జమ్మూ కశ్మీర్‌లోకి అక్రమంగా దాదాపు 30 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా సంస్థలు హెచ్చరించడంతో ఆ ప్రాంతంలో సైన్యం నిఘాను పెంచింది. 'చిల్లై కలాన్'( అత్యంత చలిఉండే కాలం)ను సైతం లెక్కచేయకుండా డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలతో భద్రత సంస్థలు నిరంతరం నిఘాను పెంచుతున్నాయి.
జమ్ముకశ్మీర్‌లోని వాతావరణ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సాధారణ సమయంలోనే ఎముకలు గడ్డకట్టే చలి ఉండే ఆ ప్రాంతంలో ఇక చలికాలం ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకూ మధ్య కాలాన్ని (చిల్లైకలాన్) అత్యంత కఠినమైన చలి ఉండే కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది. నదులు, సరస్సులు, గడ్డకట్డి పోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటాయి.
ఇటువంటి సమయంలో అక్కడ జీవించడమే అత్యంత కష్టమైన పని కానీ భారత ఆర్మీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడడం కోసం కఠినమైన ఆపరేషన్ చేపడుతుంది. జమ్మూ రీజియన్‌లో ముష్కరులకు ఎటువంటి సహాయం అందకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. సున్నిత ప్రాంతాలలో సైనికుల మోహరింపును పెంచింది. కొండలు, అడవులు, మారుమూల లోయ గ్రామాలను జల్లెడ పడుతోంది. గుల్మార్ల్, సోనాలేక్, థాల్ సరస్సు వంటి సమస్యత్మాక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచింది.
అంతేకాకుండా ఉగ్రవాదులు సహాయం పొందే అవకాశాలున్న ప్రాంతాల్లో భద్రత పెంచింది. కఠినమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సైన్యం కొద్దిగా వెనక్కి తగ్గితే ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చినట్లనే ఉద్దేశంతో జమ్మూకశ్మీర్ రీజన్‌లో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.


