World Diabetes Day డయాబెటిస్ నియంత్రణకు యోగా పనికొస్తుందా అంటే కచ్చితంగా పనికొస్తుంది. నిజానికి చెప్పాలంటే చిన్న చిన్న వ్యాయామాలు, జీవన శైలి మార్పులతో మధుమేహాన్ని అదుపులో ఉంచు కోవచ్చు. కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల ద్వారా షుగర్ నియంత్రణలో ఉండటంతోపాటు, అధిక బరువు సమస్యనుంచి కూడా బయట పడవచ్చు. అధిక బరువు, అధిక స్థాయిలో ఉన్న షుగర్ శరీర అవయవాల పని తీరును దెబ్బతీస్తుంది. తద్వారా అనేక అనారోగ్య సమస్యలొస్తాయి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ నియంత్రణకు ఉపయోగపడే కొన్ని రకాల యోగాసనాల గురించి తెలుసుకుందాం.
కొన్ని రకాలు యోగాసనాలు ఒత్తిడిని నిర్వహించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, విశ్రాంతికి, రక్త ప్రసరణను మెరుగు పర్చడానికి దోహదపడతాయి.
ఎవరైనా చేయొచ్చా? ఎలా ప్రారంభించాలి?
యోగా వశ్యత, బలం మరియు సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, మానసిక స్పష్టతను పెంచుతుంది మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.
వారానికి 2-3 సెషన్లతో ప్రారంభించవచ్చు. అవాటైన కొద్దీ క్రమంగా, సౌలభ్యతను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుకోవచ్చు.
యోగా సాధనకు కావలసిందల్లా యోగా మ్యాట్ ,సౌకర్యవంతమైన దుస్తులు. అదనపు సపోర్ట్ కోసం బ్లాక్స్, పట్టీలు , బోల్స్టర్ వంటివి ఉంచుకోవచ్చు. ఇవి ఆప్షనల్.
యోగా జీవక్రియను పెంచడం, కండరాల స్థాయిని మెరుగుపరచడం ,ఒత్తిడికి సంబంధించిన ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
షుగర్ - ముఖ్య యోగాసనాలు
కాళ్ళు పైకి వంగి భంగిమ (విపరిత కరణి): హఠ యోగాలో ఒక భంగిమ విశ్రాంతినిస్తుంది, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణ , ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
సీటెడ్ ఫార్వర్డ్ బెండ్ (పశ్చిమోత్తనాసన): ఈ భంగిమ ఆందోళనను, అలసటను తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ధనురాసన: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కోబ్రా భంగిమ (భుజంగాసన): కండరాలను బలపరుస్తుంది. ఇన్సులిన్‌ను ఉపయోగించుకునే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుంది.
సుపైన్ స్పైనల్ ట్విస్ట్ (సుప్త మత్స్యేంద్రసన): ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది.
(రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ)
ఒంటె భంగిమ (ఉస్ట్రాసనం): పక్కటెముకలకు చక్కటి బలాన్నిస్తుంది. వెన్నుముకను బలపరుస్తుంది. గుండెకు, శరీరానికి శక్తినిస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.
పర్వత భంగిమ (తడాసనం): భంగిమను మెరుగుపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది ఇన్సులిన్ సున్నితత్వాన్ని రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈ యోగాసనాలన్నీ బరువు నియంత్రణలోనూ, మంచి నిద్రకు కూడా బాగా ఉపయోగపడతాయి.
నోట్ : వివిధ ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అనేక యోగాసనాలను యోగా నిపుణుల ద్వారా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఈ భంగిమలు మందులు, ఆహారం , సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని గమనించాలి. ఒక వేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.
ఇదీ చదవండి: జిమ్‌కే వెళ్లక్కరలేదు.. చిన్న మార్పులు చాలు, షుగర్ దిగొస్తుంది!


