారం , సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గమనించాలి. ఒక వేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.ఇదీ చదవండి: జిమ్‌కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది! -
జిమ్‌కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది!
World Diabetes Day November 14th మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహార నియమాలతోపాటు, తేలికపాటి వ్యాయామం కూడా అవసరం. క్రమం తప్పకుండా, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా లాంటి చేయడం వలన షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం జిమ్ సభ్యత్వం, ఫ్యాన్సీ గాడ్జెట్లపై ఆధారపడ వలసిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులే, చిన్న పాటి వ్యాయామాలే ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నడక, స్ట్రెచింగ్, స్క్వాట్లు లేదా వాల్ పుష్-అప్లు వంటి సాధారణ కదలికలు జీవక్రియకు అద్భుతాలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.అంటే ఇన్సులిన్ సహాయం లేకుండానే, కండరాలు రక్తం నుండి నేరుగా గ్లూకోజ్‌ను గ్రహిం చేందుకు ఇవి ఉపయోగపడతాయి. వ్యాయామం చేసినప్పుడు, కండరాల్లోని మైటోకాండ్రియా పవర్‌హౌస్‌లను మేల్కొల్పుతాయి. ఇవి చక్కెర , కొవ్వు రెండింటినీ బర్న్ చేస్తాయి. తద్వారా అదనపు గ్లూకోజ్‌ను క్లియర్ చేయడంతోపాటు, ఇన్సులిన్ నిరోధకతను కలిగించే అదనపు కొవ్వును కరిగిస్తుంది.రెగ్యులర్ వ్యాయామం PGC-1 ఆల్ఫా అని పిలిచే ప్రత్యేక ప్రోటీన్‌ను పెంతుంది. ఇది మైటోకాండ్రియల్ పెరుగుదలను పెంచుతుంది. క్రమంగా ఈ ప్రక్రియ భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. దీర్ఘకాలిక జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.తేలికపాటి వ్యాయామాలుచురుకైన నడక (Brisk Walk): భోజనం తర్వాత పదిహేను నిమిషాలు కండరాలు చక్కెరను గ్రహించడంలో సహాయ పడతాయి.వాల్ పుష్-అప్లు: సున్నితమైనవేకాన ఎగువ శరీరం ,రక్త ప్రవాహానికి ప్రభావవంతంగా ఉంటాయి.స్క్వాట్లు అండ్ లంగెస్ (Squats and lunges) కాళ్లను బలోపేతం చేస్తాయి . గ్లూకోజ్ తీసుకోవడంలో మద్దతు ఇస్తాయి.లైట్ స్ట్రెచింగ్ అండ్ యోగా: మనస్సును ప్రశాంతపరుస్తాయి . ఒత్తిడి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.రెసిస్టెన్స్ బ్యాండ్ శిక్షణ: కండరాలను బలంగా చేస్తుందీ వ్యాయామం. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.సోలియస్ పుష్-అప్లు: కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలను పైకి కిందికి కదలించేలా చేసే వ్యాయామం.క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు అడ్రినలిన్, నోరాడ్రినలిన్,అడిపోనెక్టిన్‌ను పెంచుతుంది, ఇవన్నీ రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి హార్మోను కార్టిసాల్‌ను కూడా తగ్గిస్తాయి. అధికసుగర్స్థాయిలు అనారోగ్యానికి మూలం అని గమనించండి! మరింకెందుకు ఆలస్యం, హాయిగా ఆరోగ్యంగా ఉండాలన్నా, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఈ క్షణం నుంచే వ్యాయామ నియమాన్ని పాటించండి! -
10.1 కోట్ల మంది : ఒడుదొడుకులే అసలు కారణం
మధుమేహ బాధితుల పరంగా భారత దేశం ప్రపంచానికే రాజధాని అయితే, దక్షిణాది రాష్ట్రాలు భారతదేశానికి రాజధానులుగా మారాయని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మధు మేహ బాధితుల సంఖ్య ఇప్పుడు 10.1 కోట్లకు చేరింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మధుమేహం (Diabetes) క్రమంగా వేగాన్ని పుంజుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధుమేహం నియంత్రణ, నిరోధం పట్ల అవగాహన కల్పించడానికి ఇన్సులిన్‌ను కనుగొన్న సర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీని ‘ప్రపంచ మధుమేహ నిరోధక దినం’గా ప్రతి ఏడాదీ జరుపుకోవడం ముదావహం.నేడు మనిషి జీవన విధానం, ఆహారంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు... మధుమేహం వంటి జీవితకాల దీర్ఘ వ్యాధులకు ఆజ్యం పోస్తున్నాయి. అతి చిన్న వయసు నుండే ఏమాత్రం శారీరక శ్రమ లేక పోవడం, ఆహారంలో చోటు చేసు కున్న మార్పులు, కల్తీలు, పంట పొలాల్లో వేసే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ మార్పులు, కొత్త కొత్త వైరల్ వ్యాధులు, వృత్తిపర మానసిక ఒత్తిడి, జన్యువులలో ఉత్పరివర్తనలు... ఇలా ఎన్నో కారణాలు రక్తంలో షుగర్‌ను నియంత్రించే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)ని అసాధారణ రీతిలో ప్రభావితం చేస్తున్నాయి. శరీర అవసరాలకు సరిపడా ఇన్సులిన్ (Insulin) ఉత్పత్తి కాకపోవటం, ఇన్సులిన్ పనితీరులోని లోపాలు (రెసిస్టెన్స్), శరీర కణాలు ఇన్సులిన్‌ను వినియోగించుకోలేకపోవడం... వెరసి రక్తంలో అసాధారణ స్థాయిలో చక్కెర శాతాన్ని పెంచేస్తున్నాయి. చదవండి: ఆంక్షలతోనా వేతన సంఘాన్ని నియమించేది?మనం నిత్య జీవితంలో వాడే ప్లాస్టిక్‌ల అవశేషాల ప్రభావం వల్ల ప్యాంక్రి యాస్ సహజసిద్ధంగా ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను శరీర అవసరాలకు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతోంది. ఇన్సులిన్ ఉత్పత్తి అయినా... శరీర కణజాలాలలో నిరోధకత వచ్చి అది ఉపయోగపడక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి (Sugar Level) అసాధారణ రీతిలో పెరిగిపోతోంది. మందుల వాడకం, ఆహార నియమాలు పాటించటం, క్రమం తప్పక వ్యాయామం చేయడం ద్వారా జీవితాంతం అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ టి. సేవకుమార్ వ్యవస్థాపకులు, ఎస్.హెచ్.ఓ. హైపర్ టెన్షన్–డయాబెటిక్ క్లబ్, గుంటూరు(నవంబర్ 14 ప్రపంచ మధుమేహ నిరోధక దినం)


