ఉగ్రవాదుల కాల్పులు.. 162మంది మృతి | Terrorist attacks in Nigeria kill 162 people | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల కాల్పులు.. 162మంది మృతి

Feb 5 2026 12:29 AM | Updated on Feb 5 2026 12:57 AM

Terrorist attacks in Nigeria kill 162 people

నైజీరియాలో దారుణం జరిగింది. క్వారా రాష్ట్రంలోని రెండు గ్రామాలపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ప్రజలపై బుల్లెట్లతో విరుచుకపడ్డారు. ఈ దాడులలో కనీసం 162 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.

పశ్చిమ నైజీరియాలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. నిన్న మంగళవారం సాయంత్రం క్వారా రాష్ట్రంలోని వొరాన్ ,యునుకు గ్రామాలను లక్షంగా చేసుకొని కాల్పులకు తెగబడ్డారు. దీంతో 162 మంది పౌరులు అక్కడికక్కడే మృతిచెందారు. కాల్పుల సమాచారం భద్రతా బలగాలకు అందినప్పటికీ అవి చాలా దూరం ఉన్నందున సమయానికి అక్కడికి చేరుకోలేకపోయామని భద్రతా బలగాలు తెలిపాయి.

దీనిపై క్వారా రాష్ట్ర గవర్నర్ స్పందించారు. ఉగ్రవాదులను అణిచివేస్తున్నందుకే వారు దాడులకు తెగబడ్డారని తెలిపారు. ఇది అత్యంత పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఉగ్రమూకలే ఈ దాడులు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం నైజీరియా  తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటుంది. దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రదాడులు నిరంతరం జరుగుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement