గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన అపార్ట్‌మెంట్‌లో ఒక వ్యక్తి తన భార్యను కాల్చి చంపి, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్వల్ప వివాదమే ఈ విషాదానికి కారణంగా తెలుస్తోంది.
పోలీసుల ప్రకారం మృతులను గుజరాత్ మారిటైమ్ బోర్డులో క్లాస్-1 అధికారి యశరాజ్‌సింగ్ గోహిల్ , అతని భార్య రాజేశ్వరి గోహిల్‌గా గుర్తించారు. ఈ జంటకు కేవలం రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. బుధవారం రాత్రి ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే క్షణికావేశంతో యశరాజ్‌సింగ్ తన లైసెన్స్ రివాల్వర్‌తో రాజేశ్వరిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత, యశరాజ్‌సింగ్ 108 అత్యవసర సేవకు ఫోన్ చేశాడు. అధికారులు అక్కడికే చేరుకునేసమయానికే రాజేశ్వరి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్యవసర బృందం ఫ్లాట్ నుండి వెళ్లిపోయిన తర్వాత, యశరాజ్‌సింగ్ మరో గదిలోకి వెళ్లి అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: రూ. 40 వేల కోట్ల కంపెనీకి సారథి : వైఫల్యాలు వెక్కిరించినా!
మరోవైపు యశరాజ్‌సింగ్ గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు , రాజ్యసభ ఎంపీ శక్తిసింగ్ గోహిల్ మేనల్లుడు. ఈ మరణాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి విచారం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అన్నారు. అతనొక యువ అధికారి, ఇటీవల పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ మారిటైమ్ బోర్డులో చేరాడనీ, యూపీఎస్సీకి కూడా సిద్ధమవుతున్నాడని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని విచారం వ్యక్తం చేశారు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అతని తుపాకీ లైసెన్స్, 108 కాల్ రికార్డులు వంటి వివరాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: మొన్ననే పెళ్లి, తగాదా...నాలుక కొరికేసింది, తీవ్ర ఘర్షణ!


